David Wiese Retirement: సౌతాఫ్రికా, నమీబియా జట్ల స్టార్ ప్లేయర్ డేవిడ్ వీస్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2024 టీ20 ప్రపంచకప్లో నమీబియా- ఇంగ్లాండ్ మ్యాచ్ అనంతరం వీస్ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. ఈ మ్యాచ్లో వీస్ 1 వికెట్ పడగొట్టాడు. అయితే సౌతాఫ్రికాలో పుట్టిన వీస్, 2013లో అదే దేశం తరఫున అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత 2021లో సౌతాఫ్రికాను వీడి తన తండ్రి స్వదేశమైన నమీబియా జట్టుతో చేరాడు.
ఇంటర్నేషనల్ క్రికెట్లో నమీబియాకు 2021, 2022 ఐసీసీ టోర్నీల్లో కీలక ప్లేయర్గా ఉన్నాడు. ఇక అంతర్జాతీయ కెరీర్లో రెండు దేశాలకు కలిపి 15 వన్డేలు, 54 టీ20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. వన్డేల్లో 330 పరుగులు, 15 వికెట్లు తీయగా, టీ20ల్లో 624 పరుగులు, 59 వికెట్లు పడగొట్టాడు. ఇటు ఐపీఎల్లోనూ వీస్ కోల్కతా, బెంగళూరు జట్ల తరపున ఆడాడు. ఆదివారం ఇంగ్లాండ్తో మ్యాచే వీస్కు ఆఖరి ఇంటర్నేషనల్ గేమ్.