తెలంగాణ

telangana

దీపావళి తర్వాత సీఎం కేసీఆర్ మూడో విడత ఎన్నికల ప్రచారం - ఈసారి ఏకంగా రోజుకు 4 నియోజకవర్గాల్లో సభలు

By ETV Bharat Telangana Team

Published : Nov 4, 2023, 8:44 PM IST

Updated : Nov 5, 2023, 6:55 AM IST

CM KCR Second Phase Election Campaign Schedule : ఎన్నికల ప్రచారంలో జోరు పెంచిన బీఆర్ఎస్ అధినేత.. మరో 54 నియోజకవర్గాల సభల షెడ్యూల్‌ను ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని నియోజకవర్గాలన్నింటికీ కలిపి.. ఈ నెల 25న ఒకే సభ నిర్వహించనున్నారు. గజ్వేల్‌లో ప్రజా ఆశీర్వాద సభతో కేసీఆర్ ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఇప్పటివరకు 30 సభల్లో ప్రసంగించిన కేసీఆర్.. నేటి నుంచి ఈ నెల 9 వరకు 12 సభల్లో పాల్గొంటారు. మొత్తం 96 సభలతో కేసీఆర్ ఎన్నికల ప్రచారం ముగియనుంది.

CM KCR Second Phase Election Campaign Schedule
CM KCR Second Phase Election Campaign Schedule

సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ విడుదల 16 రోజులు 54 సభలు

CM KCR Second Phase Election Campaign Schedule : బీఆర్ఎస్ అధినేత.. సీఎం కేసీఆర్‌ (CM KCR) ఈ నెల 13 నుంచి మూడో విడత ప్రచారం ప్రారంభించి.. 54 నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. ఇప్పటికే రోజుకు రెండు, మూడు సభల్లో పాల్గొంటున్న ముఖ్యమంత్రి.. ఈ నెల 15 నుంచి రోజుకు నాలుగు నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని అన్ని నియోజకవర్గాలకు కలిపి.. ఈ నెల 25న హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని భారత్ రాష్ట్ర సమితి నిర్ణయించింది. వరంగల్ తూర్పు, పశ్చిమ కలిపి ఒకటి, భద్రాచలం, పినపాక నియోజకవర్గాలకు కలిపి ఒక సభ నిర్వహించనున్నారు.

BRS Election Campaign Telangana 2023 : సుడిగాలి పర్యటనలు.. వాడివేడి ప్రసంగాలతో.. ప్రచారంలో బీఆర్ఎస్ జోష్

BRS Election Campaign in Telangana 2023 : గత నెల 15న గులాబీ దళపతి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఆ రోజున తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్‌ అభ్యర్థులతో సమావేశం నిర్వహించి మేనిఫెస్టోను ప్రకటించిన సీఎం.. హుస్నాబాద్‌తో ప్రజా ఆశీర్వాద (BRS Praja Ahsirvada Sabha) సభలు మొదలు పెట్టారు. గత నెల 18 వరకు వరసగా జనగామ, భువనగిరి, సిరిసిల్ల, సిద్దిపేట, జడ్చర్ల, మేడ్చల్‌లో సభలు నిర్వహించిన ముఖ్యమంత్రి.. దసరా ఉన్నందున వారం రోజులు విరామం ఇచ్చారు.

'రాష్ట్ర ఆదాయం పెరిగే కొద్దీ సంక్షేమ పథకాలు పెంచుతాం'

CM KCR Second Phase BRS Praja Ahsirvada Sabha Schedule : గత నెల 26న రెండో విడత సభలకు శ్రీకారం చుట్టి ఈ నెల 3 వరకు సభలు నిర్వహించారు. నిన్న మంచి రోజుగా భావించిన కేసీఆర్ ప్రచార సభలకు విరామం ఇచ్చి.. కోనాయిపల్లి వెంకటేశ్వరస్వామిఆలయంలో పూజలు నిర్వహించి నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. నేడు కొత్తగూడెం, ఖమ్మంలో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటారు. రేపు గద్వాల, మక్తల్, నారాయణపేట, ఎల్లుండి చెన్నూరు, మంథని, పెద్దపల్లి, ఈ నెల 8న సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లిలో గులాబీ దళపతి సభల్లో ప్రసంగిస్తారు. నవంబరు 9న గజ్వేల్, కామారెడ్డిలో కేసీఆర్ నామినేషన్లు వేసి.. కామారెడ్డిలో సభ నిర్వహిస్తారు. దీపావళి పండుగ ఉన్నందున నాలుగు రోజుల పాటు విరామం ఇచ్చి.. ఈ నెల 13న మూడో విడత సభలకు సీఎం బయలుదేరనున్నారు. ప్రణాళిక ప్రకారం ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహిస్తున్న సీఎం.. ఈ నెల 28న ప్రచారాలు ముగించనున్నారు. చివరి రోజున వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలకు కలిపి ఒకే సభ నిర్వహించి.. తర్వాత గజ్వేల్ వెళ్లి అక్కడ ప్రజా ఆశీర్వాద సభతో ఎన్నికల ప్రచారానికి స్వస్తి పలకనున్నారు.

సీఎం కేసీఆర్‌ ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ ఇదే..:

  • 13 - దమ్మపేట, బూర్గంపాడు, నర్సంపేట్‌
  • 14 - పాలకుర్తి, హాలియా, ఇబ్రహీంపట్నం
  • 15 - బోధన్‌, నిజామాబాద్‌ అర్బన్‌, ఎల్లారెడ్డి, మెదక్‌
  • 16 - ఆదిలాబాద్‌, బోథ్‌, నిజామాబాద్‌ రూరల్‌, నర్సాపూర్‌
  • 17 - కరీంనగర్‌, చొప్పదండి, హుజూరాబాద్‌, పరకాల
  • 18 - చేర్యాల
  • 19 - అలంపూర్‌, కొల్లాపూర్‌, నాగర్‌కర్నూల్‌, కల్వకుర్తి
  • 20 - మానకొండూరు, స్టేషన్‌ఘన్‌పూర్‌, నకిరేకల్‌, నల్గొండ
  • 21 - మధిర, వైరా, డోర్నకల్‌, సూర్యాపేట
  • 22 - తాండూర్‌, కొడంగల్‌, మహబూబ్‌నగర్‌, పరిగి
  • 23 - మహేశ్వరం, వికారాబాద్‌, జహీరాబాద్‌, పటాన్‌చెరు
  • 24 - మంచిర్యాల, రామగుండం, ములుగు, భూపాలపల్లి
  • 25 - గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలోని 24 నియోజకవర్గాలకు కలిపి భారీ బహిరంగ సభ
  • 26 - ఖానాపూర్‌, జగిత్యాల, వేములవాడ, దుబ్బాక
  • 27 - షాద్‌నగర్‌, చేవెళ్ల, అందోల్‌, సంగారెడ్డి

యువతే టార్గెట్‌గా ప్రచారం ట్రెండ్‌ ఫాలో అవుతున్న బీఆర్‌ఎస్‌ నేతలు

హ్యాట్రిక్‌ విజయమే లక్ష్యంగా బీఆర్‌ఎస్‌ ప్రచార హోరు

Last Updated : Nov 5, 2023, 6:55 AM IST

ABOUT THE AUTHOR

...view details