తెలంగాణ

telangana

'ధోనీ 99.9% సక్సెస్​ఫుల్- ఆయన నిర్ణయాలను క్వశ్చన్ చేసే దమ్ము ఎవరికీ లేదు!'

By ETV Bharat Telugu Team

Published : Nov 25, 2023, 8:34 PM IST

Updated : Nov 25, 2023, 8:56 PM IST

Ambati Rayudu About MS Dhoni : టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ మహేంద్ర సింగ్ ధోనీపై.. భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత క్రికెట్​లో ధోనీ నిర్ణయాలను ప్రశ్నించే పరిస్థితి ఎవరికీ లేదని.. ఎందుకంటే ఆయన తీసుకున్న నిర్ణయాలు 99.9 శాతం సక్సెస్​ఫుల్ అని అన్నారు. ఇంకా ఏమన్నారంటే?​

Ambati Rayudu About MS Dhoni
Ambati Rayudu About MS Dhoni

Ambati Rayudu About MS Dhoni :టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీని భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ కెప్టెన్‌లలో ఒకరిగా పరిగణిస్తారు. ధోనీ.. 2011 వన్డే ప్రపంచ కప్, 2007 టీ20 వరల్డ్​ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ, మూడు ఆసియా కప్​లు (2010, 2016, 2018) ట్రోఫీలను టైటిళ్లను భారత్‌కు అందించారు. ధోనీ విజయాల పరంపరా కేవలం టీమ్ఇండియాకే పరిమితం కాలేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్​- ఐపీఎల్​లో చెన్నై జట్టుకు సారథిగా ఐదు టైటిళ్లు (2010, 2011, 2018, 2021, 2023) అందించాడు. రెండు సార్లు ఛాంపియన్ ట్రోఫీలు (2011, 2014) సాధించారు. ఇలాంటి ధోనీ కెప్టెన్సీ లిగసీపై టీమ్ఇండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత క్రికెట్​లో ఉన్న వ్యక్తుల్లో ఎవరూ ధోనీ నిర్ణయాలను ప్రశ్నించే పరిస్థితిలో లేరని అన్నారు. ఎందుకంటే ధోనీ 99.9 శాతం సక్సెస్​ ఫుల్​ని చెప్పారు. ఈ మేరకు తాజాగా ఓ యూట్యూబ్​ ఛానల్​కు ఇచ్చిన​ ఇంటర్వ్యూలో ధోనీ గురించి తన అభిప్రాయాలను షేర్​ చేసుకున్నారు.

'అన్ని క్రికెట్​ ఫార్మాట్లలో ఆయన చాలా మంది ఆటగాళ్లలో వారి అత్యుత్తమ ప్రదర్శనను వెలికితీశారని అందరికీ తెలుసు. అంతే కాకుండా సీఎస్​కే జట్టు తరఫున ఆడిన విదేశీ ప్లేయర్లలో కూడా వారి బెస్ట్​ను బయటకు తీశారు. అలాంటి స్వభావం ఆయనలో ఉందని నేను భావిస్తున్నా. అయితే అది ఆయనకు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదమా లేదా ఇన్ని రోజులు క్రికెట్ ఆడట వల్ల వచ్చిందా.. దాన్ని ఎలా వ్యక్తపరచాలో నాకు అర్థం కావడం లేదు' అని అంబటి రాయుడు తెలిపారు.

'కొన్ని సార్లు నేను సరైదని కాదని భావించిన పనిని.. ధోనీ ఎందుకు చేస్తున్నారో అని ఆశ్చర్యమేసేది. కానీ చివరలో సరైన ఫలితాలు వచ్చేవి. అలా 99.9 శాతం సార్లు అతడి నిర్ణయాలు ఫలించేవి. ఏం చేస్తున్నాడో ఆయనకు తెలుసు. ధోనీ చాలా కాలం పాటు అలా సక్సెస్​ఫుల్​గా చేశారు. భారత క్రికెట్​లో ఆయన నిర్ణయాలను ప్రశ్నించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన అన్నిసార్లు సక్సెస్​ఫుల్ నిర్ణయాలను తీసుకున్నారు.' అని రాయుడు వివరించారు.

విదేశీయులపై ధోనీ వ్యవరించిన తీరుపై రాయుడు స్పందించారు. ' అఫ్​ కోర్స్ అది ఫర్వాలేదు. ఆయన మా లీడర్. ధోనీ ఊరికనే అరవరు. ఆ విషయాన్ని వారికి సూక్ష్మంగా చెబుతారు. 'అని చెప్పాడు. ప్రస్తుతం ధోనీ ఐపీఎల్​లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ప్రాతినిధ్య వహిస్తున్నారు. అయితే ధోనీ ఐపీఎల్​లో మరో ట్రోఫీ గెలవాలని అభిమానులు ఆశిస్తున్నారు.

'విరాట్, రోహిత్ టీ20ల్లోనూ ఆడాలి - లేదంటే వారి ఫేర్​వెల్ బాధ్యత హార్దిక్​దే' : షోయబ్

అండర్-19 ఆసియా కప్ 2023 జట్టును ప్రకటించిన బీసీసీఐ- HCA​ నుంచి ఇద్దరు

Last Updated :Nov 25, 2023, 8:56 PM IST

ABOUT THE AUTHOR

...view details