తెలంగాణ

telangana

ఐటీ నిపుణులకు గిరాకీ- అధిక జీతాలిచ్చేందుకు కంపెనీలు సిద్ధం!

By

Published : Nov 11, 2021, 8:12 AM IST

ఐటీ రంగంలో ఉద్యోగ ప్రకటన(software developer jobs) వచ్చిన 2 నెలలకు కూడా అభ్యర్థులు దొరకడం కష్టంగా మారినట్లు ఉద్యోగాల వెబ్‌సైట్‌ 'ఇండీడ్‌' పేర్కొంది. సపోర్ట్‌ ఎస్కలేషన్‌ ఇంజినీర్‌ బిజినెస్‌ ఆబ్టెక్ట్స్‌ డెవలపర్‌, మైక్రోసాఫ్ట్‌ సర్వర్‌ ఇంజినీర్‌ అప్లికేషన్‌ సెక్యూరిటీ ఇంజినీర్‌ వంటి పోస్టులకు గిరాకీ పెరిగిందని తెలిపింది.

IT jobs
ఐటీ ఉద్యోగాలు

సపోర్ట్‌ ఎస్కలేషన్‌ ఇంజినీర్‌ బిజినెస్‌ ఆబ్టెక్ట్స్‌ డెవలపర్‌, మైక్రోసాఫ్ట్‌ సర్వర్‌ ఇంజినీర్‌ అప్లికేషన్‌ సెక్యూరిటీ ఇంజినీర్‌(software developer jobs).. ఐటీ రంగంలో(it sector jobs) ఉద్యోగ ప్రకటన వచ్చిన 2 నెలలకు కూడా అభ్యర్థులు దొరకడం కష్టంగా మారిన ఉద్యోగాల్లో ఇవి కొన్ని అని ఉద్యోగాల వెబ్‌సైట్‌ 'ఇండీడ్‌' పేర్కొంది. ఈ సంస్థ అధ్యయనం ప్రకారం..

2019 సెప్టెంబరు నుంచి 2021 సెప్టెంబరు మధ్య ఐటీ ఉద్యోగ ప్రకటనల సంఖ్య రెట్టింపైంది. 2020 సెప్టెంబరుతో పోల్చితే ప్రస్తుత సెప్టెంబరుకు 'సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు కావలెను' అనే ప్రకటనల సంఖ్య 9 శాతం పెరిగింది. 'డెవలపర్‌' ఉద్యోగాల ప్రకటనలు 7 శాతం, సీనియర్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అప్లికేషన్‌ డెవలపర్‌ ఉద్యోగాలు 5 శాతం చొప్పున పెరిగాయి.

కొన్ని ఐటీ ఉద్యోగాలకు(it sector jobs) జీతభత్యాలు బాగా పెరిగాయి. సాఫ్ట్‌వేర్‌ ఆర్కిటెక్ట్స్‌కు రూ.13 లక్షల వార్షిక వేతనం ఇచ్చేందుకు ఐటీ కంపెనీలు సిద్ధపడుతున్నాయి.

ఐటీ ఉద్యోగ ఖాళీలు అధికంగా ఉన్న నగరాల్లో బెంగుళూరు(it jobs in Bangalore) అగ్రస్థానంలో ఉంది. తదుపరి స్థానాల్లో పుణె, హైదరాబాద్‌, చెన్నై, ముంబయి ఉన్నాయి.

కొవిడ్‌ పరిణామాల వల్లే

కరోనా పరిణామాలతో ప్రజల నిత్యజీవితంలో టెక్నాలజీ వినియోగం బాగా పెరిగిందని, దానికి అనువైన ఐటీ సేవలు ఆవిష్కరించేందుకు కంపెనీలకు పెద్దఎత్తున ఐటీ నిపుణులు కావాల్సి వస్తోందని 'ఇండీడ్‌' సేల్స్‌ హెడ్‌ శశి కుమార్‌ పేర్కొన్నారు. అందుకే ఐటీ నిపుణులకు అనూహ్య గిరాకీ ఏర్పడిందని వివరించారు.

అభ్యర్థులు దొరకడంకష్టంగా ఉన్న ఐటీ ఉద్యోగాలు

  • సపోర్ట్‌ ఎస్కలేషన్‌ ఇంజినీర్‌
  • బిజినెస్‌ ఆబ్జెక్ట్స్‌ డెవలపర్‌
  • మైక్రోసాఫ్ట్‌ సర్వర్‌ ఇంజినీర్‌
  • అప్లికేషన్‌ సెక్యూరిటీ ఇంజినీర్‌
  • టెక్నాలజీ సొల్యూషన్స్‌ ప్రొఫెషనల్‌
  • డీప్‌ లెర్నింగ్‌ ఇంజినీర్‌
  • సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ ఇంటర్న్‌
  • ప్రోగ్రామర్‌ అనలిస్ట్‌
  • టెక్నికల్‌ ప్రోగ్రామ్‌ మేనేజర్‌
  • ప్రిన్సిపల్‌ ప్రోడక్ట్స్‌ మేనేజర్‌

రూ.9.7 - 13 లక్షల వార్షిక జీతభత్యాలు లభిస్తున్న ఉద్యోగాలు

  1. సాఫ్ట్‌వేర్‌ ఆర్కిటెక్ట్‌
  2. టెక్నికల్‌ లీడ్‌
  3. డేటా ఇంజినీర్‌
  4. శాప్‌ కన్సల్టెంట్‌ నీ సేల్స్‌ఫోర్స్‌ డెవలపర్‌

ABOUT THE AUTHOR

...view details