ETV Bharat / sitara

'రాధేశ్యామ్​'లో చాలా సర్​ప్రైజ్​లు: డైరెక్టర్ రాధాకృష్ణ

author img

By

Published : Dec 14, 2021, 5:30 AM IST

prabhas pooja hegde
ప్రభాస్ పూజాహెగ్డే

Radhe shyam movie: సెట్​లో ప్రభాస్​ పిల్లాడిలా ఉంటారని చెప్పిన 'రాధేశ్యామ్' డైరెక్టర్​ రాధాకృష్ణ.. ఈ సినిమాలో కళ్లతో నటించేశాడని అన్నారు. అలానే ఈ చిత్రంల చాలా సర్​ప్రైజ్​లో ఉన్నాయని చెప్పారు.

Radhe shyam songs: కొన్నిరోజుల క్రితం తెలుగులో ఏ సినిమా పోస్టర్, పాటలు, ట్రైలర్​ రిలీజైనా సరే ఒక్కటే ప్రశ్న. 'రాధేశ్యామ్' అప్డేట్స్ ఎక్కడా అని. అయితే వాటికి సమాధానంగా ఇటీవల కాలంలో పాటలు, టీజర్ విడుదల చేసి ఫ్యాన్స్​ను సంతృప్తిపరిచారు.

రిలీజ్ దగ్గరపడుతున్నప్పటికీ సినిమా గురించి అభిమానులకు తెలిసింది చాలా తక్కువే. వాళ్ల ప్రశ్నలు అన్నింటికీ సమాధానమిచ్చేందుకు 'రాధేశ్యామ్' డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ వచ్చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

prabhas radha krishna kumar
డైరెక్టర్ రాధాకృష్ణతో ప్రభాస్

Radhakrishna kumar: దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దగ్గర తాను తొమ్మిదేళ్ల పాటు డైరెక్షన్ డిపార్ట్​మెంట్​లో పనిచేశానని రాధాకృష్ణ చెప్పారు. తన మొదటి చిత్రం 'జిల్' యూవీ క్రియేషన్స్ నిర్మించిందని, ఆ తర్వాత ప్రభాస్​కు 'రాధేశ్యామ్' కథ వినిపించానని తెలిపారు.

ఈ సినిమాలో చాలా సర్​ప్రైజ్​లు ఉన్నాయని రాధాకృష్ణ కుమార్ వెల్లడించారు. ప్రభాస్​ నటన ఈ సినిమాలో అద్భుతంగా ఉంటుందని, సినిమా మొత్తం అతడు కళ్లతో నటించేశాడని ఈ డైరెక్టర్ చెప్పుకొచ్చారు. సెట్​లో ప్రభాస్ చిన్నపిల్లాడిలా ఉంటారని, ఈ సినిమాలో డార్లింగ్ వన్​ మ్యాన్ షో చూస్తారని రాధాకృష్ణ చెప్పారు.

radhe shyam prabhas looks
'రాధేశ్యామ్​'లో ప్రభాస్

Prabhas radhe shyam: 'రాధేశ్యామ్'లో మొత్తం 16 పాత్రలు ఉంటాయని చెప్పిన రాధాకృష్ణ.. ప్రభాస్​ తల్లిగా అలనాటి హీరోయిన్ భాగ్యశ్రీ నటించారని అన్నారు. అలానే ఓ కీలకపాత్రలో కృష్ణంరాజు కనిపిస్తారని.. అదే పాత్రను ఉత్తరాదిలో సత్యరాజ్ చేశారని తెలిపారు.

ఈ సినిమాలో పూజాహెగ్డే ప్రశ్న అయితే.. ప్రభాస్ దానికి సమాధానంగా నిలుస్తారని రాధాకృష్ణ చెప్పారు. మన దేశంలో ప్రారంభమయ్యే 'రాధేశ్యామ్' కథ.. రోమ్​, లండన్​లో ఉంటుందని తెలిపారు. అలానే మంచి పర్వతంపై కూర్చుని సూర్యాస్తమయం చూస్తున్నట్లు ఈ సినిమా ఉంటుందని అన్నారు.

prabhas pooja hegde
ప్రభాస్ పూజాహెగ్డే

1970ల నాటి కథతో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ పామిస్ట్​గా(హస్తరేఖలు చూసి భవిష్యత్​ చెప్పే వ్యక్తి) కనిపించారు. ఈ రొమాంటిక్​ లవ్​స్టోరీలో పూజాహెగ్డే హీరోయిన్. దక్షిణాదిలో జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందించారు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి. జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సినిమా విడుదల కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.