బీజేపీ ఎప్పటికైనా ప్రమాదకర పార్టీనే - తస్మాత్​ జాగ్రత్త : కూనంనేని సాంబశివరావు - Kunamneni Comments On BJP Leaders

By ETV Bharat Telangana Team

Published : May 24, 2024, 10:18 PM IST

thumbnail
పదేళ్లుగా బీజేపీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు: కూనంనేని సాంబశివరావు (ETV Bharat)

Kunamneni Comments On BJP Leaders : బీజేపీ నేతలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సాక్షాత్తు జగన్నాథుడే మోదీ భక్తుడు అనడం బీజేపీ నేతల అహంకారానికి పరాకాష్ఠ అని కూనంనేని విమర్శించారు. ప్రస్తుతం విడుదల చేసింది బీజేపీ మ్యానిఫెస్టో కాదని అది మోదీ మ్యానిఫెస్టో, మోదీ గ్యారంటీ అని ఆయన విమర్శించారు. తెలుగు రాష్ట్రాలకు, దేశానికి ఈ పదేళ్లలో చేసిందేమీ లేదని, అసెంబ్లీ ఎన్నికల ముందు ఇస్తామని చెప్పిన పసుపు బోర్డును విస్మరించారని ఆయన అన్నారు. 

2025 నాటికి ప్రతి ఒక్కరికీ సొంతిళ్లు హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. అసలు విషయాలు మాట్లాడకుండా ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తామని రాజ్యాంగ విరుద్ధ పనులకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసిందని  అందుకే  బకాయిలు పేరుకుపోయాయని అన్నారు. అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వాలని కూనంనేటి సాంబశివరావు డిమాండ్ చేశారు. బీజేపీ ఎప్పటికైనా ప్రమాదకర పార్టీ అని దానిని అందరం ఎదుర్కోవాల్సిన అవసరముందన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.