తెలంగాణ

telangana

Pawan Counter to CM Jagan: జగన్​పై పవన్​ వ్యంగ్యాస్త్రాలు.. "పాపం పసివాడు" సినిమా పోస్టర్​తో..!

By

Published : May 17, 2023, 10:07 AM IST

Updated : May 17, 2023, 1:30 PM IST

Janasena Chief Pawan Counter to CM Jagan: బాపట్ల జిల్లా పర్యటనలో సీఎం జగన్​ చేసిన వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ ట్విట్టర్​ వేదికగా స్పందించారు. మన సీఎంతో ఎవరైనా పాపం పసివాడు సినిమా తీస్తారని ఆశిస్తున్నట్లు పవన్​ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇంకా ఏమన్నారంటే..

Pawan Counter to CM Jagan
Pawan Counter to CM Jagan

Janasena Chief Pawan Counter to CM Jagan: సీఎం జగన్ మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్​ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘పాపం పసివాడు’’ సినిమా పేరును ప్రస్తావిస్తూ జగన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న బాపట్ల జిల్లా నిజాంపట్నంలో వైఎస్సార్​ మత్స్యకార భరోసా నిధులు విడుదల కార్యక్రమంలో పవన్ కల్యాణ్‌‌, చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని సీఎం జగన్​ పలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎం వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ జనసేనాని వ్యంగంగా ట్వీట్ చేశారు. జగన్​పై ‘‘పాపం పసివాడు’’ టైటిల్​తో సినిమా తీయాలంటూ పవన్ కల్యాణ్ చురకలంటించారు.

ఇంతకీ పవన్ ఏమన్నారంటే.. "మన ఏపీ సీఎంతో ఎవరైనా ఈ సినిమా(పాపం పసివాడు) తీస్తారని ఆశిస్తున్నాను. అతను చాలా అమాయకుడు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న మార్పు మాత్రమే అవసరం ఉంది. అతని చేతిలో 'సూట్‌కేస్'కి బదులుగా, అతను అక్రమంగా సంపాదించిన సంపద కోసం మనీలాండరింగ్‌ను సులభతరం చేసే ఎక్కువ 'సూట్‌కేస్ కంపెనీలను' ఉంచండి. ప్రియమైన ఏపీ సీఎం.. మీరు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య లేదా కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి కాదు. మీ అక్రమ సంపాదనతో, ప్రజలపై మీరు సాగిస్తున్న హింసతో ‘వర్గ యుద్ధం’ అనే పదాన్ని ఉచ్చరించే హక్కు కూడా మీకు లేదు. మీ నుంచి, మీ గుంపు బారి నుంచి ఏదో ఒక రోజు ‘రాయలసీమ’ విముక్తి పొందుతుందని ఆశిస్తున్నాను. పాపం పసివాడు సినిమా కథనానికి రాజస్థాన్ ఎడారి ఇసుక దిబ్బలు కావాలి, కానీ APలోని నదీ తీరాల నుంచి ఇసుకను వైసీపీ దోచుకుంది, కలెక్షన్ పాయింట్లలో తగినంత ఇసుక దిబ్బలు ఉన్నాయి. చీర్స్!!.." అంటూ పవన్​ ట్విట్టర్​ వేదికగా విమర్శించారు.

చంద్రబాబు, పవన్​పై జగన్​ చేసిన వ్యాఖ్యలు: "నేను ప్రజల్ని, దేవుడ్ని, చేసిన మంచిని నమ్ముకుంటే.. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ మాత్రం పొత్తుల్ని నమ్ముకున్నారు. వీరిద్దరికీ విడిగా 175 స్థానాల్లో పోటీ చేసే సత్తా కూడా లేదు. అందుకే ఎన్నికల కోసం మళ్లీ కలుస్తున్నారు. రాష్ట్రాన్ని దోచుకోవటం, పంచుకోవడమే చంద్రబాబు, పవన్‌ ఎజెండా. చంద్రబాబు కాల్‌ షీట్లు దొరికినప్పుడు, సినిమాల మధ్య విరామం దొరికినప్పుడు ప్రభుత్వం మీద బురద జల్లడమే పవన్‌ పని. ఒక్కో ఎన్నికలకు ఒక్కో రేటుకు పవన్ కల్యాణ్.. పార్టీని అమ్ముకుంటారు. చంద్రబాబు రాసిన స్క్రిప్టు చదవడమే పవన్​కు తెలుసు. చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీల కోసం పవన్​ ఏమైనా చేస్తాడు" అని సీఎం జగన్​ వ్యాఖ్యానించారు.

ఇవీ చదవండి:

Last Updated :May 17, 2023, 1:30 PM IST

ABOUT THE AUTHOR

...view details