ETV Bharat / city

పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటిన ఎమ్మెల్సీ కవిత

author img

By

Published : Mar 13, 2021, 1:51 PM IST

Updated : Mar 13, 2021, 2:38 PM IST

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌కుమార్ ఇచ్చిన గ్రీన్​ ఛాలెంజ్​ను స్వీకరిస్తూ... తన పుట్టినరోజున మొక్కలు నాటారు. అమ్మతో కలిసి మొక్కలు నాటటం ఆనందంగా ఉందన్న కవిత... మంచి బహుమతి ఇచ్చారని హర్షం వ్యక్తం చేశారు.

mlc kavitha green challenge on her birthday
mlc kavitha green challenge on her birthday

పుట్టిన రోజు సందర్భంగా... తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌కుమార్ ఇచ్చిన గ్రీన్​ ఛాలెంజ్​లో భాగంగా... తన జన్మదినాన ప్రగతిభవన్‌లో తల్లి శోభతో కలిసి మొక్కలు నాటారు.

అమ్మ, అన్నయ్య‌తో కలిసి మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందని కవిత హర్షం వ్యక్తం చేశారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ... పచ్చదనం పెంచడం కోసం కృషి చేస్తున్న సంతోష్‌కుమార్​ను ప్రశంసించారు. ఈ బృహత్తర కార్యక్రమంలో భాగం చేస్తూ... తన చేత మొక్కలు నాటించి పుట్టిన రోజుకు మంచి బహుమతి అందించారని కవిత కృతజ్ఞతలు తెలిపారు.

mlc kavitha green challenge on her birthday
గ్రీన్​ఛాలెంజ్​లో మొక్క నాటుతున్న కవిత

ఇదీ చూడండి: హ్యాపీ బర్త్​డే కవితక్క.. వినూత్నంగా శుభాకాంక్షల వెల్లువ

Last Updated : Mar 13, 2021, 2:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.