తెలంగాణ

telangana

ఈజీగా మీ క్రెడిట్​ స్కోర్​ను పెంచుకోవాలా? అయితే ఈ సింపుల్ టిప్స్​ను​ ఫాలో అవ్వండి! - credit score increase tips

By ETV Bharat Telugu Team

Published : Apr 11, 2024, 11:14 AM IST

How To Increase Credit Score : మీరు క్రెడిట్​ కార్డ్ వాడతున్నారా? మంచి క్రెడిట్ స్కోర్​ను ఎలా పెంచుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే ఇది మీ కోసమే. ఈ ఆర్టికల్​లో మీ క్రెడిట్/ సిబిల్​ స్కోర్​ పెంచుకోవడానికి పాటించాల్సిన కొన్ని టిప్స్ గురించి తెలుసుకుందాం.

Credit Score Increase Tips
Credit Score Increase Tips

How To Increase Credit Score : సిబిల్​ స్కోర్​ లేదా క్రెడిట్ స్కోర్​ ఎంత ఎక్కువగా ఉంటే అంత సులభంగా రుణాలు మంజూరు అవుతాయి. అలాగే వడ్డీరేటు కూడా దీని ఆధారంగానే విధిస్తాయి బ్యాంకులు. అయితే సకాలంలో చెల్లింపులు అనేది మీ క్రెడిట్​ స్కోర్​ను ప్రభావితం చేస్తుంది. క్రెడిట్​ కార్డు బిల్లును సకాలంలో చెల్లిస్తే సిబిల్​ స్కోర్​పై ప్రభావం ఉండదు. సాధారణంగా సిబిల్​ స్కోర్​ 650 నుంచి 900 మధ్య ఉంటుంది. సగటున 750కిపైన ఈ స్కోర్​ ఉంటే లోన్స్​​ తొందరగా లభిస్తాయి. మంచి క్రెడిట్​ స్కోర్ కోసం క్రెడిట్​ కార్డుల సంఖ్య ఎంత ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈమధ్య కాలంలో లోన్స్​ తీసుకునేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. బ్యాంకర్లు కూడా ఎక్కువగా నిబంధనలు పెట్టుకుండానే లోన్స్​ మంజూరు చేయడం వల్ల అందరూ వీటిని సద్వినియోగం చేసుకుంటున్నారు. పెట్టుబడిదారుడి ఆర్థిక అలవాట్లు, బాధ్యతలు, క్రెడిట్​ మెయింటెనెన్స్‌ ఆధారంగా ఇది మారే అవకాశం ఉంటుంది.

సాధారణంగా క్రెడిట్​ కార్డులతో సహా పలు రకాల క్రెడిట్​ అకౌంట్స్​ ద్వారా లోన్లు తీసుకుంటే వాటిని సకాలంలో చెల్లించినట్లయితే క్రెడిట్​ స్కోర్​పై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపకుండా ఉంటుంది. అయితే చాలామంది ఒకేసారి రెండు లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్​ కార్డులను తీసుకుంటారు. ఇలా చేస్తే మీ ఖాతాపై ప్రభావం చూపుతుంది. అంతేకాదు చెల్లింపులను కోల్పోయే ప్రమాదం కూడా ఉంది.

ఉదాహారణకు ఒక వ్యక్తి జనవరి 2024లో రూ.10లక్షలతో క్రెడిట్​ కార్డు తీసుకున్నాడు. కొన్ని నెలలపాటు మరో క్రెడిట్​ కార్డును ఉపయోగించలేదు. ఈ కార్డును వాడిన తర్వాత దాని గరిష్ట పరిమితిని పెంచుకునేందుకు మరోసారి బ్యాంకుకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే క్రెడిట్​ కార్డు స్కోర్​ పెంచుకునేందుకు పెట్టుబడిదారులు తప్పనిసరిగా కొన్ని విషయాలను పరిగణలోనికి తీసుకోవాలి.

పేమెంట్ హిస్టరీ
క్రెడిట్ కార్డుపై రుణాలు సకాలంలో చెల్లించడం అనేది మీ క్రెడిట్​ స్కోర్​ను ప్రభావితం చేసే కీలకమైన అంశాల్లో ఒకటి. మీరు క్రెడిట్​ కార్డును బాధ్యతాయుతంగా సకాలంలో చెల్లిస్తే అది మీ పేమెంట్ హిస్టరీపై సానుకూలంగా ఉంటుంది.

క్రెడిట్​ యుటిలైజేషన్​
ఇది మీ క్రెడిట్​ కార్డ్​ బ్యాలెన్స్‌ల నిష్పత్తి, మీ క్రెడిట్​ లిమిట్స్​ను సూచిస్తుంది. మంచి క్రెడిట్​ స్కోర్‌ను మెయింటెన్​ చేయడానికి మీ క్రెడిట్​ వినియోగాన్ని తక్కువగా (అంటే 30% కంటే తక్కువ) ఉంచడం ముఖ్యం. ఎక్కువ క్రెడిట్​ కార్డ్‌లను ఉపయోగించడం వల్ల మీ బ్యాలెన్స్​ తక్కువగా వినియోగించడంలో సహాయపడుతుంది.

ఆర్థిక బాధ్యత
మీరు క్రెడిట్ కార్డును బాధ్యతాయుతంగా నిర్వహిస్తే..అది మీ సిబిల్ స్కోర్ పై ప్రతికూల ప్రభావం చూపదు. మీరు అధికంగా ఖర్చు పేమెంట్స్ ను కోల్పోయే అవకాశం ఉంటుంది. మీరు క్రెడిట్ స్కోర్ పెంచుకోవాలంటే తక్కువగా ఖర్చు చేయడం అలవాటు చేసుకోవడం బెటర్ .

క్రెడిట్​ మిక్స్​
రుణదాతలు క్రెడిట్​ కార్డ్‌లు, ఇన్‌స్టాల్‌మెంట్​ లోన్‌లు, మార్ట్‌గేజ్‌లతో సహా పలు క్రెడిట్​ కార్డులను వాడుతుంటారు. ఇతర రకాల క్రెడిట్‌లతో పాటుగా రెండు క్రెడిట్​​ కార్డ్‌లను కలిగి ఉండటం మంచిది. క్రెడిట్​ కార్డ్‌ల సంఖ్యతో సంబంధం లేకుండా మంచి క్రెడిట్​ స్కోర్‌ను నిర్వహించడంలో కీలకమైందిగా భావిస్తారు.

మీ బిల్లులను సకాలంలో చెల్లించడం, మీ క్రెడిట్​ కార్డ్​ బ్యాలెన్స్‌లను తక్కువగా ఉంచడం, అవసరమైనప్పుడు మాత్రమే కొత్త ఖాతాలను తెరవడం వంటివి ఇందులో ఉంటాయి. మీ ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా, మీ క్రెడిట్​ లక్ష్యాలను సాధించడంలో మీకు సహాయపడే బ్యాలెన్స్‌ను గుర్తించడం చాలా అవసరం.

గమనిక :క్రెడిట్​ కార్డుకు సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవాలంటే క్రెడిట్​ కౌన్సెలర్​ను సంప్రదించడం ఉత్తమం.

ఫ్రీగా క్రెడిట్ స్కోర్ తెలుసుకోవాలా? ఈ సింపుల్ స్టెప్స్​ ఫాలో అవ్వండి!

సిక్స్ డేంజర్ డిజిట్స్- OTP విషయంలో ఈ జాగ్రత్తలు మస్ట్ - safety tips for otp detection

ABOUT THE AUTHOR

...view details