తెలంగాణ

telangana

పశ్చిమ దేశాల ఖైదీల విడుదలకు ఒప్పందం?

By

Published : May 3, 2021, 8:10 AM IST

తమ దేశంలో ఖైదీలుగా ఉన్న అమెరికా, బ్రిటన్ సహా.. ఇతర పశ్చిమ దేశాలకు చెందిన పౌరులను పరస్పర ఒప్పందం ప్రాతిపదికన విడుదల చేసేందుకు ఆయా దేశాలు అంగీకరించాయని ఇరాన్ అధికారిక టీవీ ప్రకటించింది. అయితే ఈ కథనాన్ని అమెరికా ఖండించింది. అయితే బ్రిటన్ మాత్రం దీనిపై స్పందించేందుకు నిరాకరించింది.

iran flag
ఇరాన్ జాతీయ జెండా

ఖైదీల విడుదలపై అమెరికా, బ్రిటన్​లతో తమ దేశం కీలక అవగాహన కుదుర్చుకున్నట్లు ఇరాన్ అధికారిక టీవీ ఛానల్ ఆదివారం పేర్కొంది. దీని ప్రకారం ఆయా దేశాలతో సంబంధాలున్న ఖైదీలను ఇరాన్ విడుదల చేస్తుందని తెలిపింది. ఇందుకు బదులుగా.. తమకు సంబంధించి స్తంభింపజేసిన వందల కోట్ల డాలర్లను అమెరికా, బ్రిటన్​లు విడుదల చేస్తాయని వెల్లడించింది.

అయితే ఈ కథనాన్ని అమెరికా ఖండించింది. బ్రిటన్ మాత్రం దీనిపై స్పందించలేదు. "700కోట్ల డాలర్లను విడుదల చేయడానికి, నలుగురు ఇరాన్ వాసులను మాకు అప్పగించడానికి అమెరికా అంగీకరించింది. ప్రతిగా నలుగురు అమెరికా గూఢచారులను విడుదల చేస్తాం" అని ఇరాన్ టీవీ పేర్కొంది.

బ్రిటిష్-ఇరాన్ మహిళ నెజానిన్ జాఘారి-రాట్​క్లిఫ్ విడుదలకు బదులుగా 40 కోట్ల పౌండ్లను చెల్లించేందుకు బ్రిటన్ అంగీకరించినట్లు తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details