ETV Bharat / state

'రాష్ట్ర ఆదాయం పెరిగే కొద్దీ సంక్షేమ పథకాలు పెంచుతాం'

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 3, 2023, 4:25 PM IST

Updated : Nov 3, 2023, 6:39 PM IST

BRS Praja Ashirvada Sabha
BRS Praja Ashirvada Sabha at Armoor

BRS Praja Ashirvada Sabha at Armoor : రాష్ట్ర ఆదాయం పెరిగే కొద్దీ సంక్షేమ పథకాలు పెంచుతామని బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ తెలిపారు. పార్టీల చరిత్రను చూసి ప్రజలు ఓటేయాలని సూచించారు. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో జరిగిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ పాల్గొని.. ప్రసంగించారు.

BRS Praja Ashirvada Sabha at Armoor : బీడీ కార్మికులకు పింఛను ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ బీఆర్‌ఎస్‌నే అని స్పష్టం చేశారు. రాష్ట్ర ఆదాయం పెరిగే కొద్దీ సంక్షేమ పథకాలు పెంచుతున్నామని తెలిపారు. పార్టీల చరిత్రను ప్రజలు గమనించి ఓటు వేయాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. 50 ఏళ్ల పాటు దేశాన్ని, రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ పాలించిందన్నారు. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో జరిగిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ పాల్గొని.. ప్రసంగించారు.

"ధరణిని తీసేస్తామని కాంగ్రెస్‌ నాయకులు చెబుతున్నారు. ధరణి తీసేయడం వల్ల రైతుబంధు, రైతు బీమా డబ్బులు ఆగిపోతాయి. ధాన్యాన్ని ప్రభుత్వమే కనీస మద్దతు ధరకు కొని.. రైతుల ఖాతాల్లో డబ్బును వేస్తుంది. ధరణిని తీసేస్తే మళ్లీ దళారులు రాజ్యమే వస్తుంది. వైకుంఠం ఆటలో పెద్ద పాము మింగినట్లు ఉంటుంది. అందుకే మీరు ఆలోచించి, ఈ విషయాలపై చర్చ చేసి ఓటింగ్‌ పాల్గొంటే చాలా మంచి లాభం జరుగుతుంది. మంచి ప్రభుత్వం పస్తుంది." - కేసీఆర్‌, సీఎం

రాష్ట్ర ఆదాయం పెరిగే కొద్దీ సంక్షేమ పథకాలు పెంచుతాం

'ఎన్నికల్లో ఎవరో వచ్చి చెప్పిన అబద్ధాలు నమ్మి ఓటు వేయొద్దు'

ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయి ప్రజలు మాత్రం వివేకంతో ఆలోచించి ఓటు వేయాలి సీఎం కేసీఆర్

CM KCR Speech at Jukkal Praja Asheerwada Sabha : కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే.. కరెంట్‌ ఉండదు, రైతుబంధు అందదు : కేసీఆర్

Last Updated :Nov 3, 2023, 6:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.