ETV Bharat / state

BRS Election Campaign Telangana 2023 : సుడిగాలి పర్యటనలు.. వాడివేడి ప్రసంగాలతో.. ప్రచారంలో బీఆర్ఎస్ జోష్

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 5, 2023, 6:59 AM IST

Updated : Oct 5, 2023, 7:08 AM IST

BRS Election Campaign Telangana 2023 : ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ జోరు పెరిగింది. కేటీఆర్, హరీశ్‌రావు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఓ వైపు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం.. మరోవైపు సభల్లో వాడివేడి ప్రసంగాలతో జోష్‌ను పెంచేశారు. ఎన్నికల షెడ్యూలు వచ్చాక సీఎం కేసీఆర్.. పూర్తిస్థాయిలో రంగంలోకి దిగనున్నారు. ఈనెల 16న వరంగల్ సభలో ప్రకటించనున్న మేనిఫెస్టోకు కసరత్తు చేస్తున్నారు. రైతులు, మహిళలు, యువతను ఆకర్షించేలా ఎన్నికల హామీలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

BRS Election Campaign in Telangana 2023
BRS Election Campaign

BRS Election Campaign Telangana 2023 సుడిగాలి పర్యటనలు.. వాడివేడి ప్రసంగాలతో.. ప్రచారంలో బీఆర్ఎస్ జోష్

BRS Election Campaign Telangana 2023 : బీఆర్ఎస్​ ఎన్నికల ప్రచారం(BRS Election Campaign) ఊపందుకుంది. దాదాపు ఏడాది క్రితం నుంచే వ్యూహాత్మకంగా ఎన్నికలకు సిద్ధమైన గులాబీ పార్టీ.. ప్రత్యక్ష ప్రచారాన్ని ముమ్మరం చేసింది. అభ్యర్థులు నియోజకవర్గంలో ఓటర్లను కలుస్తుండగా.. కేటీఆర్, హరీశ్‌రావు సుడిగాలి పర్యటనలతో జోష్ పెంచారు. ఓవైపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థానలు.. మరోవైపు పార్టీ కార్యక్రమాలతో కొన్ని నెలలుగా క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వస్తోంది. మిగతా పార్టీల కన్నా ముందుగానే ఒకేసారి 115 అభ్యర్థులను ప్రకటించింది. అభ్యర్థులను ప్రకటించిన తర్వాత కేటీఆర్ కొన్ని రోజులు అమెరికా పర్యటనలో ఉండటం.. ఆ తర్వాత జమిలి ఎన్నికలపై ప్రచారం నేపథ్యంలో కొన్ని రోజులు స్తబ్దుగా కనిపించింది. వారం రోజుల్లో ఎన్నికల షెడ్యూలు(Telangana Election Schedule 2023) విడుదల కావచ్చునన్న ప్రచారంతో బీఆర్ఎస్ ఒక్కసారిగా వేగం పెంచింది.

BRS Election Manifesto 2023 : ఓ వైపు కేటీఆర్.. మరోవైపు హరీశ్‌రావు హెలికాప్టర్ ద్వారా సుడిగాలి పర్యటనలతో ప్రచారం జోరు పెంచారు. ఇద్దరు మంత్రులు సుమారు 50 నియోజకవర్గాల్లో పర్యటించారు. త్వరలో ఎన్నికల కోడ్(Telangana Assembly Elections Code) రానున్నందున.. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల వేగం పెంచారు. కేటీఆర్, హరీశ్​రావు రోజూ రెండు, మూడు నియోజకవర్గాలకు వెళ్లి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆ తర్వాత సభలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణుల్లో జోష్ పెంచుతున్నారు.

BRS Campaign Telangana Election 2023 : ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూనే రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై వాడివేడి ప్రసంగాలు చేస్తున్నారు. బీఆర్​ఎస్​ను మళ్లీ ఆశీర్వదించాలంటూ కోరుతున్నారు.కాంగ్రెస్, బీజేపీలపై కేటీఆర్, హరీశ్​రావు విరుచుకు పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ(Congress Party) కాలం చెల్లిందని.. వారంటీ లేని ఆ పార్టీ చెబుతున్న గ్యారంటీలను ఎవరు నమ్ముతారని దుమ్మెత్తి పోస్తున్నారు. బీజేపీకు మతం తప్ప మరో అంశం తెలియదని.. ఆ పార్టీలో వారసత్వ రాజకీయాలు లేవా అంటూ ఎదురు దాడి చేస్తున్నారు.

