తెలంగాణ

telangana

కీలక వడ్డీ రేట్లు మళ్లీ యథాతథమే!

By

Published : May 30, 2021, 6:47 PM IST

భారీ అంచనాల నడుమ ఈ వారం ఆర్​బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ సమీక్ష (MPC review meet) జరగనుంది. ఈ సారి సమీక్షలోనూ రెపో రేట్లలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో సర్దుబాటు వైఖరిని కొనసాగించే వీలుందని చెబుతున్నారు.

RBI MPC review expectations
ఆర్​బీఐ ఎంపీసీ సమీక్ష

దేశంలో కరోనా రెండో దశ అస్థిరతలు, ద్రవ్యోల్బణం(Inflation Fears) భయాలు ఇంకా కొనసాగుతున్నాయి. దీనితో ఈ సారి ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమీక్షలోనూ.. రెపో రేటు యథాతథంగా ఉంచే వీలుందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం రెపో రేటు (Repo rate now) 4 శాతం వద్ద, రివర్స్​ రెపో రేటు(Reverse Repo rate now) 3.35 శాతం వద్ద ఉన్నాయి. గత ఏడాది మేలో చివరి సారిగా రెపో, రివర్స్​ రెపో రేట్లను సవరించింది ఆర్​బీఐ.

తదుపరి ద్రవ్య విధాన కమిటీ 3 రోజుల సమీక్ష జూన్​ 2న ప్రారంభం కానుంది. ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంతదాస్​ కమిటీ నిర్ణయాలను జూన్​ 4న వెల్లడించనున్నారు.

స్థూల ఆర్థిక పరిస్థితులు 2021-22లో ఎంపీసీ సమీక్షలకు మార్గ నిర్దేశం చేయనున్నట్లు ఆర్​బీఐ గత వారం విడుదల చేసిన వార్షిక నివేదిక (RBI Annual report) ద్వారా స్పష్టమైంది. ముఖ్యంగా వృద్ధికి ఊతమిచ్చే, ద్రవ్యోల్బణాన్ని అదుపులో పెట్టే నిర్ణయాలకు కమిటీ ప్రాధాన్యమివ్వచ్చని కూడా తెలిసింది.

"ఆర్థిక వ్యవస్థ ఇంకా పూర్తిగా తెరుచుకోలేదు. టీకా అనిశ్చితులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సర్దుబాటు విధాన వైఖరి కొనసాగింపునకే ఆర్‌బీఐ మొగ్గుచూపే అవకాశం ఉంది."

- నిరంజన్ హిరానందని, నారెడ్కో జాతీయ అధ్యక్షుడు

కరోనా రెండో దశతో ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా కుదేలైందని ఈ కారణంగా వ్యవస్థలో ద్రవ్య లభ్యతను పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు నిరంజన్​. ముఖ్యంగా కరోనా వల్ల దెబ్బతిన్న రంగాలకు ఇది చాలా అవసరమని వివరించారు.

ఇదీ చదవండి:గుడ్​ న్యూస్​: ఈఎస్​ఐ, ఈపీఎఫ్​తో అదనపు ప్రయోజనాలు

ABOUT THE AUTHOR

...view details