కేసీఆర్ బర్త్ డే స్పెషల్.. పక్షులను వదిలిన సీఎం

By

Published : Feb 18, 2023, 12:44 PM IST

thumbnail

CM KCR frees the birds from cage: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తన పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం రోజున ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలోని పంజరంలో ఉన్న పక్షులను వదిలిపెట్టారు. పక్షుల పట్ల తాతయ్య ప్రేమ, ఆదరణ అద్భుతమని కేసీఆర్ మనవడు హిమాన్షు ట్విటర్‌లో పేర్కొన్నారు. తనకు అత్యంత ప్రియ మిత్రుడు, స్ఫూర్తిప్రదాత అని ట్వీట్ చేశారు. 

సామాజిక, నైతిక విలువలను తనకు కేసీఆర్ నేర్పించారని హిమాన్షు తెలిపారు. ఎవరిపై, ఎలాంటి వివక్ష చూపకుండా.. అందరినీ సమానంగా చూసే తాతయ్య తనను మంచిగా  తీర్చిదిద్దారని చెప్పారు. ముఖ్యంగా సమాజం పట్ల తనలో సేవా దృక్పథాన్ని నింపిన ఆయనకి ధన్యవాదాలని హిమాన్షు ట్విటర్​లో పేర్కొన్నారు. ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి ముఖ్యంగా తనకోసం అత్యధిక సమయం కేటాయిస్తారని చెప్పారు. తాతయ్య కేసీఆర్ పట్ల తనకి ఎంతో ప్రేమ,అభిమానాలు ఉన్నాయని హిమాన్షు వెల్లడించారు.

మరోవైపు కేసీఆర్ పుట్టిన రోజును ఒడిశాలో ఘనంగా జరిపారు. ఒడిశా మాజీ సీఎం, బీఆర్​ఎస్​ నేత గిరిధర్ గమాంగ్ అనాధాశ్రయంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఖోర్డా జిల్లా కట్నిలోని అనాధ పిల్లల మధ్య కేక్ కట్ చేశారు. కేక్, మిఠాయిలు, బహుమతులు పంచిపెట్టారు. కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ప్రముఖ వ్యక్తులందరు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి పుట్టిన రోజు వేడుకలు ఏపీ సహా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. కేసీఆర్ కటౌట్లతో, బ్యానర్లతో తెలంగాణ అంతా గులాబీమయంగా మారింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.