ETV Bharat / entertainment

'నేను బతికే ఉన్నా.. ఫేక్ న్యూస్ నమ్మొద్దు'.. కోట వీడియో రిలీజ్

author img

By

Published : Mar 21, 2023, 11:35 AM IST

తన మరణంపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ఫేక్​ వార్తలను నమ్మొద్దంటూ ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు అభిమానులను కోరారు. ఇటీవలే తాను మరణించినట్లు వచ్చిన ఓ ఫేక్​ వార్తపై ఆయనే స్వయంగా స్పందించారు.

kota srinivasa rao
kota srinivasa rao

'నేను బతికే ఉన్నా.. ఫేక్ న్యూస్ నమ్మొద్దు'.. కోట వీడియో రిలీజ్

సామాజిక మాధ్యమాల్లో విరివిగా వ్యాపించి సమాజంలో అల్లకల్లోలాన్ని సృష్టించే ఫేక్​ న్యూస్​ల వల్ల ఎందరో ప్రముఖులు ఆవేదనకు గురవుతున్నారు. తాము జీవించి ఉండగానే వారు ఇక లేరంటూ సోషల్​ మీడియాలో వస్తున్న వార్తలపై తామే స్వయంగా స్పందించి ఆ వార్తలు నిజం కాదంటూ తెేల్చిచెప్తున్నారు. ఇలాంటి వార్తలను ఎట్టి పరిస్థితుల్లో నమ్మెద్దంటూ చెప్పుకొస్తున్నారు. అయినప్పటికీ అటువంటి వార్తలు తమ హృదయాలను కలచి వేస్తోందని ప్రముఖులు కన్నీరు మున్నీరవుతున్నారు.

తాజాగా ఇదే పరిస్థితిని ఎదుర్కున్నారు ప్రముఖ సినీ ఆర్టిస్ట్ కోట శ్రీనివాస రావు. సామాజిక మాధ్యమాల్లో ఆయన ఇక లేరంటూ వార్తల్లోచ్చాయని ఇందులో ఏ మాత్రం నిజం లేదని చెప్పేందుకు ఆయన ఓ వీడియో తీసి దాన్ని మీడియాకు అందజేశారు. ఆయన మృతి చెందారన్న వార్తలను చూసిన పలువురు సన్నిహితులు ఆందోళన చెంది ఆయన ఇంటికి కాల్స్​ చేయడం మొదలుబెట్టారు. దీంతో తన కుటుంబసభ్యులు షాక్​కు గురైనట్లు ఆయన తెలిపారు. ఇదొక ఫేక్​బుక్​ న్యూస్ అని ఫోన్ చేసినవారికి తన కుటుంబ సభ్యులు చెప్పారని కోట శ్రీనివాసరావు అన్నారు. ఇక కొన్ని కాల్స్​ను తానే అటెండ్​ చేశారని చెప్పారు. అంతే కాకుండా ఓ పోలీస్​ వ్యాన్​ సైతం బందోబస్తు కోసం వచ్చిందని తెలిపారు. ఇలాంటి దృశ్యాలు చూస్తుంటే అభిమానులే ఎంతో మనోవేదనకు గురవుతారని కోట అన్నారు. ఇటువంటి వార్తలను అప్​లోడ్​ చేసేవారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

ఇక కోటా సినీ కెరీర్​ విషయానికి వస్తే... విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన కొన్ని దశాబ్దాలుగా సినీ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రతినాయకుడిగా, కమెడియన్​గా, క్యారెక్టర్​ ఆర్టిస్ట్​గా తనదైన శైలిలో నటించి ప్రేక్షకుల మదిలో మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన నటించిన ప్రతి క్యారెక్టర్​ ఓ సూపర్​ హిట్టే. 'ప్రతిఘటన', 'గణేశ్​' లాంటి సినిమాల్లో కరుడుగట్టిన విలన్​లా కనిపించాలన్న 'ఆహా నా పెళ్లంట', 'జంబలకిడి పంబ' లాంటి సినిమాల్లోని తన నటనతో పొట్ట చెక్కలయ్యేలా నవ్వించాలన్నా అది ఆయనకే సాధ్యం. అలా 40 ఏళ్ల తన సినీ కెరీర్​లో దాదాపు 750 సినిమాలకు పైగా నటించారు. మధ్యతరగతి వినోదానికి ఆయనే సూత్రధారి! సమాజంలో నిత్యం ఎదురయ్యే మనిషి స్వభావాలకు తెరపై ఆయన ప్రాణం పోస్తారు. అంతలా లీనమై నటిస్తారు ఆయన. బాబాయ్‌, రాజకీయ నాయకుడు, అందరి బాగూ కోరే ఓ పెద్దమనిషి, కరుడు గట్టిన మామయ్య, మాయల మరాఠీ మాంత్రికుడు, పిసినిగొట్టు, ఆదరించే తాతయ్య, అందరికీ నచ్చిన ఇంటి పెద్ద.. ఇలా పాత్ర ఏదైనా ఇట్టే ఒదిగి పోయి నటిస్తారు కోట శ్రీనివాసరావు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.