ETV Bharat / state

Boy died in Accident in Nizambad : కుటుంబం కోసం తండ్రి దుబాయ్ నుంచి వస్తే ప్రమాదంలో కొడుకు మృతి

author img

By

Published : May 9, 2023, 5:55 PM IST

Updated : May 9, 2023, 7:04 PM IST

Boy Accident In Nizamabad : నిజామాబాద్ జిల్లా బోధన్​కి చెందిన దీపక్ తేజ్​ని ఆదివారం గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. గాయపడిన దీపక్​ను స్థానికులు ప్రభుత్వాసుత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుమారుడి మరణవార్త విన్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, వాహనాన్ని గుర్తించి బోధన్ పోలీస్​స్టేషన్​కు తరలించారు.

Accident
Accident

A Boy In nizambad died in Accident : నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం​లో కారు ఢీకొన్న ఘటనలో తీవ్రగాయాల గాయాలపాలై చికిత్స పొందుతున్న బాలుడు దీపక్​తేజ్ మృతి చెందాడు. పరిస్థితి విషమించడంతో వైద్యులు దీపక్​ను హైదరాబాద్​కు తరలించాలని సూచించారు. తీసుకెళ్లె క్రమంలో మార్గ మద్యంలోనే దీపక్​ ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం సాయంకాలం ఎమ్మెల్యే అనుచరులు ప్రయాణిస్తున్న కారు బోధన్ పట్టణంలోని మర్రి మైసమ్మ దగ్గర్లోని రాయల్​గార్డెన్ సమీపంలో అజయ్ అలియాస్ దీపక్ అనే బాలుడిని ఢీకొట్టింది.

ఒక్కసారిగా బాలుడు ఎగిరి పడడంచే అతడికి తీవ్ర గాయలయ్యాయి. కళ్లముందు కుమారుడు అలా అయ్యేసరికి అందరు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే దీపక్​ను నిజమాబాద్​ ఆస్పత్రికి తరలించారు. మెదడుకు తీవ్రగాయాలు కావడంతో వెంటిలేటర్​పై ఉంచి చికిత్స అందించారు. అయితే దీపక్​ పరిస్థితి క్లిష్టంగా మారింది. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. వైద్యం కోసం హైదరాబాద్ తరలించాలని అనుకున్నారు. ఆసుపత్రికి తరలించే తరుణంలో మార్గం మధ్యలోనే దీపక్​ ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదానికి కారణమైన కారు ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడిదని బాధితుడి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. నిందితునిపై వెంటనే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు.

అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారుడు: బోధన్ పట్టణానికి చెందిన ఒడ్డన్న రాధా, బాబు దీపక్ తల్లిదండ్రులు. వీరికి వివాహమై చాలా కాలమైనా పిల్లలు పుట్టలేదు. 14 సంవత్సరాల తర్వాత వీరికి సంతానం కలిగింది. దీపక్ తేజ్​ ఏకైక సంతానం కావటంతో అల్లరుముద్దుగా పెంచారు. ఇవాళ ప్రమాదంలో ఉన్న ఒక్కగానొక్క కుమారుడు మరణించడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.

వారికోసం వేరే దేెశం వెళ్లి పని చేసి: కుటుంబం కోసం బాబు కొన్ని సంవత్సరాలు దుబాయిలో పని చేశాడు. వారికోసమే మళ్లి అక్కడ పనులు వదులేసుకొని వచ్చి కుటుంబంతో ఆనందంగా ఉంటున్నాడు. ప్రస్తుతం ఓ బార్​లో వెయిటర్​గా పని చేస్తున్నాడు. దీపక్ తండ్రి కుటుంబంతో ఎంతో ఆనందంగా ఉంటున్నాడు. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు ఇలా అవ్వడంతో తల్లిదండ్రలు షాక్​కు గురయ్యారు. ప్రాణాలు కోల్పోయిన దీపక్ తేజ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోధన్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోస్ట్​మార్టం పూర్తిచేసి కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. ఎమ్మెల్యే బాధిత కుటుంబానికి అండగా ఉంటానని తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో బాలుడి మృతి

ఇవీ చదవండి:

Last Updated :May 9, 2023, 7:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.