తెలంగాణ

telangana

రైతు ఉద్యమంపై ఇండియన్ కాకస్ ఏమందంటే?

By

Published : Feb 6, 2021, 2:10 PM IST

రైతుల ఉద్యమంపై.. భారత వ్యవహారాలు పరిశీలించే అమెరికా చట్టసభ్యుల బృందం కాకస్ స్పందించింది. అన్నదాతలు శాంతియుతంగా నిరసనలు చేసేందుకు అనుమతించాలని భారత ప్రభుత్వాన్ని కోరింది. ఉన్నత విలువల నుంచి భారత్ తప్పుకోదని అభిప్రాయం వ్యక్తం చేసింది.

Congressional India Caucus leadership urges India to allow peaceful demonstration
రైతు ఉద్యమంపై ఇండియన్ కాకస్ ఏమందంటే?

దేశంలో కొనసాగుతున్న రైతుల ఆందోళనలపై అమెరికా చట్టసభలో భారత్ వ్యవహరాలు పర్యవేక్షించే ప్రతినిధుల బృందం(కాకస్) స్పందించింది. ప్రజాస్వామ్య నిబంధనల మేరకు అన్నదాతలు శాంతియుతంగా ఆందోళనలు చేసేందుకు అవకాశం కల్పించాలని భారత ప్రభుత్వానికి సూచించింది. ఆందోళన ప్రదేశాల్లో అంతర్జాల సదుపాయం కల్పించాలని కోరింది.

రైతు ఆందోళనలపై ఇప్పటికే అమెరికాలో భారత రాయబారి తరణ్‌జిత్‌ సింగ్‌తో మాట్లాడినట్లు భారతీయ కాకస్‌ సహ-అధ్యక్షుడు బ్రాడ్ షీర్‌మన్‌ తెలిపారు. ఈ సందర్భంగా పలువురు అమెరికా చట్టసభ్యులు అన్నదాతల నిరసనలపై తమ అభిప్రాయాలు పంచుకున్నారు.

"ప్రజాస్వామ్య నిబంధనలు అమలయ్యేలా చూడాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. శాంతియుతంగా నిరసనలు తెలిపేందుకు నిరసనకారులకు అనుమతించాలని కోరుతున్నా. నిరసన ప్రాంతాల్లోకి జర్నలిస్టులను అనుమతించాలి. ఇరుపక్షాలు త్వరలోనే ఓ అంగీకారానికి వస్తారని భారత్​ స్నేహితులంతా భావిస్తున్నారు"

-బ్రాడ్ షీర్​మన్, కాకస్ సహ అధ్యక్షుడు

వాక్‌ స్వాతంత్ర్యం ప్రజాస్వామ్య చిహ్నమని ప్రముఖ చట్ట సభ సభ్యుడు స్టీవ్‌ కోహెన్‌ అన్నారు. భారత్‌లో అన్నదాతల నిరసనలను నిశితంగా గమనిస్తున్నట్లు చెప్పారు. అమెరికా, భారత్ రెండు దేశాల అభివృద్ధికి రైతులే కారణమని మరో సభ్యుడు ఎరిక్‌ స్వాల్‌వెల్‌ అన్నారు. భారత్ ఉన్నత విలువల నుంచి పక్కకు తప్పుకోబోదని అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి:'రైతులు, కేంద్రం సంయమనం పాటించాలి'

ABOUT THE AUTHOR

...view details