ETV Bharat / entertainment

'ఇక చాలు.. ఆ స్టెప్​ నేను వేయలేను'.. ఫ్యాన్స్​తో రష్మిక చిట్​ చాట్​

author img

By

Published : Mar 21, 2023, 7:38 AM IST

పుష్ప 2 సీక్వెల్​తో పాటు మరి కొన్ని సినిమాల షూటింగుల్లో బిజీగా ఉన్న నేషనల్​ క్రష్​ రష్మిక మందన్న ట్విట్టర్​ వేదికగా తన అభిమానులతో ముచ్చటించింది. ఈ క్రమంలో వాళ్లు అడిగిన ప్రశ్నలకు ఫన్నీగా సమాధానాలు ఇచ్చింది.

rashmika mandanna
rashmika mandanna

'పుష్ప' సినిమాతో అనతికాలంలోనే పాన్​ ఇండియా లెవెల్​లో క్రేజ్​ సంపాదించుకున్న నేషనల్​ క్రష్​ రష్మిక ప్రస్తుతం 'వారసుడు' సక్సెస్​ను ఆస్వాదిస్తోంది. అయితే తాజాగా 'పుష్ప' సీక్వెల్​ షూటింగ్​లో బిజీగా ఉన్న రష్మిక తన బిజీ షెడ్యూల్​ను పక్కనబెట్టి ట్విట్టర్​ వేదికగా రష్​ అవర్​ అంటూ తన అభిమానులతో ముచ్చటించింది. ఈ క్రమంలో ఫ్యాన్స్​ అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం చెప్పింది.

'పుష్ప' సినిమాలోని హీరో, హీరోయిన్లతో పాటు అందులలోని డైలాగ్స్,​ సాంగ్స్​ కూడా ప్రపంచవ్యప్తంగా బాగా ఫేమస్​ అయ్యాయి. ముఖ్యంగా ఇందులోని 'సామి సామి' సాంగ్​ అయితే థియేటర్లలోనే అభిమానుల చేత స్టెప్పులేయించింది. ఇప్పటికీ రీల్స్​, డీజే.. ఎటు చూసినా ఇదే సాంగ్​ మారుమోగిపోతోంది. అయితే ఆన్‌లైన్‌లో జరిగిన ఈ చిట్ చాట్​లో ఓ అభిమాని తనకు రష్మికతో 'సామి సామి' పాటకు డాన్స్ చేయాలని ఉందంటూ కోరాడు. అయితే ఆ మాటకు రష్మిక ఇచ్చిన ఆన్సర్​ ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. "నేను ఇప్పటికే 'సామీ సామీ' స్టెప్​ను చాలా సార్లు వేశాను. ఇక నాకు వయసయ్యాక బ్యాక్​ పెయిన్​ వస్తుందని భావిస్తున్నాను. మీరెందుకు ఇలా నన్ను అడుగుతున్నారు. మనం కలిసినప్పుడు ఇంకేదైనా చేద్దాం" అంటూ క్యూట్​గా రిప్లై ఇచ్చింది.

ఇక నీ ఫేవరెట్​ సౌత్​ ఇండియన్​ వంటకం ఏది అని మరో అభిమాని అడిగితే.. అన్నంతో పాటు సాంబార్​, రసం, పప్పు, పెరుగు అంటూ చెప్పుకొచ్చింది. అలాగే 'వారసుడు' సెట్‌లో జరిగిన ఫన్నీ మూమెంట్ గురించి షేర్ చేయమని ఓ అభిమాని కోరాడు. అయితే సెట్‌లో అలిసిపోయి తాను సోఫాలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో దర్శకుడు వంశీ పైడిపల్లి తనను ఫొటోలు తీసి హీరో విజయ్​కు చూపించేవారని.. దాన్ని చూసి వారిద్దరూ నవ్వుకుని తనని ఆటపట్టించేవారని పేర్కొంది. ఇక మరో అభిమాని నెగెటివ్ కామెంట్లను ఎలా ఎదుర్కోవాలో టిప్స్ చెప్పండి అని అడగ్గా.. ప్రేమను పంచితే వారి నెగెటివిటీ మొత్తం పాజిటివ్‌గా మారుతుందని తెలిపింది. ఇలా కొద్ది సేపు తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాధానాలు చెప్పింది రష్మిక.

ఇక సినిమాల విషయానికి వస్తే.. రష్మిక ప్రస్తుతం 'పుష్ప 2' సినిమా షూటింగ్​లో బిజీ ఉంది. మరోవైపు రణబీర్ కపూర్‌ హీరోగా సందీప్​ రెడ్డి వంగా రూపొందిస్తున్న 'యానిమల్' చిత్రంలోనూ నటిస్తోంది. ఇక బీష్మా హీరో నితిన్​తో కూడా ఓ కొత్త ప్రాజెక్ట్​కు ఓకే చెప్పిందట. అయితే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్​మెంట్​ అయితే ఇంకా రాలేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.