TS Transco Genco CMD Comments on IAS Officers : 'కేసీఆర్​ చెప్పినా నిధులు విడుదల చేయడం లేదు..' జెన్​కో సీఎండీ హాట్​కామెంట్స్​

By ETV Bharat Telangana Team

Published : Oct 16, 2023, 5:48 PM IST

thumbnail

TS Transco CMD Prabhakar Rao Comments on IAS Officers : తెలంగాణ విద్యుత్ సంస్థలకు వస్తున్న ఆదరణ చూసి.. కొంతమంది ఐఎఎస్ అధికారులు ఓర్వలేక పోతున్నారని ట్రాన్స్ కో- జెన్​కో సీఎండీ ప్రభాకర్​రావు ఆందోళన వ్యక్తం చేశారు. కొంతమంది ఐఏఎస్ అధికారులు.. సంస్థ ప్రగతిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇవాళ మింట్ కాంపౌండ్​లోని విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేన్ ఆఫ్ తెలంగాణ ప్రారంభోత్సవం సందర్బంగా.. సీఎండీ ప్రభాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. 

TS Transco Genco CMD Prabhakar Rao : ముఖ్యమంత్రి కేసీఆర్​ చెప్పినా.. ఐఏఎస్​ అధికారులు విద్యుత్ సంస్థలకు నిధులు విడుదల చేయడం లేదన్నారు. ఈ విధానం ఇలాగే కొనసాగితే విద్యుత్ సరఫరాలో లోపం ఏర్పడే అవకాశాలున్నాయన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వంలోని కొంత మంది అధికారులు సంస్థ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలని చేతులు జోడించి వేడుకున్నారు. ఇదే విషయంలో ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నాలు చేసినా ఫలించడం లేదన్నారు. ఈ విషయం చెప్పిన తర్వాత ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్, ట్రాన్స్​కో- జెన్​కో సీఎండీలైన తమను పదవుల నుంచి తొలగించే కుట్ర కూడా జరగొచ్చన్నారు. అయినా సరే తమకు ఎలాంటి ఇబ్బంది లేదని.. తమను ఈ ఐఏఎస్ అధికారులు ఎవరూ ఉద్యోగంలోకి తీసుకోలేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ తమ పనితనం చూసి ఉద్యోగాలు ఇచ్చారన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.