ETV Bharat / state

Revanth Reddy Free Electricity Comments : 'ఉచిత విద్యుత్​పై మాట్లాడిన మాటలను.. బీఆర్​ఎస్​ ఎడిట్​ చేసింది'

author img

By

Published : Jul 13, 2023, 5:45 PM IST

Updated : Jul 13, 2023, 7:53 PM IST

revanth reddy
revanth reddy

Revanth Reddy Comments On KCR : ఉచిత విద్యుత్​పై అమెరికా పర్యటనలో ఉన్న రేవంత్​ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర దుమారమే రేపాయి. అందుకు తాను చేసిన వ్యాఖ్యలపై గాంధీభవన్​లో వివరణ ఇచ్చారు. ఉచిత విద్యుత్​పై తాను చేసిన మాటలను ఎడిట్​ చేశారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి మండిపడ్డారు. ఉచిత విద్యుత్​ ఇవ్వడం కుదరదని ఆనాడు కేసీఆరే టీడీపీ ప్రభుత్వంతో చెప్పించారని గుర్తు చేశారు.

Revanth Reddy Explanation On Free Electricity Comments : ఉచిత విద్యుత్​పై తన మాటలను వక్రీకరించి.. తాను వేర్వేరుగా మాట్లాడిన మాటలను ఎడిట్​ చేసి తప్పుదారి పట్టించారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి మండిపడ్డారు. ఇప్పుడు ఉచిత విద్యుత్​పై ప్రభుత్వ పెద్దలతో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్​ విసిరారు. హైదరాబాద్​లోని గాంధీభవన్​లో మీడియా సమావేశం నిర్వహించి.. రేవంత్​రెడ్డి అమెరికా పర్యటనపై వివరణ ఇచ్చారు.

అమెరికాలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో కాంగ్రెస్ విధానాలను ఎన్​ఆర్​ఐలకు చెప్పానని రేవంత్​రెడ్డి తెలిపారు. ఉచిత విద్యుత్​పై కొందరు నిపుణుల సందేహాలకు సమాధానం మాత్రమే ఇచ్చానన్నారు. రైతులకు ఉచిత విద్యుత్​ను తీసువచ్చిందే నాటి కాంగ్రెస్​ ప్రభుత్వమని స్పష్టం చేశారు. బషీర్​బాగ్​ కాల్పుల ఘటన జరిగినప్పుడు కేసీఆర్​ తెలుగుదేశంలోనే కదా ఉన్నారన్నారు. ఉచిత విద్యుత్​ ఇవ్వడం కుదరదని ఆనాడు కేసీఆరే టీడీపీ ప్రభుత్వంతో చెప్పించారని గుర్తు చేశారు.

ఉచితం అబద్ధం.. అవినీతి నిజం

Revanth Reddy Fires On CM KCR : వైఎస్​ఆర్​ ముఖ్యమంత్రిగా తొలి సంతకం ఉచిత విద్యుత్​ దస్త్రంపైనే చేశారన్న విషయాన్ని అధికార పక్షం గ్రహించాలని రేవంత్​ రెడ్డి అన్నారు. రైతుల సాగుకు 9 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్​ను ఇచ్చింది కాంగ్రెస్​ పార్టీనే అని అన్నారు. ఉచిత విద్యుత్​తో పాటు రాయితీపై ఎన్నో వ్యవసాయ పనిముట్లు ఇచ్చామని.. అలాగే వేల కోట్లను ఇన్​పుట్​ సబ్సిడీలుగా రైతులకు కాంగ్రెస్​ ప్రభుత్వమే ఇచ్చిందనే విషయం మరిపోకూడదన్నారు.

"ఉచిత విద్యుత్​పై తన మాటలను వక్రీకరించారు. వేర్వేరు సభల్లో మాట్లాడిన మాటలను బీఆర్​ఎస్​ నేతలు, కేటీఆర్​ ఎడిట్​ చేశారు. అమెరికా పర్యటనలో కాంగ్రెస్​ విధివిధానాలపై ఎన్​ఆర్​ఐలతో చర్చించాను. కాంగ్రెస్​ పార్టీ గత చరిత్రను, సాంకేతిక పరమైన అంశాలను కూడా వివరించే ప్రయత్నం చేశాను. వాటినే ఇప్పుడు బీఆర్​ఎస్​ వక్రీకరించింది." - రేవంత్​ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

తెలంగాణకు విద్యుత్​ విషయంలో సోనియాగాంధీ ప్రత్యేక చొరవ : రాష్ట్ర విభజన తర్వాత విద్యుత్​ విషయంలో నష్టం జరగకుండా కాంగ్రెస్​ అధిష్ఠానం జాగ్రత్తలు తీసుకుందని తెలిపారు. వినియోగం ఆధారంగా తెలంగాణకే ఎక్కువ విద్యుత్​ వచ్చేలా సోనియాగాంధీ ప్రత్యేక చర్యలు తీసుకొని.. 40 శాతం జనాభా ఉన్న తెలంగాణకు 53 శాతం విద్యుత్​ కేటాయింపులు చేశారని రేవంత్​రెడ్డి అన్నారు. తెలంగాణ రైతులకు విద్యుత్​ ఎంత ముఖ్యమో 20 ఏళ్ల క్రితమే కాంగ్రెస్​ ఆలోచించిందన్నారు. వాస్తవంగా కేసీఆర్​ 24 గంటల విద్యుత్​ పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారని రేవంత్​ రెడ్డి ఆరోపించారు.

Revanth Reddy Revealed Details America Tour : భద్రాద్రి, యాదాద్రి విద్యుత్​ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని గతంలో కేసీఆర్​ చెప్పారని గుర్తు చేశారు. మరి ఆ విద్యుత్​ ప్లాంట్లు ఏమైయ్యాయి. కాంగ్రెస్​ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 24 గంటల ఉచిత విద్యుత్​ను అందిస్తామని హామీ ఇచ్చారు. ఇదే విషయాన్ని సెప్టెంబర్ 17న మేనిఫెస్టోలో ప్రకటిస్తామని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి :

Last Updated :Jul 13, 2023, 7:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.