తెలంగాణ

telangana

బలగాన్ని పెంచుకుంటున్న పులి

By

Published : Feb 14, 2021, 8:55 AM IST

దేశంలో పులుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోందని 'పులి గణన' లెక్కలు చెబుతున్నాయి. పులుల సంఖ్య ఆధారంగా ఆ దేశంలో జీవవైవిధ్యం అలరారుతోందని పర్యావరణవేత్తలు చెబుతుంటారు. ఈ లెక్కన చూస్తే దేశంలో పులుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని నివేదిక స్పష్టం చేస్తోంది. ఆయా రాష్ట్రాల వారీగా పెరిగిన పులుల సంఖ్యను మీరూ తెలుసుకోండి..

tiger reserves in india tiger census in india and gradually increasing the number of tigers
దేశంలో పెరుగుతోన్న పులుల సంఖ్య

దేశంలో పెరుగుతోన్న పులుల సంఖ్య

జాతీయ జంతువు పులి.. తన బలగాన్ని పెంచుకుంటోంది. పులుల సంఖ్య పెరగడంతో దేశంలో అత్యధిక పులులున్న రెండో రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది. ఈ జాబితాలో 526 పులులతో మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. 442 పులులతో ఉత్తరాఖండ్ తర్వాతి స్థానం దక్కించుకుంది. కావేరీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం లెక్కల ప్రకారం.. కర్ణాటకలో 524 పులులున్నాయి. వాటిలో 371 పులులు మలేనాడు ప్రాంతంలో ఉన్నాయి.

1986లోనే శాస్త్రీయంగా పులుల సర్వే నిర్వహంచేందుకు ప్రయత్నాలు జరిగాయి. కానీ సరైన సాంకేతికత అందుబాటులో లేకపోవడం వల్ల సర్వే కష్టతరంగా మారింది. 86 పులులు మాత్రమే రికార్డుల్లో నమోదయ్యాయి. వాటి సంఖ్య ప్రస్తుతం 371కి పెరిగింది. వాటిలో 37 నుంచి 42 పులులు చిక్‌మగళూరు జిల్లాలోని భద్రా సాంక్చురీలో ఉన్నాయి.

మొట్టమొదటి సారి గణన నిర్వహించినప్పుడు చిక్‌మగళూరు ప్రాంతంలో 86 పులులే ఉండేవి. ప్రస్తుతం ఆ సంఖ్య 86 నుంచి ఏకంగా 371కి పెరిగింది.

-భరత్, పర్యావరణ ప్రేమికుడు

సముద్రమట్టానికి 3000 మీ. ఎత్తులో బెంగాల్​ టైగర్!

75% మనదగ్గరే..

గతేడాది, ప్రపంచ పులుల దినోత్సవం నాడు ప్రధాని నరేంద్రమోదీ నాల్గవ పులల లెక్కింపు ఫలితాలు విడుదల చేశారు. ఈ నివేదిక ప్రకారం భారత్‌లో 2967 పులులున్నాయి. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అడవుల్లోని పులుల్లో 75% మనదేశంలోనే ఉన్నాయన్నమాట. దీన్ని బట్టి భారత్ పులులకు సురక్షితమైన ప్రాంతమని స్పష్టమవుతోంది. 2018 పులుల గణన గిన్నిస్ బుక్‌లోనూ చోటు సంపాదించింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కెమెరా ట్రాపింగ్ వైల్డ్‌లైఫ్ సర్వే అని నిర్వాహకులు చెప్తున్నారు.

లక్ష కిలోమీటర్ల సర్వే..

చిక్‌మగళూరు ప్రాంతలో పులుల సంఖ్య పెరగడానికి చాలా కారణాలే ఉన్నాయి. ప్రత్యేక సంరక్షణ, కట్టుదిట్టమైన భద్రత వ్యవస్థ, ఈ ప్రాంతంలోకి ప్రజలెవ్వరినీ అనుమతించకపోవడం ప్రధాన కారణాలు. 2018-19లో నిర్వహించిన సర్వే ప్రకారం.. 26,833 చోట్ల కెమెరా ట్రాపింగ్ ఏర్పాట్లు చేశారు. ఈ కెమెరాల్లోని కదిలే సెన్సర్లు.. పులుల కదలికలను అత్యుత్తమంగా చిత్రీకరిస్తాయి. అలా లక్షా 21 వేల 337 కిలోమీటర్లలో ఈ సర్వే నిర్వహించారు.

'అన్ని శాఖల సాయంతో పులులను సంరక్షించుకుందాం'

15 పులులను దత్తత తీసుకున్న ఎస్బీఐ

చిక్‌మగళూరు జిల్లాలో పులుల సంఖ్య ఏటికేడూ పెరుగుతూ వస్తోంది. పులులపై అత్యంత శ్రద్ధ చూపడం, ఈ ప్రాంతంలోకి మనుషులెవరినీ అనుమతించకపోవడమే ఇందుకు ప్రధాన కారణం.

-మధుసూదన్, వన్యప్రాణి సంరక్షణ సంస్థ అధిపతి

క్రమంగా పెరుగుదల..

2006 లెక్కల ప్రకారం.. దాదాపు 1411 పులులుండేవి దేశంలో. 2010లో ఆ సంఖ్య 1706కు 2014 సంవత్సరానికి 2226కు పెరిగింది. 2006 నుంచి దేశంలో నాలుగేళ్లకోసారి పులుల సంఖ్య లెక్కించే ప్రక్రియ కొనసాగుతోంది. జాతీయ పులుల సంరక్షణ విభాగం.. ఇండియన్ వైల్డ్‌లైఫ్ ఆర్గనైజేషన్‌ సహా, కొన్ని స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఈ లెక్కింపు చేపడుతుంది.

పట్టణీకరణ, అడవుల నరికివేత, ఆక్రమణల వల్ల భారత్‌లో 2012-19 మధ్యకాలంలో 750 పులులు మరణించాయి. సమాచార హక్కు నివేదిక ప్రకారం.. మధ్యప్రదేశ్‌లో 173, మహారాష్ట్రలో 125, కర్ణాటకలో 111 పులులు చనిపోయాయి.

ఇవీ చూడండి:భారత​ 'పులుల గణన'కు​ గిన్నిస్ రికార్డ్​లో చోటు

ఆ దేశాలకు భారత్​ నాయకత్వం!

ఆంధ్రప్రదేశ్​లో పులులు తిరిగే ప్రాంతం పెరిగింది

ABOUT THE AUTHOR

...view details