ETV Bharat / sports

'టీ20 భవిష్యత్​పై నిర్ణయం మీదే' - రోహిత్​, విరాట్​కు బీసీసీఐ ఫుల్ ఫ్రీడమ్! - ఆడాల్సిందేనంటూ ఫ్యాన్స్​ రిక్వెస్ట్​

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 23, 2023, 10:43 AM IST

Updated : Nov 23, 2023, 11:29 AM IST

Rohit - Virat T20 Career : టీమ్ఇండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. టీ20 కెరీర్​ ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో పొట్టిఫార్మాట్​లో కొనసాగేది, లేనిది విషయంపై వారినే నిర్ణయం తీసుకోమని బీసీసీఐ చెప్పిందట!

Rohit - Virat T20 Career
Rohit - Virat T20 Career

Rohit - Virat T20 Career : వన్డే వరల్డ్​కప్ ముగిసిన తర్వాత అందరి మదిలో ఒకటే ప్రశ్న. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రొఫెనషల్​ ఫ్యూచర్ ప్లాన్స్​ ఏంటి అని. అయితే వీరిద్దరూ వయసు రీత్య 2027 వన్డే వరల్డ్​కప్ భారత్ జట్టులో ఉండడం కష్టమేని కథనాలు వస్తున్న నేపథ్యంలో.. టీ20ల విషయం చర్చనీయాంశమైంది. 2024 టీ20 వరల్డ్​కప్​నకు కేవలం ఏడు నెలల సమయం మాత్రమే ఉండడం వల్ల ఇప్పుడు టీమ్ఇండియాలో ఇదే హాట్ టాపిక్​గా మారింది.

అయితే 2022 టీ20 ప్రపంచకప్​ తర్వాత.. రోహిత్ పొట్టి ఫార్మాట్​కు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అటు విరాట్​ది కూడా దాదాపు ఇదే పరిస్థితి. ఈ నేపథ్యంలో రోహిత్, విరాట్ ఇక టీ20లకు త్వరలోనే గుడ్​బై చెప్పవచ్చని కథనాలు వెలువడుతున్నాయి. కానీ, వీరిద్దరు టీ20 ఫార్మాట్​ రిటైర్మెంట్​ గురించి ఎక్కడా మాట్లాడలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం.. టీ20ల్లో ఆడటంపై వారే స్వయంగా నిర్ణయం తీసుకునే పూర్తి స్వేచ్ఛ బీసీసీఐ కల్పించిందట! దీంతో రానున్న రోజుల్లో వీరి నిర్ణయాలు ఎలా ఉండనున్నాయో అని ఫ్యాన్స్ ఆందోళనలో ఉన్నారు. ఇక రోహిత్ - విరాట్ 2024 టీ20 వరల్డ్​కప్​లో కచ్చితంగా ఉండాలని.. మళ్లీ వీరిద్దరు కలిసి ఆడితే చూడాలనుందంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.

  • Both will play the T20 World cup ..I guess Rohit lost the world cup that's why he will try to play as a captain and try to win.
    If India would have won the world cup things could be different..! pic.twitter.com/feRUlUnsbo

    — Sujeet Suman (@sujeetsuman1991) November 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • The BCCI has told Virat Kohli and Rohit Sharma to decide on their future in T20is by themselves. (Abhishek Tripathi). pic.twitter.com/ToMhVYcVCU

    — Mufaddal Vohra (@mufaddal_vohra) November 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Rohit Sharma T20 Stats : రోహిత్ శర్మ కెరీర్​లో 148 అంతర్జాతీయ టీ20 మ్యాచ్​లు ఆడాడు. అందులో నాలగు సెంచరీలతో సహా 3853 పరుగులు చేశాడు. ఇక టీ20ల్లో నాలుగు సెంచరీలు బాదిన ఏకైక క్రికెటర్​గా రోహిత్ రికార్డు కొట్టాడు. అలాగే టీ20ల్లో అత్యధిక పరుగులు బాదిన జాబితాలో విరాట్​ తర్వాతి స్థానం రోహిత్​దే.

Virat Kohli T20 Stats : విరాట్ కోహ్లీ కెరీర్​లో 115 టీ20 మ్యాచ్​లు ఆడాడు. 52.74 సగటుతో అతడు 4008 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకం, 37 అర్ధ శతకాలు ఉన్నాయి. ఈ క్రమంలో టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్​గా విరాట్ నిలిచాడు.

ఫ్యాన్స్​ అందరికీ సేమ్​ డౌట్!- రోహిత్-విరాట్​ గమనం ఎటో?

ఈ హీరోలకిదే లాస్ట్​ వరల్డ్​ కప్​!- మళ్లీ మెగాటోర్నీలో కనిపించరా?

Last Updated : Nov 23, 2023, 11:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.