ETV Bharat / technology

ప్రాజెక్ట్‌ అస్త్ర - జీమెయిల్‌లో జెమినీ - వీడియోల కోసం వియో - గూగుల్​ సరికొత్త ఫీచర్స్​! - Google Project Astra

author img

By ETV Bharat Telugu Team

Published : May 16, 2024, 10:51 PM IST

Google Project Astra : గూగుల్ మరిన్ని ఫీచర్లను యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. ఏఐ మోడల్ జెమినీలో కొత్త వెర్షన్​ను విడుదల చేసింది. ఏఐను అనుసంధానిస్తూ గూగుల్ సెర్చ్​ను మరింత సులువుగా మార్చింది. ఇంకా ఏయే అప్​గ్రేడ్​లను తీసుకొచ్చిందంటే?

Google upcoming features
Google Project Astra (Etv Bharat)

Google Project Astra : గూగుల్‌ తమ ఏఐ మోడల్‌ జెమినీలో కొత్త వెర్షన్​ను లాంఛ్ చేసింది. ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్​ను ఏఐ ఫీచర్లతో మరింత అధునాతనంగా తీర్చిదిద్దింది. ఏఐను అనుసంధానిస్తూ గూగుల్‌ సెర్చ్​ను మరింత ఈజీగా మార్చింది. వీడియోల క్రియేషన్‌ కోసం కొత్త టూల్స్​ను తీసుకువచ్చింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన వార్షిక సదస్సులో తమ ప్రొడక్టులకు మరిన్ని అప్​గ్రేడ్‌లను గూగుల్‌ ప్రకటించింది. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

వీడియో - లెన్స్ సెర్చ్​
గూగుల్‌ లెన్స్‌ లో ఇప్పటికే ఇమేజ్‌ ఆధారంగా సెర్చ్‌ చేయవచ్చు. వీడియోలతోనూ సెర్చ్‌ చేసేలా లెన్స్​ను అప్‌గ్రేడ్‌ చేసింది గూగుల్. వీడియో తీస్తూ మధ్యలో ఏదైనా ప్రశ్న వేస్తే, అందుకనుగుణంగా సెర్చ్‌ రిజల్ట్స్‌ వస్తుంటాయి.

ఆస్క్ ఫొటోస్ ఫీచర్
ఎక్కువ సంఖ్యలో ఉండే గూగుల్‌ ఫొటోస్‌ నుంచి, మనకు కావాల్సిన ఫొటోలను వెతకడం ఒక్కోసారి కష్టం అవుతుంది. దానికి పరిష్కారంగా 'ఆస్క్‌ ఫొటోస్‌' ఫీచర్​ను తీసుకొచ్చింది గూగుల్. జెమినీకి అనుసంధానిస్తూ ఈ ఫీచర్​ను తీర్చిదిద్దారు. కేవలం ఫొటో మాత్రమే కాకుండా దాంట్లోని కంటెంట్‌ ఆధారంగా కూడా సెర్చ్‌ చేయవచ్చు. ఉదాహరణకు బైక్‌ నంబర్‌ ప్లేట్​ను ఫొటో తీసి పెట్టుకుంటే, ఆ నంబర్‌ ఏంటని అడిగితే చాలు. పూర్తి ఫొటో కాకుండా నంబర్‌ మాత్రమే గుర్తించి మీకు చూపిస్తుంది. ఈ ఫీచర్​ను గూగూల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ స్వయంగా సదస్సులో అందరి ముందు ప్రదర్శించారు.

జెమినీ మరింత స్పీడ్​గా
గూగుల్‌ తమ ఏఐ మోడల్​లో జెమినీ 1.5 ఫ్లాష్‌ పేరిట కొత్త వెర్షన్​ను లాంఛ్ చేసింది. జెమినీ 1.5 ప్రో తరహాలోనే ఇది కూడా అత్యంత శక్తిమంతమైందని గూగుల్ తెలిపింది. అధిక-ఫ్రీక్వెన్సీతో, తక్కువ జాప్యంతో కూడిన పనుల కోసం దీన్ని తీసుకొచ్చామని పేర్కొంది. అనువాదం, రీజన్‌, కోడ్‌ సామర్థ్యాలను మరింత మెరుగుపరుస్తూ జెమినీ 1.5లోనూ మార్పులు చేశారు. జెమినీ 1.5 ప్రోలో కాంటెక్ట్స్‌ విండోను 1 మిలియన్‌ నుంచి 2 మిలియన్‌ టోకెన్లను విస్తరించారు.

జీ మెయిల్​లో జెమినీ
డాక్స్‌, షీట్స్‌, స్లైడ్స్‌, డ్రైవ్‌, జీ మెయిల్‌ వంటి వర్క్‌ స్పేసెస్​లో జెమినీ 1.5 ప్రోను అసిస్టెంట్‌ తరహాలో సైడ్‌బార్​గా తీసుకురానుంది గూగుల్. దీన్ని పెయిడ్‌ సబ్​స్క్రైబర్లకు మాత్రమే ఇవ్వనుంది. ఇది జీ మెయిల్‌ రాయడం, డ్రైవ్‌ సహా ఇతర వర్క్​స్పేసెస్​లో కావాల్సిన సమాచారాన్ని వెతికిపెట్టడం, కావాల్సినచోట ఫైల్స్​ను యాడ్‌ చేయడం వంటి వాటిని చేస్తుంది.

