PRATHIDWANI: లాకప్‌డెత్‌లు, పోలీస్‌ కస్టడీ హింస ఇంకా కొనసాగాలా?

By

Published : Nov 12, 2021, 10:44 PM IST

thumbnail

ఆత్మగౌరవం.. హుందాతనం...ప్రశాంత వాతావరణంలో జీవనం సాగించడం..! ఈదేశ ప్రతి పౌరుడికి జన్మతః లభించే 'జీవించేహక్కు' సారాంశం ఇది. గాడితప్పిన వ్యవస్థల నుంచి.. దారితప్పిన అధికారగణం నుంచి.. తిరుగులేని రక్షణ కల్పించే కవచకుండలంగా ఈ హక్కులఛత్రం ఉండాలని ఆకాంక్షించారు రాజ్యాంగ నిర్మాతలు. కానీ.. లాకప్​ డెత్‌, కస్టోడియల్ హింసల రూపంలో ఎదురవుతున్న కొన్ని అవాంఛిత ఘటనలు.. మొత్తం వ్యవస్థకే తలవంపులు తీసుకువస్తున్నాయి. దర్యాప్తు, విచారణలకు అతీతంగా చోటు చేసుకుంటున్న హింస, మరణాలు.. రాజ్యాంగం కల్పించిన హక్కుల స్ఫూర్తినే అపహాస్యం చేస్తున్నాయి. ఒక మరియమ్మ రూపంలో.. మరొక వీరశేఖర్ ఆర్తనాదాల రూపంలో నాగరిక సమాజానికి సూటి ప్రశ్నలు సంధిస్తున్నాయి. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని ప్రత్యేక చర్చ.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.