ETV Bharat / bharat

ఆరో విడత పోలింగ్- సాయంత్రం 5గంటల వరకు 57.70శాతం పోలింగ్‌ - Lok Sabha Elections 2024

author img

By ETV Bharat Telugu Team

Published : May 25, 2024, 6:35 AM IST

Updated : May 25, 2024, 12:02 PM IST

Lok Sabha Elections 2024 phase 6 Live Updates : సార్వత్రిక సమరం ఆరో విడత పోలింగ్‌ ప్రారంభమైంది. ఈ విడతలో 6 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని 58 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది.

Lok Sabha Elections 2024 phase 6 Live Updates
Lok Sabha Elections 2024 phase 6 Live Updates (ETV Bharat)

05:50 PM

  • ఆరో విడతలో సాయంత్రం 5 గంటల వరకు 57.70 శాతం పోలింగ్‌
  • బిహార్‌ 52.24 శాతం
  • హరియాణా 55.93 శాతం
  • జమ్ముకశ్మీర్‌ 51.35 శాతం
  • ఝార్ఖండ్‌ 61.41 శాతం
  • దిల్లీ 53.73 శాతం
  • ఒడిశా 59.60 శాతం
  • ఉత్తర్‌ప్రదేశ్‌ 52.02 శాతం
  • బంగాల్‌ 77.99 శాతం

05:03 PM

ఓటేసిన CJI
ఆరోవిడత లోక్​సభ ఎన్నికల్లో భాగంగా భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ డీవై చంద్రచూడ్​ తన కుటంబంతో కలిసి దిల్లీలో ఓటు వేశారు. ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా ఒక దేశ పౌరుడిగా తన బాధ్యతను నిర్వర్తించానని తెలిపారు.

02:00 PM

  • ఆరో విడతలో మధ్యాహ్నం ఒంటిగంట వరకు 39.13 శాతం పోలింగ్‌
  • బిహార్‌ 36.48శాతం
  • హరియాణా 36.48శాతం
  • జమ్ముకశ్మీర్‌ 35.22శాతం
  • ఝార్ఖండ్‌ 42.54శాతం
  • దిల్లీ 34.37శాతం
  • ఒడిశా 35.69శాతం
  • ఉత్తర్‌ప్రదేశ్‌ 37.23శాతం
  • బంగాల్‌ 54.80శాతం
  • 11:40 AM

కొనసాగుతున్న సార్వత్రిక ఎన్నికల ఆరో విడత పోలింగ్‌

  • 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 స్థానాలకు పోలింగ్‌
  • ఉదయం 11 గం.కు వరకు 25.76 శాతం పోలింగ్‌
  • బిహార్‌ 23.67
  • హరియాణా 22.09
  • జమ్ముకశ్మీర్‌ 23.11
  • ఝార్ఖండ్‌ 27.80
  • దిల్లీ 21.69
  • ఒడిశా 21.30
  • ఉత్తర్‌ప్రదేశ్‌ 27.06
  • బంగాల్ 36.88
  • 11:31 AM

దిల్లీలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, మాజీ రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్, మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ ఓటు వేశారు. తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ ఝార్ఖండ్​ రాంచీలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

9: 50 AM

ఆరో విడతలో ఉదయం 9 గం. వరకు 10.82 శాతం పోలింగ్‌

  • బిహార్‌ 9.66 శాతం
  • హరియాణా 8.31 శాతం
  • జమ్ముకశ్మీర్‌ 8.89 శాతం
  • ఝార్ఖండ్‌ 11.74 శాతం
  • దిల్లీ 8.94 శాతం
  • ఒడిశా 7.43 శాతం
  • ఉత్తర్‌ప్రదేశ్‌ 12.33 శాతం
  • బంగాల్‌ 16.54 శాతం

9: 15 AM

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. న్యూ దిల్లీలోని పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేశారు. ఉపరాష్ట్రపతి జగదీప్​ ధన్​ఖడ్​ సైతం ఆయన భార్యతో వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్​ నేత సోనియా గాంధీ తన ఓటును వేశారు.

  • 8:57 AM

కేంద్ర విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్,రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ నారాయణ సింగ్‌, ఆప్​ నేత, దిల్లీ మంత్రి ఆతిశీ, టీమ్‌ ఇండియా మాజీ స్టార్‌ క్రికెటర్​ గౌతమ్‌ గంభీర్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

7:25 AM

ఆరో దశ లోక్​సభ ఎన్నికల్లో ఓటర్లు తమ హక్కును వినియోగించుకోవడానికి పెద్ద సంఖ్యలో రావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. ఎన్నికల్లో ప్రజలు చురుకుగా పాల్గొన్నప్పుడే ప్రజాస్వామ్యం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ ప్రజాస్వామ్య పండుగలో మహిళ ఓటర్లు, యువత ఉత్సహంగా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు హరియాణా సీఎం నాయబ్‌ సింగ్‌ సైనీ, మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ అభ్యర్థి మనోహర్​లాల్ ఖట్టర్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

  • 7:00 AM

పోలింగ్ ప్రారంభం
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆరో విడత పోలింగ్‌ ప్రారంభమైంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరుగుతోంది. మొత్తం 889మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 11.13 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

Lok Sabha Elections 2024 phase 6 Live Updates : కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ దేశంలో మరో దశ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. సార్వత్రిక ఎన్నికల ఆరో విడతలో భాగంగా ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 నియోజకవర్గాలకు మరికాసేపట్లో ప్రారంభం కానుంది. వీటిలో మొత్తంగా 889 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ విడతలోనే హరియాణాలో ఉన్న మొత్తం 10 స్థానాలకు, దిల్లీలో ఉన్న మొత్తం 7 సీట్లకూ ఎన్నిక జరగనుంది. జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్-రాజౌరీ లోక్‌సభ స్థానానికి ఈ విడతలోనే ఎన్నిక జరగనుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో 14, బిహార్ 8, బంగాల్ 8, ఒడిశా 6, ఝార్ఖండ్ 4 స్థానాలకు పోలింగ్ జరగనుంది.

హస్తినలో హోరాహోరీ
దిల్లీలో మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. అన్నింటా బీజేపీ, విపక్ష ఇండియా కూటమి అభ్యర్థుల మధ్యే పోరు నెలకొంది. పొత్తులో భాగంగా ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) 4, కాంగ్రెస్‌ 3 సీట్లలో అభ్యర్థులను బరిలో నిలిపాయి. బీజేపీ అభ్యర్థులకు వారు గట్టి సవాలు విసురుతున్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో శనివారం రాష్ట్రపతి అంగరక్షక దళం ఛేంజ్‌ ఆఫ్‌ గార్డ్‌ కార్యక్రమాన్ని నిర్వహించడం లేదని రాష్ట్రపతి భవన్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది. హరియాణాలో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీల మధ్య ముఖాముఖి పోరు నెలకొంది. బంగాల్​లో ఐదు జిల్లాల్లో విస్తరించి ఉన్న జంగల్‌ మహల్‌ ప్రాంతంలోని 8 స్థానాలకు ఆరో విడతలో ఓటింగ్‌ జరగనుంది.

జమ్ముకశ్మీర్‌లో బహుళ అంచెల భద్రత
జమ్ముకశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజనతో కొత్తగా ఏర్పాటైన అనంతనాగ్‌-రాజౌరీ స్థానంలో పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ సహా మొత్తం 20 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అక్కడ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి ఈసీ బహుళ అంచెల భద్రతా ఏర్పాట్లుచేసింది. మరోవైపు ఒడిశాలో 42 అసెంబ్లీ స్థానాలకు కూడా శనివారం పోలింగ్‌ జరగుతుంది.

Last Updated : May 25, 2024, 12:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.