ఒక చేత్తో బీర్ బాటిల్​, మరో చేత్తో సిగరెట్ పట్టుకొని యువతి హల్​చల్​ - వీడియో వైరల్ - Young Woman Beer Bottle Video Viral

By ETV Bharat Telangana Team

Published : May 24, 2024, 7:58 PM IST

thumbnail
ఒక చేత్తో బీర్ బాటిల్​, మరో చేత్తో సిగరెటు పట్టుకొని యువతి హల్​చల్​ - వీడియో వైరల్ (ETV Bharat)

Young Woman Beer Bottle Video Viral : పట్టపగలు ఓ యువతి రోడ్డుపై ఓ చేత్తో బీర్​ బాటిల్​, మరో చేత్తో సిగరెట్​ పట్టుకుని హల్​ చల్​ చేసింది. ఇది చూసి అక్కడకు వాకింగ్​కు వచ్చిన వారు అవాక్కు అయ్యారు. ఈ సంఘటన హైదరాబాద్​లోని నాగోల్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ఫతుల్లగూడ సమీపంలో గురువారం జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్​గా మారింది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గురువారం ఉదయం ఆరు గంటలకు నాగోల్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ఫతుల్ల గూడ సమీపంలో యువతీ యువకుడు బీర్లు తాగుతూ హల్​చల్​ చేశారు. అక్కడికి వాకింగ్​కు వెళ్తున్న వారు నిలదీయడంతో వారితో వాగ్వాదానికి దిగారు. బూతులు తిడుతూ ఆ యువతీ యువకుడు ఒక చేత్తో బీరు బాటిల్​, మరో చేతిలో సిగరెట్​ పట్టుకొని కారులో పాటలు పెట్టి నానా హంగామా చేశారు. ఆ తంతంగాన్ని మొత్తాన్ని వీడియో తీస్తున్న వ్యక్తిని యువతి అసత్య పదజాలంతో తిడుతూ దాడి చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్​ మీడియాలో బాగా వైరల్​గా మారింది.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.