తెలంగాణ

telangana

అయోధ్యలో పవన్​ భావోద్వేగం - చిరు, చరణ్​ ఏం అన్నారంటే?

By ETV Bharat Telugu Team

Published : Jan 22, 2024, 5:59 PM IST

Ayodhya Ram Mandir Pran Pratishtha : అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం వేడుకగా జరిగింది. ఈ వేడుకలో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి, రామ్​చరణ్​, పవన్​ కల్యాణ్ - ఈ మహత్తర ఘట్టాన్ని వీక్షించడం గొప్ప వరంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంకా ఏమన్నారంటే?

Etv Bharat
Etv Bharat

Ayodhya Ram Mandir Pran Pratishtha : అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం వేడుకగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ బాల రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్​ చిరంజీవి ఫ్యామిలీ కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. చిరు భార్య సురేఖ, కొడుకు రామ్ చరణ్​తో పాటు పవర్​ స్టార్​ పవన్​ కల్యాణ్​ కూడా పాల్గొన్నారు. వీరంతా ప్రత్యేక విమానంలో అయోధ్యకు వెళ్లారు. మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ - "ఇది అద్భుతమైన అనుభూతి. ఈరోజు దేశప్రజలందరికీ సంతోషకరమైన రోజు" అని అన్నారు.

Ayodhya Ramcharan : అయోధ్య రామమందిరం అద్భుతం. జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే గొప్ప అవకాశం. ఈ మహత్తర ఘట్టాన్ని కనులారా వీక్షించడం ప్రతి ఒక్కరికీ గౌరవం అని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అన్నారు. ఆయన మాట్లాడుతూ - "రాముడి దీవెనల కోసం ఇక్కడి వచ్చాను. అద్భుతం. ఎంతో అందమైన అనుభూతి ఇది. జీవితంలో ఒక్కసారి మాత్రమే లభించే గొప్ప అపూర్వ ఘట్టమిది. ఇలాంటి అద్భుతమైన ఘటాన్ని చూడటం ప్రతిఒక్కరికి గొప్ప గౌరవం లాంటిది. భారత దేశంలో పుట్టి ఇలాంటి గొప్ప సంఘటనకు సాక్షిగా నిలవడాన్ని నాకు లభించిన గొప్ప వరంగా భావిస్తg" అని రామ్​చరణ్ అన్నారు. అంతకుముందు జాతీయ మీడియాతో చరణ్​ మాట్లాతుడూ - 500 ఏళ్ల క్రితం చరిత్రలో ఏం జరిగిందో ఇప్పుడు మన ముందు సాక్షంగా నిలబడింది. 500 ఏళ్ల రాముడి వనవాసం ముగిసి అయోధ్యకు వచ్చారు అని అన్నారు.

Ayodhya Pawankalyan పవన్ కల్యాణ్ మాట్లాడుతూ - "నా జీవితంలో చాలా భావోద్వేగమైన రోజు. ప్రాణ ప్రతిష్ట జరిగే సమయంలో నా కళ్లలో నుంచి కన్నీళ్లు వచ్చాయి. దీంతో నేను మరింత ఎమోషనల్‌గా అయ్యాను. ఏన్నో తరాల ప్రజలు పడిన వేదన ఇది. చివరకు వారి ఆకాంక్ష, కోరిక సాకారమైంది. ఈ బాల రాముడి ప్రాణ ప్రతిష్ట భారత దేశాన్ని ఐక్యం చేస్తుందని నమ్ముతున్నాను. దేశాన్ని ఏకం చేస్తుందని భావిస్తున్నాను. దక్షిణాదిలో తిరుపతి తిరుమల పుణ్య క్షేత్రాన్ని పవిత్రంగా భావిస్తాం. అలాగే అయోధ్యలో కూడా రామ మందిరాన్ని అంతే పవిత్రంగా భావిస్తాం. ఇక ముందు దక్షిణాది ప్రజలు అయోధ్యను దర్శించుకుంటారు. అని అన్నారు.

టాలీవుడ్​ టాప్​-10 హీరోస్​ - నాలుగు స్థానాలు మెగా ఫ్యామిలీవే

రామాయణంపై మరో పాన్ ఇండియా మూవీ - ఈసారి ఎవరికీ తెలియని కథతో

ABOUT THE AUTHOR

...view details