Harish Rao on BRS Manifesto : 'బీఆర్ఎస్​ మేనిఫెస్టో చూస్తే ప్రతిపక్షాల దిమ్మ తిరుగుతుంది'

BRS Warangal Vijaya Garjana Sabha : కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్న గులాబీ దళపతి, సీఎం కేసీఆర్(CM KCR) త్వరలో రంగంలోకి దిగనున్నారు. త్వరలో కేబినెట్ సమావేశం(Cabinet Meeting) నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈనెల 16న వరంగల్‌లో జరగనున్న విజయగర్జన సభ(Vijaya Garjana Sabha)లో ప్రకటించనున్న మేనిఫెస్టోకు కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. రైతులకు ఫించను, ఉచితంగా ఎరువుల పంపిణీ తదితర అంశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మహిళలు, యువత, బీసీలు, మైనారిటీలకు పలు ఎన్నికల హామీలను ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల షెడ్యూలు వచ్చిన తర్వాత కేసీఆర్ కూడా సుమారు వంద నియోజకవర్గాల్లో పర్యటించేలా ప్రణాళికలు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు బీఆర్ఎస్​ అభ్యర్థులు(BRS Candidates) ఇంటింటి ప్రచారం ముమ్మరం చేశారు. కాలనీలు, బస్తీల్లో ప్రముఖులు, కుల సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తూ మద్దతు కోరుతున్నారు.

Minister KTR Speech at Nirmal BRS Public Meeting : 'మేం అభివృద్ధి చేశామని నమ్మితేనే ఓట్లు వేయండి.. లేకుంటే లేదు..'

BRS MLA Candidates List 2023 : ఐదుగురు అభ్యర్థులతో తుది జాబితాను త్వరలో ప్రకటించేందుకు బీఆర్ఎస్ అధిష్ఠానం సిద్ధమవుతోంది. జనగామ, నర్సాపూర్, గోషామహల్, నాంపల్లి, మల్కాజిగిరికి అభ్యర్థులు దాదాపు ఖరారైనప్పటికీ.. ఆశావహులతో సీఎం కేసీఆర్ మాట్లాడిన తర్వాత ప్రకటించాలని భావిస్తున్నారు. జనగామలో పల్లా రాజేశ్వర్ రెడ్డి, నర్సాపూర్‌లో మహిళ కమిషన్ ఛైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, మల్కాజిగిరిలో మర్రి రాజశేఖర్ రెడ్డి, నాంపల్లిలో ఆనంద్‌కుమార్ పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. గోషామహల్‌లో మాజీ ఎమ్మెల్యే ప్రేమ్‌సింగ్ రాఠోడ్ లేదా నియోజకవర్గం ఇన్‌ఛార్జి నందకిషోర్ వ్యాస్ బిలాల్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.

BRS Party New Joinings 2023 : మరోవైపు బీఆర్​ఎస్​లోకి చేరికలపై కూడా పార్టీ అధిష్ఠానం దృష్టి పెట్టింది. కాంగ్రెస్​కు రాజీనామా చేసిన మేడ్చల్ మల్కాజిగిరి డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్​లో చేరారు. ఇటీవల కాంగ్రెస్​కు రాజీనామా చేసిన మెదక్ డీసీసీ అధ్యక్షుడు కె.తిరుపతిరెడ్డి త్వరలో గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు. భద్రాద్రి జిల్లా బీజేపీ అధ్యక్షుడు చిన్న సత్యనారాయణ, అంబర్ పేట డివిజన్ కార్పొరేటర్ పద్మ, ఆమె భర్త వెంకట్ రెడ్డి, వైఎస్​ఆర్​టీపీ నాయకుడు ఏపూరి సోమన్న ఇటీవలే బీఆర్ఎస్​లో చేరారు.

Harish Rao On BJP Congress : 'రాష్ట్రంలో బీజేపీ లేచేది లేదు.. కాంగ్రెస్​ గెలిచేది లేదు'

KTR Reacts to Modi Comments On BRS BJP Alliance : 'డిపాజిట్ రాని బీజేపీతో మాకు పొత్తా.. మేము పోరాడేవాళ్లమే తప్ప మోసంచేసే వాళ్లం కాదు'

Last Updated : Oct 5, 2023, 7:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.