2BHK Inauguration in Hyderabad : 'కళ్లుండి కూడా.. కొందరు చూడలేకపోతున్నారు'
Published: May 18, 2023, 6:15 PM


2BHK Inauguration in Hyderabad : 'కళ్లుండి కూడా.. కొందరు చూడలేకపోతున్నారు'
Published: May 18, 2023, 6:15 PM
TS 2BHK Inauguration in Hyderabad : హైదరాబాద్‌లో పేదలకు లక్ష గృహాలను ప్రభుత్వం నిర్మించి ఇచ్చిందని కళ్లుండి కూడా కొందరు చూడలేకపోతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ విమర్శించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని కమలానగర్, ఎస్పీఆర్ హిల్స్‌లో రెండు పడక గదుల ఇళ్ల సముదాయం ప్రారంభోత్సవానికి ఆయన హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే గోపీనాథ్‌తో కలిసి లబ్ధిదారులకు మంత్రి పట్టాలు పంపిణీ చేశారు. గత ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చినా నాటి బకాయిలను కేసీఆర్ సర్కారే మాఫీ చేసిందని చెప్పారు. కేసీఆర్ హయాంలో బస్తీల రూపురేఖలు మారిపోయాయని తలసాని తెలిపారు.
TS 2BHK Inauguration in Hyderabad : ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాల ద్వారా పేద ప్రజల సొంతింటి కల నెరవేరిందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం కమలానగర్ ఎస్.పి.ఆర్ హిల్స్ లో రూ. 1785 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన 210 డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ సముదాయాన్ని మంత్రి ప్రారంభించారు. ప్రజల సమస్యలను సరైన నాయకుడు మాత్రమే గుర్తించి దాని పరిష్కారానికి ఎన్ని కోట్లు అయినా ఖర్చు పెడతారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పేద ప్రజలు ఆత్మగౌరవంతో బతికేలా రెండు పడక గదుల ఇళ్లను హైదరాబాద్‌లో లక్షకు పైగా నిర్మిస్తున్నామని తెలిపారు.
ఒక్కో ఇంటికి రూ.8లక్షలకు పైనే ఖర్చు: కమలానగర్లో రెండు బ్లాక్‌లలో 7 లిఫ్ట్‌లతో మొత్తం 210 డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం మొత్తం రూ. 16 కోట్ల 27 లక్షల 50 వేల రూపాయల వ్యయంతో చేపట్టారన్నారు. రూ.157.50 లక్షల వ్యయంతో మౌలిక సదుపాయాల కల్పన పనులు చేపట్టడం జరిగిందన్నారు. ఈ కాలనీకి 100 కె.ఎల్ లీటర్ల కెపాసిటీ గల వాటర్ ట్యాంక్, విద్యుత్ సౌకర్యంతో పాటుగా 15 షాపులు కూడా ఏర్పాటు చేశారని అన్నారు. ఒక్కో డబుల్ బెడ్ రూం ఇల్లుకు రూ. 8,50,000 వ్యయం చేయడం జరిగిందన్నారు. 89 మంది లబ్ధిదారులకు ఇళ్ల పంపిణీ చేపట్టామని, మిగతా 121 మందికి స్థానిక ఎమ్మెల్యే, రెవెన్యూ అధికారులు పరిశీలించి త్వరలోనే అందజేస్తామని తెలిపారు.
స్థానిక నివాసులై ఉండాలి: స్థానికంగా నివాసం ఉండి ఆధార్, కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు, రేషన్ కార్డు ఉన్నవారికి ప్రాధాన్యత క్రమంలో డబుల్ బెడ్ రూం ఇళ్లను అందజేస్తున్నామని తెలిపారు. దీనికి ప్రత్యేకంగా కమిటీని కూడా నియమించడం జరుగుతుందన్నారు. నోటరి ఇళ్లలో నివసిస్తున్న పేద ప్రజలకు 58 జీవో ద్వారా ఇళ్ల పట్టాలను అందజేస్తామని పేర్కొన్నారు. ఈ డబుల్ బెడ్ రూం ఇళ్ల కేటాయింపులో దళారులను నమ్మి డబ్బులను ఇవ్వకూడదని, వీటిని పారదర్శకంగా అందజేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. నిర్మించిన ఇప్పటికే మురళీధర్ బాగ్‌లో డబుల్ బెడ్ రూం ఇళ్లను లబ్దిదారులకు అందించడం జరిగిందని వివరించారు. త్వరలో ఎర్రగడ్డ లో డబుల్ బెడ్ రూం ఇళ్ల పట్టాలను లబ్దిదారులకు అందజేస్తామన్నారు.
"ప్రభుత్వం రూ. 8 లక్షలు ఖర్చు చేసి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించింది. పేద ప్రజలకు సొంతింటి కల నెరవేర్చేందుకు కృషి ఈ ప్రభుత్వం కృషి చేస్తోంది. రాష్ట్రంలో ఇంత అభివృద్ధి జరుగుతుంటే కొందరు కళ్లుండి కూడా చూడలేకపోతున్నారు." -తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి
ఇవీ చదవండి:
