తెలంగాణ

telangana

'డంకీ' డైరెక్టర్​తో చెర్రీ బాలీవుడ్​ మూవీ - ఇదిగో క్లారిటీ!

By ETV Bharat Telugu Team

Published : Dec 31, 2023, 12:42 PM IST

Updated : Dec 31, 2023, 12:58 PM IST

Ram Charan Bollywood Movie : గ్లోబల్ స్టార్​ రామ్​ చరణ్​ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ షూటింగ్​లో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా ఆయన బాలీవుడ్​లో మరికొన్ని సినిమాలకు సైన్​ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతునన్నాయి. అందులో 'డంకీ' డైరెక్టర్ రాజ్​కుమార్ హిరానీది కూడా ఉందట. అయితే ఈ విషయంపై తాజాగా రాజ్​ కుమార్​ క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే ?

Ram Charan  Bollywood Movie
Ram Charan Bollywood Movie

Ram Charan Bollywood Movie :'ఆర్​ఆర్​ఆర్​' సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో ఫ్యాన్​ ఫాలోయింగ్ అందుకుని గ్లోబల్ స్టార్​గా మారిపోయారు. దీంతో ఫ్యాన్స్​ ఈయన అప్​కమింగ్​ మూవీస్​పై తెగ ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే సౌత్​తో తన సినిమాలతో ఫ్యాన్స్​ను అలరిస్తున్న ఈ స్టార్​ హీరో త్వరలో మరోసారి బాలీవుడ్​లోకి ఎంట్రీ ఇవ్వనున్నారన్న వార్తలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పటికే ఆయన డబ్బింగ్ సినిమాలతో బీటౌన్​ ప్రేక్షకులను ఆకట్టుకోగా, ఇప్పుడు ఓ స్ట్రైట్​ మూవీతో అక్కడ థియేటర్లలో సందడి చేయనున్నారని సమాచారం. ఇందులో ధూమ్​ 4 తో పాటు 'డంకీ' డైరెక్టర్​ రాజ్​కుమార్​ హిరానీతో ఓ ప్రాజెక్ట్ ఉందట. అయితే తాజాగా ఈ విషయంపై రాజ్​కుమార్​ హిరానీ క్లారిటీ ఇచ్చారు.

"ప్రస్తుతానికైతే నేను రామ్​ చరణ్​తో ఎలాంటి సినిమా ప్లాన్ చేయడం లేదు. కానీ నాకు రామ్ చరణ్ బాగా తెలుసు. ఒక వేళ ఆయనతో సినిమా చేసే అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను. ఇక 'ఆర్ఆర్ఆర్' సినిమాలో రామ్ చరణ్ నటన అద్భుతం." అంటూ చెర్రీని పొగడ్తలతో ముంచెత్తారు.

Ram Charan Movies List : ఇక చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్నారు. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చరణ్ సరసన కియారా అడ్వాణీ నటిస్తోంది. పొలిటికల్ సెటైర్​గా ఈ సినిమాను శంకర్ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం షూటింగ్​కు గ్యాప్ ఇచ్చి కుటుంబంతో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న చరణ్ త్వరలోనే ఈ సినిమా షూటింగ్​లో పాల్గొననున్నారు.

Ram Charan Cricket Team :మరోవైపు చెర్రీ తాజాగా ఇండియన్ స్ట్రీట్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ISPL- T10 ) లీగ్​లో 'టీమ్ హైదరాబాద్‌' జట్టును కొనుగోలు చేశారు. దీనిపై ఆయన ఆనందం వ్యకం చేశాడు. ' క్రికెట్​లో కొత్తరకమైన ఎంటర్​టైన్​మెంట్​ను ఈ టోర్నీ అందించనుంది. లోకల్ ప్లేయర్లు తమ టాలెంట్​ను నేషనల్​వైడ్​గా​చూపేందుకు ఈ టోర్నీ ప్లాట్​ఫామ్​లా ఉపయోగడుతుంది. నేను హైదరాబాద్​ జట్టును సొంతం చేసుకోవడం హ్యాపీగా ఉంది' అని అన్నారు. అయితే ఈ టోర్నీతో తెలుగు రాష్ట్రాల్లో క్రికెట్​పై ఇంట్రెస్ట్​ ఉన్నవారికి రామ్​చరణ్ మంచి అవకాశం కల్పించినట్లైంది. ఇక ఈ లీగ్​లో రామ్​చరణ్​తోపాటు బాలీవుడ్ స్టార్లు అక్షయ్ కుమార్ (శ్రీ నగర్), అమితాబ్ బచ్చన్ (ముంబయి), హృతిక్ రోషన్ (బెంగళూరు) జట్లకు యజమానులుగా వ్యవహరిస్తున్నారు.

రామ్​చరణ్​కు అరుదైన గౌరవం- పాప్ గోల్డెన్ అవార్డ్స్​లో విజేతగా స్టార్ హీరో

'ఫోర్బ్స్' మ్యాగజైన్​పై స్టైలిష్​గా చెర్రీ, ఉప్సీ- టాలీవుడ్​ ఫస్ట్ కపుల్​గా ఘనత!

Last Updated :Dec 31, 2023, 12:58 PM IST

ABOUT THE AUTHOR

...view details