తెలంగాణ

telangana

Amitabh Bachchan : రామోజీ ఫిల్మ్‌సిటీలో మొక్కలు నాటిన అమితాబ్‌ బచ్చన్‌

By

Published : Jul 27, 2021, 11:14 AM IST

Updated : Jul 27, 2021, 12:37 PM IST

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరో మైలురాయిని చేరుకుంది. స్వయంగా బాలీవుడ్ సూపర్ స్టార్.. అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) ఈ సవాల్​ను స్వీకరించారు. తెలంగాణ ఎంపీ సంతోశ్​ కుమార్​ ఛాలెంజ్​ను స్వీకరించిన బిగ్​ బీ.. హైదరాబాద్​ ఫిల్మ్​ సిటీలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ సంతోశ్​ను ప్రశంసించారు.

రామోజీ ఫిల్మ్‌సిటీలో మొక్కలు నాటిన అమితాబ్‌ బచ్చన్‌
రామోజీ ఫిల్మ్‌సిటీలో మొక్కలు నాటిన అమితాబ్‌ బచ్చన్‌

రాజ్యసభ ఎంపీ సంతోశ్​ కుమార్​.. ఈయన పేరు ఎప్పుడు విన్నా.. అది ఎక్కువగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. హరిత సవాల్​ ద్వారానే ఉంటుంది. ఎందుకంటే.. తెలంగాణ తల్లికి పచ్చచీర కట్టాలని.. రాష్ట్రమంతా పచ్చదనంతో పరిఢవిల్లాలనే ఉద్దేశంతో సంతోశ్.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్​ను మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఎందరో సినిమా సెలిబ్రిటీలు, ప్రముఖ రాజకీయ నాయకులకు హరిత సవాల్ విసిరారు.

మొక్క నాటిన బిగ్​బీ

ఇవీ చదవండి :

సంతోశ్ ఛాలెంజ్​ను స్వీకరించిన ఎంతో మంది ప్రముఖులు.. మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో తమ వంతు కృషి చేశారు. తాజాగా.. పద్మవిభూషణ్.. బాలీవుడ్ సూపర్ స్టార్.. అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్​ సిటీలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున, సినీ నిర్మాత అశ్వినీదత్, దర్శకుడు నాగ్ అశ్విన్, ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరి పాల్గొన్నారు.

అమితాబ్​తో ఎంపీ సంతోశ్

ఇవీ చదవండి :

గ్రీన్ ఇండియా ఛాలెంజ్​ను ప్రారంభించి.. పచ్చదనానికి, పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న రాజ్యసభ ఎంపీ సంతోశ్ కుమార్​ను అమితాబ్(Amitabh Bachchan) ప్రశంసించారు. ఈ కార్యక్రమం ద్వారా నాటిన మొక్కలు మహావృక్షాలై ఎదిగి తర్వాతి తరానికి ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ప్రతి ఒక్కరు ఈ ఛాలెంజ్​ను స్వీకరించి.. మొక్కలు నాటాలని సూచించారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోశ్.. అమితాబ్​కు వృక్షవేదం పుస్తకాన్ని అందించారు.

వృక్షవేదం పుస్తకాన్ని అమితాబ్​కు అందజేసిన ఎంపీ

పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని హీరో నాగార్జున కోరారు. ఎంపీ సంతోష్‌ 16 కోట్ల మొక్కలు నాటించడం ప్రశంసనీయమని అభినందించారు. మొక్కలు నాటడమే కాకుండా.. వాటిని సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలని సూచించారు.

ఇవీ చదవండి :

Last Updated : Jul 27, 2021, 12:37 PM IST

ABOUT THE AUTHOR

...view details