నడుస్తున్న కారులో చెలరేగిన మంటలు - డ్రైవర్​ అప్రమత్తతతో తప్పిన ప్రాణనష్టం - Car Fire Accident In Zaheerabad

By ETV Bharat Telangana Team

Published : May 14, 2024, 4:55 PM IST

thumbnail
నడుస్తున్న కారులో చెలరేగిన మంటలు - డ్రైవర్​ అప్రమత్తతతో తప్పిన ప్రాణనష్టం (ETV Bharat)

Car Fire Accident in Zaheerabad : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో ఓ కారులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. పట్టణంలోని రైల్వే గేట్ వద్ద ఈ సంఘటన జరిగింది. ఇంజిన్ నుంచి పొగలు రావడాన్ని గుర్తించిన డ్రైవర్ కారును రోడ్డుపైనే ఆపేశాడు. అకస్మాత్తుగా మంటలు చెలరేగి వాహనం పూర్తిగా దగ్దమైంది. డ్రైవర్ అప్రమత్తతతో కారులోని ప్రయాణికులు సురక్షితంగా బయటికి దిగేశారు. ప్రమాద సమయంలో అక్కడ ఉన్న స్థానికులు కారు మంటలను అదుపుచేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Car Fire Accident In Sangareddy : ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇంజిన్​లో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు భావిస్తున్నారు. ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతుండటం వాహనదారులను భయాందోళనకు గురి చేస్తోంది. వేసవిలో వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు తెలిపారు. వీలైనంత వరకు వాహనాలను నీడలో ఉంచాలని సూచించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.