తెలంగాణ

telangana

సార్వత్రిక ఎన్నికలకు జోరందుకున్న పార్టీల ప్రచారం - వాడవాడలకు వెళ్తున్న అభ్యర్థులు - Election Campaign In Telangana

By ETV Bharat Telangana Team

Published : Apr 21, 2024, 8:06 PM IST

Election Campaign In Telangana : రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం జోరందుకుంది. పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతూ ఓట్లేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. తమని గెలిపిస్తే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని హామీలు గుప్పిస్తున్నారు.

Election Campaign In Telangana
Election Campaign In Telangana

సార్వత్రిక ఎన్నికలకు జోరందుకున్న పార్టీల ప్రచారం- వాడవాడలకు వెళ్తున్న అభ్యర్థులు

Lok Sabha Election Campaign In Telangana 2024 :రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. అన్ని ప్రధాన పార్టీలు తమ ప్రచార కార్యక్రమాల్లో స్పీడు పెంచాయి. విమర్శలకు ప్రతివిమర్శలు సంధిస్తూ ముందుకు పోతున్నాయి. రాష్ట్రంలో త్రిముఖపోటీ నెలకొంది.

Congress Candidates Election Campaign : కాంగ్రెస్ శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంఛార్జీ జగదీశ్వర్ గౌడ్ నిర్వహించిన ద్విచక్రవాహన ర్యాలీలో ఆ పార్టీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డి పాల్గొన్నారు. ఆల్విన్‌కాలనీ శ్రీ వీరాంజనేయ శివాలయంలో పూజలు చేసి ఎల్లమ్మబండ, ఆల్విన్ కాలనీ, హైదర్‌నగర్ మీదుగా ర్యాలీ నిర్వహించారు.

నిజామాబాద్ పాత కలెక్టర్ మైదానంలో సోమవారం నిర్వహించే బహిరంగసభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గోనున్నట్లుగా కాంగ్రెస్నిజామాబాద్​ ఎంపీ అభ్యర్థి జీవన్​ రెడ్డి వెల్లడించారు. నామినేషన్ ప్రక్రియకు సీఎం హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను లోక్​సభ ఎన్నికల్లో గెలిపించాలని మంత్రి శ్రీధర్‌బాబు పిలుపునిచ్చారు. రామగుండంలో జరిగిన సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

BRS Candidates Election Campaign :మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో తిలక్ క్రీడా మైదానంలో బీఆర్ఎస్​ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ మాజీ ఎమ్మెల్యే దుర్గంచిన్నయ్యతో కలిసి ప్రచారం చేశారు. వారు క్రీడాకారులతో కలిసి క్రికెట్ ఆడారు. కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్​ను గెలిపించాలని అభ్యర్థించారు. ఖమ్మం పార్లమెంట్ పరిధి కారేపల్లి మండలంలో బీఆర్ఎస్ ముఖ్యనాయకుల, కార్యకర్తల సమావేశానికి ఆ పార్టీ ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర హాజరయ్యారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని ప్రజల హక్కులను కాపాడేలా పార్లమెంటులో ప్రశ్నించే గొంతుక ఉండేలా బీఆర్ఎస్​ను గెలిపించాలని కోరారు.

రాష్ట్రంలో లోక్​సభ ఎన్నికల హీట్ - జోరందుకున్న పార్టీల ప్రచారాలు - Lok Sabha Polls 2024

BJP Candidates Election Campaign : చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి శేర్లింగంపల్లిలోని బొటానికల్ గార్డెన్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉదయపు నడకకు వచ్చిన వారితో కలిసి ముచ్చటించారు. స్థానిక యువకులతో కలిసి విన్యాసాలు చేశారు.‌ కరాటే నేర్చుకుంటున్న చిన్నారులతో కలిసి ఆటలాడారు. బొటానికల్ గార్డెన్‌లోని కార్మికులతో ముచ్చటించిన ఆయన ధర్మ పరిరక్షణ కోసం మోదీని మరోసారి ప్రధాని చేయాలని కోరారు.

Bandi Sanjay On Congress :కరీంనగర్‌లో పోటీకి కాంగ్రెస్‌కు అభ్యర్థులే కరవయ్యారనిబీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. కరీంనగర్ లోక్‌సభ స్థానానికి ఐదేళ్లలో రూ.12 వేల కోట్ల నిధులు తెచ్చామని స్పష్టంచేశారు. బీఆర్ఎస్ మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం సైతం రైతులను మోసం చేస్తోందని సిరిసిల్ల బీజేపీ ఎన్నికల ప్రచారసభలో మండిపడ్డారు. ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్న అభ్యర్థులు తమకే ఓటువేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

"ఆరు గ్యారంటీల హామీలు నమ్మి కాంగ్రెస్​కు ఓటు వేసిన మీరందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు ఇచ్చారా? మీ పిల్లల ఉద్యోగాల కోసం కొట్లాడింది మేము మీరు ఓట్లు మాత్రం కాంగ్రెస్​కు వేస్తారు. రేషన్​ బియ్యం, పంచాయితీలకు నిధులను మోదీ ప్రభుత్వం ఇస్తుంది. పథకాలు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం మీరు ఓట్లేమో హస్తం పార్టీకి వేస్తుంటారు" - బండి. సంజయ్, బీజేపీ ఎంపీ అభ్యర్థి

ప్రచారాన్ని హోరెత్తిస్తున్న ప్రధాన పార్టీలు - విమర్శలే అస్త్రంగా అభ్యర్థులపై గురి - Election Campaign in Telangana

సార్వత్రిక ఎన్నికలకు జోరందుకున్న పార్టీల ప్రచారం - వాడవాడలకు వెళ్తున్న అన్ని పార్టీల అభ్యర్థులు - MP Candidates Election Campaign

ABOUT THE AUTHOR

...view details