పార్వతి బ్యారేజ్​ను పరిశీలించిన నిపుణుల బృందం - ఇంజినీర్లను అడిగి వివరాలు సేకరణ - Expert Team Visit Parvathi Barrage

By ETV Bharat Telangana Team

Published : May 23, 2024, 4:09 PM IST

thumbnail
పార్వతి బ్యారేజ్​ను పరిశీలించిన నిపుణుల బృందం ఇంజినీర్లను అడిగి వివరాలు సేకరణ (ETV Bharat)

Central Expert Team Visit Parvathi Barrage : కాళేశ్వరం ప్రాజెక్ట్​ మరమ్మతు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో బ్యారేజ్​లు కుంగిపోవడానికి, మరమ్మతులు చేయడానికి కావల్సిన సమాచారాన్ని సేకరించేందుకు కేంద్రం నుంచి నిపుణుల బృందం రాష్ట్రంలో పర్యటిస్తోంది. ఈ క్రమంలో పెద్దపల్లి జిల్లాలోని మంథని మండలం సిరిపురం వద్ద ఉన్న పార్వతి బ్యారేజ్​ను సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌ నిపుణుల కమిటీ సందర్శించింది. బ్యారేజ్​ కింద భాగంలో 61వ గేటు వద్ద కుంగిన గార్డర్లను బృందం పరీశిలించింది. అనంతరం కుంగిపోవడానికి గల కారణాలను ఇంజినీరింగ్​ అధికారులను అడిగి తెలుసుకుంది.  

Expert Team Visit Parvathi Barrage in Peddapalli : కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్​లను బుధవారం ఈ నిపుణుల బృందం సందర్శించింది. అనంతరం ఆ రెండు బ్యారేజ్​లు కుంగిపోవడానికి కారణాలను అధికారులను సేకరించింది. మహాదేవపూర్ నుంచి ఇవాళ పార్వతీ బ్యారేజ్​కు చేరుకొని వివరాలు సేకరించారు. ఈ కమిటీలో బృందంలో జే.ఎస్. ఎడ్ల బాడ్కర్(జియో టెక్నికల్), డాక్టర్ ధనుంజయ్ నాయుడు (జియో ఫిజికల్), డాక్టర్ ప్రకాష్ పాలయ్ (ఎన్​డీటీ స్టడీస్‌) ఉన్నారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.