తెలంగాణ

telangana

'నా గురించి చెబితే.. మెడలో ఈ చాక్‌పీసు తాళి కట్టేస్తా..'

By

Published : Apr 30, 2022, 8:30 AM IST

Sexual Harassment: చదువుతో పాటు సంస్కారాన్ని బోధించాల్సిన అధ్యాపకులు.. విద్యార్థునుల పాలిట కీచకుల్లా మారుతున్నారు. వెకిలి చేష్టలతో తీవ్రంగా వేధిస్తున్నారు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక, ఏంచేయాలో అర్థంకాక.. విద్యార్థినులు నరకయాతన పడుతున్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన ఉపాధ్యాయుడు బాలికలపై వికృత చేష్టలకు పాల్పడ్డుతున్న ఘటన.. ఆంధ్రప్రదేశ్​ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో జరిగింది.

Sexual Harassment
Sexual Harassment

Sexual Harassment: పిల్లలకు చక్కగా చదువు చెప్పి, వారిని తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడు వికృత చేష్టలు ప్రదర్శిస్తూ విద్యావ్యవస్థకే మచ్చ తెచ్చాడు. అభం శుభం తెలియని విద్యార్థినులను లైంగికంగా వేధించిన ఘటన ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలో జరిగింది. బంగారుపాళ్యం మండలం చిల్లగుండ్లపల్లె ప్రాథమిక పాఠశాలలో అబు (58) అనే ఉపాధ్యాయుడు పనిచేస్తున్నాడు. ఈయన నాలుగు, అయిదు తరగతులు చదువుతున్న 11 మంది విద్యార్థులను లైంగికంగా వేధించేవాడు. వారిపట్ల పైశాచికంగా ప్రవర్తించి, చిత్రహింసలు పెట్టేవాడు.

తల్లిదండ్రులు, ఇతరులెవరికైనా ఈ విషయాన్ని చెబితే టీసీ ఇచ్చి పంపేస్తానని, చాక్‌పీసుకు ఓ తాడు ముడివేసి.. ఈ తాళి కట్టేస్తానని భయపెట్టేవాడు. దువ్వెనతో వారి తలలు దువ్వి, పౌడర్‌ రాసి, బొట్టు బిళ్లలు (స్టిక్కర్లు) పెట్టేవాడని విద్యార్థినులు శుక్రవారం సాయంత్రం చిత్తూరు ఆర్డీవో రేణుక, డీఈవో పురుషోత్తం, ఎంఈవో నాగేశ్వరరావు, తహసీల్దారు సుశీలమ్మ, ఎంపీడీవో విద్యారమ, గ్రామస్థుల సమక్షంలో విలపించారు. వెంటనే స్పందించిన డీఈవో సదరు ఉపాధ్యాయుడిని సస్పెండు చేస్తున్నట్లు ప్రకటించారు. అతడిపై పోక్సో కేసు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాలని పోలీసులను ఆర్డీవో ఆదేశించారు.

ఉపాధ్యాయుడి వేధింపులు భరించలేక ఓ విద్యార్థిని శుక్రవారం సాయంత్రం తన తల్లిదండ్రులకు చెప్పింది. వెంటనే వారు స్థానిక ఎంపీటీసీ సభ్యుడు ఇందుశేఖర్‌రెడ్డి, సర్పంచి దీప ద్వారా కలెక్టరు హరినారాయణన్‌ దృష్టికి తీసుకెళ్లారు. కల్టెకరు స్పందించి విచారణకు ఆదేశించారు. విద్యార్థినులను లైంగికంగా వేధించిన ఉపాధ్యాయుడి కోసం పలమనేరు డీఎస్పీ గంగయ్య నేతృత్వంలో పోలీసులు గాలిస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details