తెలంగాణ

telangana

సోనూసూద్ యాక్షన్ సినిమా.. 'శ్యామ్​ సింగరాయ్' మేకింగ్ వీడియో

By

Published : Dec 23, 2021, 5:46 PM IST

Cinema news: సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్, బంగార్రాజు, సోనూసూద్ హీరో సినిమా, శ్యామ్ సింగరాయ్ మేకింగ్ వీడియో సంగతులు ఉన్నాయి.

sonu sood nani
సోనూసూద్ నాని

Radhe shyam pre release event: 'రాధేశ్యామ్' ప్రీ రిలీజ్ ఈవెంట్​కు అంతా సిద్ధమైంది. ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్​సిటీలో ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ ఈవెంట్​కు నవీన్ పోలిశెట్టి యాంకరింగ్ చేస్తాడని నిర్మాణ సంస్థ వెల్లడించింది.

నవీన్ పోలిశెట్టి

ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజాహెగ్డే హీరోయిన్​గా నటించింది. కృష్ణంరాజు కీలకపాత్ర పోషిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందిస్తున్నారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 14న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Sonusood movie: సోనూసూద్ హీరోగా కొత్త సినిమాను ప్రకటించారు. యాక్షన్ థ్రిల్లర్​గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'ఫతే' టైటిల్​ను ఖరారు చేశారు. ఈ విషయాని చెప్పడం సహా పోస్టర్​ను రిలీజ్ చేశారు.

ఫతే సినిమాలో సోనూసూద్

'బాజీరావ్ మస్తానీ', 'షంసేరా' సినిమాలకు అసిస్టెంట్​గా చేసిన అభినందన్ గుప్తా.. 'ఫతే' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నిజజీవిత సంఘటనలో ఆధారంగా తీస్తున్న ఈ సినిమాలో ఫుల్​గా యాక్షన్ సీన్స్ ఉండనున్నాయి. ఫిబ్రవరిలో షూటింగ్ మొదలుకానుంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

Bangarraju Movie: 'బంగార్రాజు' సినిమా షూటింగ్ గురించి హీరో నాగార్జున ట్వీట్ చేశారు. చివరి రోజు చిత్రీకరణలో ఉన్నామని, మరో స్పెషల్ సాంగ్ సిద్ధమవుతుందని రాసుకొచ్చారు. పండగలాంటి సినిమా 'బంగార్రాజు' అని అన్నారు.

నాగచైతన్య కృతిశెట్టి

'సోగ్గాడే చిన్న నాయన' సినిమాకు ప్రీక్వెల్​గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగార్జున, రమ్యకృష్ణతో పాటు నాగచైతన్య, కృతిశెట్టి కూడా ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తున్నారు. కల్యాణ్​కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 15న ఈ సినిమా రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.

Nani shyam singha roy movie: నాని 'శ్యామ్​సింగరాయ్' సినిమా.. శుక్రవారం థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మూవీ మేకింగ్ వీడియో విడుదల చేశారు. ఇందులో చిత్రబృందం పడిన కష్టం కనిపిస్తుంది.

నాని ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. మిక్కీ జే మేయర్ సంగీతమందించారు. రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వం వహించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details