ETV Bharat / state

Harish Rao on Hyderabad Development : 'హైదరాబాద్‌ అభివృద్ధి 'రజినీ'కి అర్థమైంది.. ఇక్కడి కాంగ్రెస్, బీజేపీ గజినీలకు అర్థమైతలేదు'

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 21, 2023, 12:58 PM IST

Harish Rao on Hyderabad Development : కాంగ్రెస్‌ నేతలు ఎన్ని దొంగ డిక్లరేషన్‌లు ప్రకటించినా.. తెలంగాణ ప్రజలు మరోసారి కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయటం ఖాయమని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచమంతా తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే.. ఇక్కడున్న కాంగ్రెస్, బీజేపీ నేతలకు మాత్రం కనిపించటం లేదని మండిపడ్డారు. పటాన్‌చెరు నియోజకవర్గంలో 2 పడక గదల ఇళ్ల పంపిణీ కార్యక్రమానికి హరీశ్‌రావు హాజరయ్యారు.

Harish Rao Distributed 2BHK Houses in Kollur
Harish Rao on Hyderabad Development

Harish Rao on Hyderabad Development హైదరాబాద్‌ అభివృద్ధి రజినీకి అర్థమైంది ఇక్కడి కాంగ్రెస్ బీజేపీ గజినీలకు అర్థమైతలేదు

Harish Rao on Hyderabad Development : పేదలు ఆత్మ గౌరవంతో బతికాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ పరిధిలో దాదాపు రూ.10 వేల కోట్లు వెచ్చించి అన్ని సౌకర్యాలతో దాదాపు లక్ష డబుల్ బెడ్‌ రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టారు.

అందులో భాగంగా తొలి విడతలో ఎన్‌ఐసీ రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా ర్యాండమైజేషన్ పద్దతిలో ఆన్‌లైన్ డ్రా నిర్వహించారు. 11 వేల 700 మంది లబ్దిదారులను ఎంపిక చేసి ఈ నెల 2న 8 ప్రాంతాల్లో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ఇళ్లు పంపిణీ చేశారు. ఈ నెల 15న మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో ఆన్‌లైన్ డ్రా నిర్వహించి మరో 13 వేల 300 మంది లబ్దిదారులను ఎంపిక చేశారు. డ్రాలో ఎంపికైన లబ్దిదారులకు నేడు 9 ప్రాంతాల్లో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ఇళ్లను పంపిణీ చేశారు.

Harish Rao Distributed 2BHK Houses in Kollur : సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని కొల్లూరు-2లో 4800 మందికి వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు(Minister Harish Rao) ఇళ్ల పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా 60 ఏళ్లలో కాంగ్రెస్‌ పార్టీ చేయని పనులను కేసీఆర్‌ చేశారని పేర్కొన్నారు. కుళాయి ద్వారా ఇంటింటికీ మంచి నీరు అందిస్తున్నామని.. కొల్లూరులో ప్రభుత్వ పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం, బస్తీ దవాఖానా(Basti Dawakhana Telangana) ఏర్పాటు చేస్తామని తెలిపారు.

కొల్లూరుకు ఆర్టీసీ బస్సులు వచ్చేలా చూస్తామన్న హరీశ్ రావు .. ప్రపంచమంతా భాగ్యనగర అభివృద్ధి గురించి మాట్లాడుకుంటున్నారని అన్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌ అభివృద్ధి 'రజినీ'కి అర్థమైందని.. ఇక్కడి కాంగ్రెస్‌, బీజేపీ గజినీలకు మాత్రం కనపడటం లేదని మండిపడ్డారు. కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధిని గల్లీ గల్లీకి, ఇంటింటికీ వివరించాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ నేతలు ఎన్ని దొంగ డిక్లరేషన్‌లు ప్రకటించినా.. తెలంగాణ ప్రజలు మరోసారి కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Telangana Double Bedroom Application Status Check Online : ఆన్​లైన్​లో 'డబుల్ బెడ్ రూం' అప్లికేషన్ స్టేటస్.. ఎలా చెక్ చేసుకోవాలో తెలుసా?

"60 ఏళ్లలో కాంగ్రెస్‌ పార్టీ చేయని పనులను కేసీఆర్‌ చేశారు. కుళాయి ద్వారా ఇంటింటికీ మంచినీరు అందిస్తున్నాం. కొల్లూరులో ప్రభుత్వ పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం, బస్తీ దవాఖానా ఏర్పాటు చేస్తాం. కొల్లూరుకు ఆర్టీసీ బస్సులు వచ్చేలా చూస్తాం. ప్రపంచమంతా హైదరాబాద్‌ అభివృద్ధి గురించి మాట్లాడుకుంటున్నారు. కాంగ్రెస్‌, బీజేపీకి మాత్రం హైదరాబాద్‌ అభివృద్ధి కనపడటం లేదు. కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధిని గల్లీ గల్లీకి, ఇంటింటికీ వివరించాలి. కాంగ్రెస్‌ నేతలు ఎన్ని దొంగ డిక్లరేషన్‌లు ప్రకటించినా.. తెలంగాణ ప్రజలు మరోసారి కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయటం ఖాయం." - మంత్రి హరీశ్‌రావు

2BHK Houses Distribution in Hyderabad Today : ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని చర్లపల్లిలో వెయ్యి మందికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani Srinivas Yadav) పట్టాలు పంపిణీ చేశారు. మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని జవహర్‌నగర్‌-3లో 1200 మందికి మంత్రి మల్లారెడ్డి, ప్రతాప సింగారంలో 1100 మంది లబ్దిదారులకు ఇళ్లు పంపిణీ చేశారు. మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని మన్‌సాన్‌పల్లిలో 700 మందికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి పట్టాలు పంపిణీ చేశారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని తట్టి అన్నారంలో 1268 మందికి మంత్రి మహమూద్‌ అలీ, హత్తిగూడలో 432 మంది లబ్దిదారులకు మంత్రి మహేందర్‌ రెడ్డి, తిమ్మాయిగూడలో 600 మందికి ఇళ్ల పట్టాల పంపిణీలో జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి పాల్గొన్నారు.

Double Bedroom Houses Distribution in Hyderabad : జాతరగా ఇళ్ల పంపిణీ.. కల నెరవేరిన వేళ లబ్ధిదారుల ఆనందం 'డబుల్'

Double Bedroom Housing Community at Kollur : కొల్లూర్​లో ఆసియాలోనే అతిపెద్ద 2BHK ప్రాజెక్టు.. రేపే ప్రారంభోత్సవం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.