ETV Bharat / state

సీసీఎస్ అధికారులకు షాక్ - 12 మంది ఇన్‌స్పెక్టర్లపై బదిలీ వేటు - 12 CCS INSPECTORS TRANSFER

12 CCS Inspectors Transferred in Hyderabad : ఒకప్పుడు కీలకమైన కేసులను ఛేదించిన విభాగం, ఆర్థిక నేరగాళ్ల భరతం పట్టి బాధితులకు న్యాయం చేసిన సీసీఎస్‌ విభాగంపై ఇప్పుడు నీలి నీడలు కమ్ముకున్నాయి. కొందరు అవినీతి అధికారుల వల్ల వ్యవస్థనే పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాల్సి వచ్చింది. ఇటీవల అవినీతితో అధికారులు ఏసీబీకి పట్టుబడటం, ఇలా వరుస ఆరోపణలతో మొత్తం 12 మంది ఇన్‌స్పెక్టర్లు, నలుగురు ఎస్సైలను బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

12 CCS Inspectors Transferred in Hyderabad
Inspectors Transfers in CCS (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 16, 2024, 2:00 PM IST

Updated : Jun 16, 2024, 7:17 PM IST

Officers Action on Hyderabad CCS : హైదరాబాద్ పోలీసు కమిషనరేట్​లో సెంట్రల్ క్రైం స్టేషన్(సీసీఎస్‌) కీలకమైనది. ఇటీవల కొందరు అవినీతి అధికారుల వల్ల బాధితులు తమకు ఇక్కడ న్యాయం జరుగుతుందా అనే సందిగ్ధంలో పడ్డారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గత నెల 21న సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.

అతను భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు తేల్చారు. తాజాగా సీసీఎస్ ఈఓడబ్ల్యూ టీమ్-7 ఇన్స్పెక్టర్ సుధాకర్ రూ.3 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్​హ్యాండెడ్​గా పట్టుబడ్డారు. ఇలా మరికొందరు అధికారులు కేసుల విషయంలో లంచాలు ఆశిస్తున్నారని కొందరు బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు.

సీసీఎస్‌ ప్రక్షాళన దిశగా ఉన్నతాధికారులు చర్యలు : ప్రధానంగా సీసీఎస్​కు జాయింట్ కమిషనర్ అంటే ఐజీ స్థాయి అధికారి ఇంఛార్జిగా ఉంటారు. ఇందులోని అర్ధిక నేరాల విభాగం సంచలన కేసులు, అమాయకుల సొమ్మును కాజేసే ఆర్థిక నేరగాళ్లకు చెక్‌ పెట్టేందుకు పనిచేస్తుంది. ఈ విభాగమే నేరుగా కొన్ని కేసులు నమోదు చేస్తుంది. నగరంలోని ఇతర పోలీసు స్టేషన్లలో నమోదైన ఆర్థిక నేరాలు కూడా వాటి తీవ్రతను బట్టి కమిషనర్, దర్యాప్తు నిమిత్తం ఈ విభాగానికి బదిలీ చేస్తుంటారు.

సీసీఎస్ దర్యాప్తు చేసే కేసుల్లో అత్యధికం రూ.కోట్లతో ముడిపడి ఉంటాయి. గతేడాదిలోనే సాహితి ఇన్‌ఫ్రా మోసం సహా కొన్ని వేల కోట్ల రూపాయల స్కాములు సీసీఎస్​లో దర్యాప్తు దశలో ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే ప్రతిష్ఠాత్మకమైన ఈ విభాగం ప్రతిష్ఠ దిగజారుతోందనే ఆరోపణ వినిపిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు జాయింట్ సీపీగా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి రంగనాథ్​ను బదిలీ చేశారు. కానీ ఆ స్థానంలో మరెవరనీ నియమించలేదు.

ఏసీపీ ఉమామహేశ్వరావు, ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌పై సస్పెన్సన్ వేటు : ప్రస్తుతం అమలులో ఉన్న చట్టం ప్రకారం సివిల్ వివాదాల్లోకి పోలీసులు తలదూర్చకూడదు. కేవలం క్రిమినల్ కేసులు మాత్రమే నమోదు చేసుకుని దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. ఈ అంశం కూడా సీసీఎస్ అధికారులకు కలిసి వస్తోంది. సీసీఎస్​లో నమోదయ్యే, ఫిర్యాదులుగా వచ్చే ఆర్థిక నేరాళ్లో చాలా వాటిని సివిల్-క్రిమినల్ అని విడదీయడానికి మధ్యలో చాలా చిన్న సాంకేతిక గీత మాత్రమే ఉంటుంది.

ఇది కూడా కొందరు అవినీతి అధికారులకు కలిసి వస్తోంది. సివిల్ కేసును క్రిమినల్​గా మార్చి అరెస్ట్​ చేస్తానంటూ నిందితుల నుంచి, క్రిమినల్ కేసులు అయినప్పటికీ సివిల్​గా తేలుస్తానంటూ బెదిరించి ఫిర్యాదుదారుల నుంచి అందినకాడికి దండుకుంటున్న వాళ్లు చాలా మంది ఉన్నారు. సాహితీ కేసులకు దర్యాప్తు అధికారిగా వ్యవహరించిన ఏసీపీ ఉమామహేశ్వరరావు రెండు పక్షాలను బెదిరించి దండుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఇన్స్పెక్టర్ సుధాకర్ నిందితుడి నుంచి డబ్బు డిమాండ్ చేసి తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు.

12 CCS Inspectors Transferred : నగర నేర పరిశోధన విభాగంలో సీసీఎస్​లో వరుస వివాదాలు చోటు చేసుకుకోవడం వెనుక సీసీఎస్ ఉన్నతాధికారుల వైఫల్యం ఉందనే ఆరోపణ వినిపిస్తున్నాయి. గతంలో సీసీఎస్​కు బదిలీ చేయాలంటే ఏసీబీ విభాగంలా అధికారి ట్రాక్ రికార్డులను పర్యవేక్షించే వారు. సస్పెన్షన్లు, అవినీతి ఆరోపణలు లేకుండా చూసి సీసీఎస్​కు బదిలీ చేసేవారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు.

గతంలో సస్పెండ్ అయిన వారు. అవినీతి ఆరోపణలు ఉన్నవారికి కూడా అక్కడ పోస్టింగ్​లు ఇస్తున్నారు. మరికొందరికి కనీస ఆర్ధిక నేరాలపై అవగాహన లేని వారికి అక్కడ పోస్టింగ్ వస్తున్నాయి. కాగా వరుస ఆరోపణలు రావడంలో సీసీఎస్​లోని ఆర్థిక నేర విభాగంలోని 12 మంది ఇన్స్పెక్టర్​లు, నలుగురు ఎస్సైలను మల్టీజోన్ -2కి బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆ స్థానాల్లో మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న అధికారులను నియమించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఏసీబీ ట్రాప్‌- రూ.3లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సీసీఎస్ సీఐ

సెటిల్​మెంట్లకు అడ్డాగా గ్రేటర్ ఠాణాలు - అవినీతికి పాల్పడుతూ అడ్డంగా దొరికిపోతున్న అధికారులు - CCS POLICE STATION CORRUPTION

Last Updated : Jun 16, 2024, 7:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.