తెలంగాణ

telangana

కరోనా కల్లోలం: ఒక్కరోజే మూడు లక్షల కేసులు

By

Published : Oct 1, 2020, 7:12 AM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ఒక్కరోజే మూడు లక్షల పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. కేసుల సంఖ్య మూడు కోట్ల 41 లక్షలు దాటిపోయింది. అమెరికా, బ్రెజిల్, స్పెయిన్​లో వైరస్ వ్యాప్తి తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది.

covid-19 tally crosses 3.41 crore mark with over three lakh new cases
కరోనా కల్లోలం: ఒక్కరోజే మూడు లక్షల కేసులు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. ఒకరోజు వ్యవధిలో మూడు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. మరో 6 వేల మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మరణాల సంఖ్య పది లక్షల 18 వేలకు చేరింది. మొత్తం కేసుల సంఖ్య మూడు కోట్ల 41 లక్షలు దాటింది.

  • మొత్తం కేసులు:3,41,46,558
  • యాక్టివ్ కేసులు:77,18,226
  • కొత్తగా నమోదైన కేసులు:3,12,433
  • మొత్తం మరణాలు:10,18,193

అమెరికాలో కరోనా విలయం అదే స్థాయిలో కొనసాగుతోంది. 40 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. 953 మంది బాధితులు మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 74.47 లక్షలకు పెరగ్గా.. మరణాల సంఖ్య రెండు లక్షల 11 వేలకు ఎగబాకింది.

బ్రెజిల్​లో 33 వేల కేసులు బయటపడ్డాయి. మరో 952 మంది ప్రాణాలు కోల్పోయారు. రష్యాలో కొత్తగా 8,481 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. 177 మంది మరణించారు.

అర్జెంటీనాలో మరో 14 వేల మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. ఫలితంగా దేశంలో కేసుల సంఖ్య 7 లక్షల 51 వేలకు పెరిగింది. ఒక్కరోజులో 418 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మరణాల సంఖ్య 17 వేలకు చేరువైంది.

స్పెయిన్​లో కొత్తగా 11 వేల కేసులు వెలుగులోకి వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 7.70 లక్షలకు చేరువైంది. 177 మంది మరణంతో కరోనా మృతుల సంఖ్య 31,791కి పెరిగింది.

పలు దేశాల్లో కరోనా కేసుల వివరాలు ఇలా...

దేశం కేసులు మరణాలు
అమెరికా 74,47,273 2,11,738
బ్రెజిల్ 48,13,586 1,43,962
రష్యా 11,76,286 20,722
కొలంబియా 8,29,679 25,998
పెరూ 8,14,829 32,463
స్పెయిన్ 7,69,188 31,791
అర్జెంటీనా 7,51,001 16,937

ABOUT THE AUTHOR

...view details