ETV Bharat / sports

'విరాట్, రోహిత్ టీ20ల్లోనూ ఆడాలి - లేదంటే వారి ఫేర్​వెల్ బాధ్యత హార్దిక్​దే' : షోయబ్

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 25, 2023, 5:04 PM IST

Updated : Nov 25, 2023, 5:26 PM IST

Shoaib Akhtar On Rohit - Virat : టీమ్ఇండియా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. ప్రొఫెషనల్ కెరీర్​పై కొన్ని రోజులుగా చర్చ నడుస్తోంది. రీసెంట్​గా పాకిస్థాన్ మాజీ ప్లేయర్ షోయబ్ అక్తర్ ఏమన్నాడంటే?

shoaib akhtar on rohit virat
shoaib akhtar on rohit virat

Shoaib Akhtar On Rohit - Virat : వన్డే వరల్డ్​కప్ ముగిసిన తర్వాత.. టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కెరీర్​ గురించే చర్చ నడుస్తోంది. ముఖ్యంగా గత ఏడాదిగా వీళ్లు టీ20 ఫార్మాట్​కు దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో వీరిద్దరూ టీ20ల్లోకి రీ ఎంట్రీ ఇస్తారా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి సందర్భంలో పాకిస్థాన్‌ మాజీ ప్లేయర్ షోయబ్‌ అక్తర్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

"ప్రస్తుతం రోహిత్​ను మించిన ఓపెనర్ టీమ్ఇండియాకు లేడు. విరాట్, రోహిత్​లో ఇంకా క్రికెట్ ఆడే సత్తా ఉంది. అందుకనే వారు టీ20ల్లోనూ ఆడాలి. వచ్చే ఏడాది వరల్డ్​కప్​ జట్టులోనూ వాళ్లిద్దరు ఉండాలి. ఒకవేళ వారు ఆడకూడదని నిర్ణయం తీసుకుంటే.. వారికి గ్రాండ్​గా ఫేర్​వెల్ ఇవ్వాల్సిన బాధ్యత ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్య తీసుకోవాలి. గతంలో సీనియర్లు ఇదే విధంగా చేశారు. ధోనీ కెప్టెన్సీ హోదాలో సచిన్ తెందూల్కర్​కు, ధోనికి విరాట్ కోహ్లీ.. తర్వాత విరాట్​కు రోహిత్ ఇవ్వల్సిన గౌరవం ఇచ్చారు. ఇప్పుడు హార్దిక్ కూడా అదే ఫాలో అవ్వాలి. కానీ హార్దిక్ ఇద్దరు స్టార్ క్రికెటర్లకు సెండాఫ్ ఎలా ఇస్తాడో ఇంట్రెస్టింగ్​గా ఉంది. కానీ ఇది అతడి కర్తవ్యం" అని అక్తర్ అన్నాడు.

  • Rohit Sharma was broken and hurt after the defeat in the World Cup final, he spoke to BCCI and wanted to give his apology.

    But BCCI said pls don't take any decision emotionally, you gave your best. We will talk later. - (Sports Tak) pic.twitter.com/jXgGdCAD74

    — Vishal. (@SPORTYVISHAL) November 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

వచ్చే ప్రపంచకప్​లోనూ ఆడాలి.. కెప్టెన్​ రోహిత్ శర్మ.. వచ్చే వరల్డ్​కప్​లోనూ ఆడాలని శ్రీలంక మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరణ్ అన్నాడు."రోహిత్ శర్మ మరో ప్రపంచకప్ ఆడాలి. అతడు వన్డేల్లోనే.. టీ20 తరహా, దాదాపు 130 స్ట్రైక్ రేట్​తో బ్యాటింగ్ చేస్తున్నాడు. రోహిత్ వరల్డ్​ క్లాస్ ప్లేయర్. అంతేకాదు అతడు అనుభవజ్ఞుడు కూడా" అని అన్నాడు.

వాళ్లిద్దరూ ఉండాల్సిందే.. 2024 టీ20 వరల్డ్​కప్​ టీమ్ఇండియాలో రోహిత్, కోహ్లీ ఉండాలని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. '2024 టీ20 వరల్డ్​కప్​లో రోహిత్.. టీమ్ఇండియాకు సారథ్యం వహించడం చూడాలని ఉంది. అతడు అత్యుత్తమ బ్యాటర్. అలాగే విరాట్ కోహ్లీ కూడా జట్టులో ఉండాలి' అని గంభీర్ ఇటీవల ఓ సందర్భంలో అన్నాడు.

'టీ20 భవిష్యత్​పై నిర్ణయం మీదే' - రోహిత్​, విరాట్​కు బీసీసీఐ ఫుల్ ఫ్రీడమ్! - ఆడాల్సిందేనంటూ ఫ్యాన్స్​ రిక్వెస్ట్​

ఫ్యాన్స్​ అందరికీ సేమ్​ డౌట్!- రోహిత్-విరాట్​ గమనం ఎటో?

Last Updated : Nov 25, 2023, 5:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.