తెలంగాణ

telangana

యువతకు ఫ్రీగా స్మార్ట్‌ఫోన్స్‌, ట్యాబ్స్‌- సీఎం హామీ!

By

Published : Aug 20, 2021, 1:50 PM IST

డిజిటల్ సాధికారత పేరిట విద్యార్థులపై హామీల వర్షం కురిపించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి​. రానున్న అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా సీఎం పావులు కదుపుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Yogi Adityanath govt to give smartphones
కోటిమంది యువతకు స్మార్ట్‌ ఫోన్స్‌, ట్యాబ్స్‌

ఉత్తర్‌ప్రదేశ్‌లో మరోసారి పాగా వేసేందుకు యోగి ఆదిత్యనాథ్‌ (Yogi Adityanath) ప్రభుత్వం పావులు కదుపుతోంది. అందుకు తగ్గట్టే యువతను ఆకట్టుకునేందుకు ఉచితాల జల్లును కురింపించింది. డిజిటల్ సాధికారత పేరిట.. కోటిమంది యువతకు స్మార్ట్‌ ఫోన్స్‌, ట్యాబ్స్‌ ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చింది. అసెంబ్లీలో బుధవారం అనుబంధ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఆదిత్యనాథ్ ఈ ప్రకటన చేశారు. ఈ పథకం కోసం సుమారు రూ.3వేల కోట్లు వెచ్చించనున్నారు.

గరిష్ఠంగా మూడు పరీక్షల కోసం ఈ భత్యాన్ని అందజేయనున్నట్లు వివరించారు.

''ఈ పథకం కింద కోటి మంది విద్యార్థుల్ని ఎంపిక చేస్తాం. గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్, టెక్నికల్, డిప్లొమా కోర్సులు చదివే విద్యార్థులకు స్మార్ట్‌ ఫోన్స్, ట్యాబ్స్‌ అందించనున్నాం. అలాగే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు సన్నాహక భత్యం ఇచ్చి సహకరిస్తాం.''

- యోగి ఆదిత్యనాథ్​, ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి

గతంలో సమాజ్‌వాదీ పార్టీ కూడా ఈ తరహా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. 12వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ఇస్తామని ప్రకటించింది. 2012లో ఆ పార్టీ విజయంలో ఈ హామీ కీలక పాత్ర పోషించింది. కొద్ది నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో(UP Election 2022) యువ ఓటర్లను ఆకర్షించేందుకు యోగి ప్రకటన దోహదపడుతుందని భాజపా వర్గాలు భావిస్తున్నాయి. విపక్షాలు మాత్రం ఇది మరో తప్పుడు వాగ్దానం అంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి.

ఇవీ చూడండి:Breakthrough Infections: కలవరపెడుతున్న 'బ్రేక్‌త్రూ' ఇన్‌ఫెక్షన్‌లు!

'విధ్వంసక, తీవ్రవాద శక్తుల ఆధిపత్యం కొంతకాలమే'

ABOUT THE AUTHOR

...view details