ప్రాజెక్ట్‌ అస్త్ర పేరిట గూగుల్ ఏఐ
ప్రాజెక్ట్‌ అస్త్ర పేరిట గూగుల్‌ మల్టీ మోడల్‌ ఏఐ అసిస్టెంట్​ను రూపొందిస్తోంది. ఇది ఒక వర్చువల్‌ అసిస్టెంట్‌. డివైజ్‌ కెమెరా ద్వారా ఏ వస్తువు ఎక్కడ ఉందో చూసి స్టోర్‌ చేసి పెట్టుకుంటుంది. మీతో మాట్లాడడమే కాకుండా, కొన్ని పనులను కూడా చేస్తుంది. రోజువారీ మానవ జీవితంలో భాగమయ్యేలా దీన్ని తీర్చిదిద్దుతున్నారు.

వీడియోల కోసం వియో
టెక్ట్స్‌, ఇమేజ్‌, వీడియో ఆధారిత ప్రాంప్ట్స్‌ ద్వారా 1080పీ క్వాలిటీ వీడియోలను రూపొందించేలా వియో అనే కొత్త జనరేటివ్‌ ఏఐ మోడల్​ను గూగుల్‌ తీసుకొచ్చింది. ఏరియల్‌ షాట్స్‌, టైమ్‌ ల్యాప్సెస్‌ సహా వివిధ స్టైళ్లలో వీడియోలను క్రియేట్‌ చేయొచ్చు. ఇప్పటికే యూట్యూబ్‌ వీడియో యూజర్లలో కొంతమందికి దీన్ని అందిస్తోంది. సినిమాల్లోనూ వినియోగించుకోగలిగేలా దీన్ని మెరుగుపర్చనున్నట్లు గూగుల్ వెల్లడించింది.

లైవ్‌ ఫీచర్‌
జెమినీ వాయిస్‌ చాట్‌ మరింత సహజంగా మార్చేలా లైవ్‌ ఫీచర్​ను గూగుల్ తీసుకొచ్చింది. దీని ద్వారా సమాధానాన్ని మధ్యలోనే ఆపేసేలా కమాండ్‌ ఇవ్వొచ్చు. అలాగే కెమెరా ద్వారా రియల్‌ టైమ్​లో చూస్తున్న దృశ్యాల ఆధారంగా సమాచారం ఇవ్వమని కోరవచ్చు. గూగుల్‌ క్యాలెండర్‌, టాస్క్స్‌ నుంచి సమాచారం తీసుకునేలా దీన్ని అప్డేట్ చేశారు.

లెక్కల్లో సాయం
ఆండ్రాయిడ్‌ ఫోన్‌, ట్యాబ్​లో ఒక గణిత సమస్యను సర్కిల్‌ చేసి సాయం పొందొచ్చు. అయితే ఇది లెక్కను పూర్తిగా పరిష్కరించదు. దాన్ని చిన్న భాగాలుగా విభజించి ఎలా పరిష్కరించాలో సూచిస్తుంది.

స్కామ్‌ కాల్స్‌కు చెక్‌!
జెమినీ నానో ఏఐ స్మార్ట్స్‌ ద్వారా ఆండ్రాయిడ్‌ ఫోన్లలో స్కామ్‌ కాల్స్​కు చెక్‌ పెట్టే ఫీచర్‌ను తీసుకొచ్చింది గూగుల్. దీన్ని మరింత మెరుగుపరిచి ఈ ఏడాది పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొంది.

వీడియోల ఆధారంగా ఆన్సర్స్
ఆండ్రాయిడ్‌ ఫోన్లలో స్క్రీన్​పై ప్లే అవుతున్న వీడియోలపై కూడా ప్రశ్నలు వేసి ఆన్సర్ రాబట్టుకునేలా జెమినీని అప్‌డేట్‌ చేసింది గూగుల్. ఆటోమేటిక్‌ క్యాప్చర్స్‌ ఆధారంగా అది స్పందిస్తుంది. పెయిడ్‌ యూజర్లు పీడీఎఫ్​లలోని సమాచారాన్నీ తెలుసుకోవచ్చు.

గూగుల్ క్రోమ్​లో ఏఐ అసిస్టెంట్‌
జెమినీ మోడల్‌ లైట్‌ వెయిట్‌ వెర్షన్‌ జెమినీ నానోను డెస్క్​టాప్‌లో క్రోమ్​కు లింక్ చేసింది. ఈ ఏఐ అసిస్టెంట్‌ సోషల్‌ మీడియా పోస్ట్‌ క్రియేషన్‌, ప్రొడక్ట్‌ రివ్యూల వంటి వాటిలో సాయం అందిస్తుంది.

లేటెస్ట్​ ఫీచర్లతో ChatGPT -4o రిలీజ్​​​​ - అందరికీ ఫ్రీ! - ChatGPT GPT 4o
ఇక చేతితో మొబైల్ వాడక్కర్లేదు! అంతా ఫేస్ ఎక్స్​ప్రెషన్స్​తోనే- గూగుల్ మరో సూపర్ ఫీచర్ - Google Andriod New Feature

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.