ETV Bharat / international

హెచ్‌-1బీ వీసాదారులకు గుడ్​న్యూస్- ఉద్యోగం కోల్పోయినా అమెరికాలో ఉండొచ్చు! - H1B Visa New Guidelines

author img

By ETV Bharat Telugu Team

Published : May 16, 2024, 7:35 AM IST

Updated : May 16, 2024, 8:16 AM IST

H-1B Visa New Guidelines : ఉద్యోగం కోల్పోయిన హెచ్‌-1బీ వీసాదారులకు మరికొంత కాలం అమెరికాలో ఉండేందుకు అవకాశం కల్పించింది అగ్రరాజ్యం. ఈ మేరకు అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌(USCIS) నూతన నిబంధనలను విడుదల చేసింది.

H-1B Visa New Guidelines
H-1B Visa New Guidelines (ANI)

H 1B Visa New Guidelines : ఉద్యోగం కోల్పోయిన హెచ్‌-1బీ వీసాదారులకు ఊరట కలిగించే నిర్ణయాన్ని తీసుకుంది అమెరికా. దీని ప్రకారం ఉద్యోగం కోల్పోయిన వారు మరికొంత కాలం అమెరికాలో ఉండేందుకు అవకాశాన్ని పొందనున్నారు. ఇందుకోసం అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌(USCIS) నూతన నిబంధనలను విడుదల చేసింది.

ప్రస్తుతం ఉద్యోగం కోల్పోయిన హెచ్‌-1బీ వీసాదారులకు అమెరికాలో ఉండేందుకు రెండు నెలల గ్రేస్‌ పిరియడ్‌ ఉంది. కొత్త నిబంధనావళి ప్రకారం లేఆఫ్‌కు గురైన వారు గ్రేస్‌ పిరియడ్‌ సమయంలో నాన్ ఇమ్మిగ్రంట్‌ స్టేటస్‌ మార్పు కోసం దరఖాస్తు చేసుకోవాలి. అలాగే ఏడాది పాటు ఎంప్లాయిమెంట్‌ ఆథరైజేషన్‌ డాక్యుమెంట్‌(ఈఏడీ) పొందేలా దరఖాస్తు చేసుకోవచ్చు. వీటితో మరికొన్ని మార్పులు చేస్తూ యూఎస్​సీఐఎస్ నిబంధనలు విడుదల చేసింది. తమ తాజా చర్యతో హెచ్‌-1బీ వీసాదారులు నూతన ఉద్యోగ అవకాశాలను ఇబ్బంది లేకుండా పొందొచ్చని యూఎస్​సీఐఎస్ పేర్కొంది.

ఇటీవల గూగుల్, టెస్లా, వాల్​మార్ట్ వంటి దిగ్గజ కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. వీరిలో చాలా మంది హెచ్​-1బీ వీసాదారులు ఉన్నారు. అయితే ఉద్యోగం కోల్పోయిన హెచ్​-1బీ వీసాదారులకు కేవలం 60 రోజులు మాత్రమే ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఈ లోపే మరో ఉద్యోగం వస్తే అక్కడే ఉండొచ్చు లేకపోతే స్వదేశాలకు వెళ్లిపోవాల్సిందే. అయితే ఇంత తక్కువ సమయంలో మరో ఉద్యోగం చూసుకోవడం చాలా సంక్లిష్టంగా ఉంటుంది. అందుకే ఉద్యోగులు మరింత కాలం అక్కడే ఉండేలా వెసులుబాటు కల్పిస్తూ యూఎస్​సీఐఎస్​ నూతన మార్గదర్శకాలను జారీ చేసింది.

రెండేళ్ల యూకే గ్రాడ్యుయేట్ వీసాను కొనసాగించాల్సిందే
UK Graduate Visa : ఇటీవల విదేశీ విద్యార్థులకు ఇచ్చే రెండేళ్ల గ్రాడ్యుయేట్ వీసాలను అలాగే కొనసాగించాలని బ్రిటన్ ప్రభుత్వం నియమించిన రివ్యూ కమిటీ సూచించింది. భారత్ సహా పలు దేశాల విద్యార్థులు చెల్లించే రుసుముల వల్ల బ్రిటన్​ యూనివర్సిటీలకు బాగా ఆర్థిక వనరులు సమకూరుతున్నాయని పేర్కొంది. అయితే ఉద్యోగాల కల్పన విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పలు సూచనలు చేసింది. పూర్తి కథనం కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

మీటింగ్​ నుంచి వస్తుండగా స్లొవేకియా ప్రధానిపై కాల్పులు- పరిస్థితి విషమం - SLOVAK PRIME MINISTER Attacked

ఉక్రెయిన్‌కు అమెరికా బిగ్ హెల్ప్​- రూ.16వేల కోట్ల భారీ సైనిక సహాయక ప్యాకేజీ - American Aid To Ukraine

Last Updated : May 16, 2024, 8:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.