ETV Bharat / state

tamilisai soundararajan: 'పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత'

author img

By

Published : Jun 5, 2021, 10:33 PM IST

ప్రపంచ పర్యావరణ దినోత్సవం(world environment day) సందర్భంగా ఎంపీ సంతోశ్​​ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో భాగంగా... గవర్నర్ తమిళిసై సౌందరరాజన్(tamilisai soundararajan) దంపతులు రాజ్​భవన్​లో మొక్కలు నాటారు. సందర్భం ఏదైనా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపాడాలని కోరారు.

tamilisai soundararajan: 'పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత'

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని(world environment day) పురస్కరించుకొని ఎంపీ సంతోశ్​​ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్​(green india challenge)లో భాగంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్(tamilisai soundararajan) దంపతులు రాజ్​భవన్​లో మొక్కలు నాటారు. సందర్భం ఏదైనా పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటాలని… పర్యావరణ రక్షణ బాధ్యత అందరిపై ఉందని గవర్నర్ తమిళిసై గుర్తు చేశారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభించిన రాజ్యసభ సభ్యులు సంతోశ్​​ కుమార్​తో కలిసి మొక్కలు నాటిన గవర్నర్… ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేలా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఎంపీ సంతోశ్​​​ను అభినందించారు. ఈ కార్యక్రమం విజయవంతంగా ముందుకు కొనసాగాలని… అందుకు తమ పూర్తి మద్ధతు ఉంటుందని గవర్నర్ తమిళిసై అన్నారు. ఈ సందర్భంగా పాండిచ్చేరి రాజ్​భవన్​లో కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్(green india challenge) కార్యక్రమం చేపట్టేందుకు ఎంపీ సంతోశ్​​ను గవర్నర్ ఆహ్వానించారు.

ఇదీ చూడండి: Harish rao: 'ప్రాణమున్నంత వరకు కేసీఆర్​ మాట జవదాటను'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.