ETV Bharat / state

Komatireddy challenged KTR : 'రాజీనామాకు సిద్ధమేనా.. కేటీఆర్​'

author img

By

Published : Jul 13, 2023, 3:25 PM IST

Komati Reddy
Komati Reddy

KomatiReddy Venkat Reddy challenged KTR : బీఆర్​ఎస్​ ప్రభుత్వం పదకొండు గంటలకు మించి రైతులకు త్రీఫేస్​ కరెంట్ సరఫరా చేయడంలేదని.. 24 గంటలు ఇచ్చినట్లు రుజువుచేస్తే తాను రాజీనామాకు సిద్ధమని.. నిరంతర విద్యుత్​ ఇవ్వకపోతే కేటీఆర్​ రాజీనామా చేయాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి సవాల్​ విసిరారు. భువనగిరి జిల్లా బండసోమారం సబ్​స్టేషన్​లో పర్యటించి విద్యుత్​ సరఫరా రికార్డులు పరిశీలించారు.

Electricity war between BRS and Congress : రైతుప్రభుత్వంగా చెప్పుకునే కేసీఆర్​ సర్కార్​.. రైతులకు పదకొండు గంటలకు మించి త్రీఫేస్​ కరెంట్​​ సరఫరా చేయడం లేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి దుయ్యబట్టారు. 24 గంటల విద్యుత్​ సరఫరా చేసినట్లు రుజువు చేసినట్లయితే తాను రాజీనామాకు సిద్ధమని మంత్రి కేటీఆర్​కు సవాల్​ విసిరారు. నిరంతరం విద్యుత్​ ఇవ్వకపోతే కేటీఆర్​ రాజీనామా చేయాలని సూచించారు. భువనగిరి జిల్లాలోని బండసోమారం గ్రామంలో గల విద్యుత్​ సబ్​స్టేషన్​ను పరిశీలించారు.

విద్యుత్ ఉద్యోగులతో కరెంట్​ సరఫరా విషయంపై ఆరాతీశారు. త్రీఫేస్ కరెంట్ సరఫరా రికార్డులను పరిశీలించారు. రాష్ట్రంలో కేసీఆర్​ సర్కార్​ రైతులకు ఇచ్చిన హామీలను.. ఆచరణలో పెట్టడంలేదని విమర్శించారు. తమ ప్రభుత్వంలో రెండు దఫాలుగా.. తొమ్మిది గంటలపాటు రైతులకు ఉచితంగా, నాణ్యమైన ఉచిత విద్యుత్​ను అందించిన ఘనత కాంగ్రెస్​కు మాత్రమే దక్కుతుందని పేర్కొన్నారు. దేశంలో రైతులకు ఉచిత విద్యుత్​ను కాంగ్రెస్​పార్టీ ప్రవేశపెట్టిందన్నారు.

రైతులకు 24 గంటల త్రీఫేస్ కరెంటు ఏ గ్రామంలో ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఉచిత కరెంటు పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని పునరుద్ఘాటించారు. విద్యుత్​ సరఫరాపై రేవంత్​రెడ్డి చేసిన వక్రీకరించి.. రాజకీయపబ్బం గడపుకోవడానికే రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలకు పిలుపునిచ్చారని విమర్శించారు. కాంగ్రెస్​ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోలో 24 గంటల త్రీఫేస్​ కరెంట్​ సరఫరా అంశాన్ని పొందుపరిచినట్లు తెలిపారు.

నిజమైన రైతులు ధర్నాల్లో పాల్గొనడంలేదని.. కొందరికి డబ్బులిచ్చి ధర్నాలు చేయిస్తున్నట్లు ధ్వజమెత్తారు. ఇకనైనా ధర్నాలు, రాస్తారోకోలు ఆపివేయాలని.. వీటివల్ల సామాన్య జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. ధర్నాలను ప్రశ్నించిన వారిపై బీఆర్​ఎస్​ కార్యకర్తలు దాడి చేస్తున్నారని.. మహబూబ్​నగర్​లో అడ్వకేట్​పై, పోలీస్​ కానిస్టేబుల్​పై దాడి చేసినట్లు తెలిపారు.

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో వేతనాలు చెల్లించడం లేదని తెలిపారు. జీతాలు ప్రతి నెల 20వ తారీఖున నాడు పడుతున్నాయని.. వారి పిల్లల విద్యాఖర్చులు, గృహరుణాల నెలసరి వాయిదాలు చెల్లించడంలో నానాపాట్లు పడుతున్నారని తెలిపారు.

"రైతులకు పదకొండు గంటలకు మించి త్రీఫేస్​ కరెంట్​​ సరఫరా చేయడం లేదు. 24 గంటల విద్యుత్​ సరఫరా చేసినట్లు రుజువు చేసినట్లయితే నేను రాజీనామాకు సిద్ధంగా ఉన్నాను. లేని పక్షంలో కేటీఆర్​ రాజీనామా చేయాలని ఛాలెంజ్​ చేస్తున్నాను. రైతులకు 24 గంటల త్రీఫేస్ కరెంటు ఏ గ్రామంలో ఇవ్వడం లేదు. రాజకీయ పబ్బం గడుపుకోవడానికే రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలకు పిలుపునిచ్చారు. వీటివల్ల సామాన్యజనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో వేతనాలు చెల్లించడం లేదు." - కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, భువనగిరి ఎంపీ

'రాజీనామాకు సిద్ధమేనా.. కేటీఆర్​'

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.