తెలంగాణ

telangana

Telangana Top News: టాప్​న్యూస్ @5PM

By

Published : Oct 30, 2022, 5:01 PM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana Top News today
Telangana Top News today

  • 'కేంద్రానికి బుద్ధి రావాలంటే భాజపాకు ఒక్క ఓటు కూడా వేయొద్దు'

దేశంలో ఏ ప్రధాని చేయని దారుణాన్ని మోదీ చేశారని ముఖ్యమంత్రి కేసీఆర్​ అన్నారు. మునుగోడు ప్రచారంలో భాగంగా బంగారిగడ్డలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మాట్లడిన ఆయన.. కేంద్ర ప్రభుత్వమే లక్ష్యంగా విమర్శలు చేశారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీ వేసిన తొలి ప్రధాని నరేంద్ర మోదీ అని విమర్శించారు.

  • 'సీబీఐ విచారణకు ఎందుకు అడ్డుపడుతున్నారు'

ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు విషయంలో కేసీఆర్‌ తప్పు చేయనప్పుడు.. సీబీఐ విచారణకు ఎందుకు అడ్డుపడుతున్నారో సమాధానం చెప్పాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు.

  • 'రాష్ట్రంలో ఫిరాయింపులకు పెట్టింది పేరు తెరాస'

తెరాస పాలన పట్ల ప్రజలు విసిగిపోయారని భాజపా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ అన్నారు. 2018 ఎన్నికల అనంతరం తెరాసకు స్పష్టమైన మెజార్టీ ఉన్నప్పటికీ.. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఫిరాయింపులకు పాల్పడ్డారని మండిపడ్డారు.

  • 'మునుగోడు ప్రజలకు పేలాలు పెట్టి.. రాజగోపాల్ రెడ్డి బిర్యానీ తింటున్నారు'

రాజకీయ లబ్ధి, తన కంపెనీ లాభాల కోసమే రాజగోపాల్‌రెడ్డి భాజపాలో చేరారని.. నియోజకవర్గ అభివృద్ధి కోసం కాదని కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ అన్నారు. కాంట్రాక్టుల కోసం నెలల తరబడి భాజపా సర్కార్‌కు, రాజగోపాల్‌రెడ్డికి మధ్య చర్చలు జరిగాయని ఆరోపించారు.

  • బండికి తాళం వేసి కీ మరిచాడు.. లోపలికి వెళ్లి బయటికి వచ్చేసరికి..!

సాధారణంగా ఈ రోజుల్లో బయటికి వెళ్లాలంటే అందరికీ గుర్తొచ్చేది ద్విచక్రవాహనం. ఎక్కడికి వెళ్లాలన్నా బండి మీద వెళ్తారు. అయితే ఎక్కడికి వెళ్లినా బండికి తాళం వేసి లోపలికి వెళ్తాము. కొన్ని సందర్భాలలో తాళం బండికే ఉంచుతాం.

  • 'అధ్యక్ష తరహా పాలన వైపు దేశం.. న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవాలి'

అధికార భాజపాను ఉద్దేశించి పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. చట్టాల పేరిట అధికారాలను తీసుకుంటూ.. దేశాన్ని అధ్యక్ష తరహా పాలన వైపు తీసుకెళ్తున్నారని విమర్శించారు.

  • అమరావతిలో ఘోర ప్రమాదం.. భవనం కూలి ఐదుగురు మృతి

మహారాష్ట్ర అమరావతిలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రభాత్​ చౌక్​లో ఉన్న పురాతన భవనం కూలి ఐదుగురు దుర్మరణం పాలయ్యారు.

  • పాకిస్థాన్​ బౌలర్ రాకాసి బౌన్సర్..

టీ20 ప్రపంచకప్​లో భాగంగా నెదర్లాండ్స్​తో జరిగిన మ్యాచ్​లో పాక్​ జట్టు ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్​లో పాక్​ బౌలర్​ రవూఫ్​ వేసిన బంతికి నెదర్లాండ్స్​ బ్యాటర్​ బాస్​ డీ లిడె తీవ్రంగా గాయపడ్డాడు.

  • నెట్టింట వైరల్​గా మారిన బన్నీ ఫొటో..

'పుష్ప-2' సినిమా షూటింగ్​ ప్రారంభమైందా? అంటే అవుననే అంటున్నారు నెటిజన్లు. ఎందుకంటే బన్నీకి సంబంధించిన లేటెస్ట్​ ఫొటో ఒకటి నెట్టింట వైరల్​గా మారింది. దీంతో ఆదివారమే షూటింగ్​ స్టార్​ అయిందని తెలుస్తోంది. అసలేంటి ఆ ఫొటో?

  • ఆఫ్రికాలో రామ్​చరణ్​ వెకేషన్..

'ఆర్​ఆర్​ఆర్​'తో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందారు టాలీవుడ్​ కథానాయకుడు రామ్​చరణ్. ప్రస్తుతం షూటింగ్​ల నుంచి కాస్త విరామం తీసుకుని ఆయన సతీసమేతంగా విహారయాత్రకు వెళ్లారు. తాజాగా ఆయన షేర్​ చేసిన ఆఫ్రికన్ సఫారీ వీడియో నెట్టింట్లో వైరల్​గా మారంది.

ABOUT THE AUTHOR

...view details