ETV Bharat / science-and-technology

11 యాప్స్​పై గూగుల్ బ్యాన్​.. మీ మొబైల్​లో ఉంటే వెంటనే అన్​ఇన్​స్టాల్​.. లేదంటే డేంజర్!

author img

By

Published : May 9, 2023, 1:31 PM IST

వినియోగదారుల భద్రత కోసం 11 యాప్​లను బ్యాన్​ చేసింది గూగుల్​. వీటిని వినియోగదారులు తమ స్మార్ట్​ఫోన్ల నుంచి డిలీట్ చేయకపోతే.. భారీ మూల్యం చెల్లించక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటంటే..

Google bans 11 popular Android apps
Google bans 11 popular Android apps

వినియోగదారుల భద్రతను దృష్టిలో పెట్టుకుని 11 ఆండ్రాయిడ్​ యాప్​లపై బ్యాన్​ విధిస్తూ నిర్ణయం తీసుకుంది గూగుల్​. కొన్ని యాప్​లు తమ వినియోగదారుల గోప్యత, భద్రతకు భంగం కలిగిస్తుంటాయి. అవి వారి వ్యక్తిగత సమాచారాన్ని వారి అనుమతి లేకుండానే దొంగిలించి.. వాటిని ఇతరులతో పంచుకోవడం చేస్తూ ఉంటాయి. అలాంటి యాప్​లను గుర్తించి వాటిని బ్యాన్ చేస్తుంది గూగుల్​. అయితే తాజాగా అలాంటి మరో 11 యాప్స్​పై నిషేధం విధించింది. గూగుల్​ ప్లే స్టోర్​ నుంచి వాటిని తొలగించింది. వీటిలో సబ్​స్క్రిప్షన్​ ట్రోజన్​ అనే మాల్వేర్ ఉందని పలువురు భద్రతా నిపుణులు కనుక్కున్నారు. వీటిని వినియోగదారులు సైతం తమ ఫోన్ నుంచి తొలగించాలని హెచ్చరిస్తున్నారు.

వీటిని ఒకసారి ఇన్​స్టాల్ చేసుకున్న తర్వాత ఇందులోని బగ్ మన ఫోన్​లోకి వస్తుంది. ఆ తర్వాత మనకు తెలియకుండానే ఖరీదైన నెలవారీ సబ్​స్క్రిప్షన్​ను కోసం ఆటోమెటిక్​గా సైన్ అప్ చేస్తుంది. అయితే వినియోగదారులు ఇలాంటి వాటిని కనుక్కోలేరు. ఫలితంగా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఈ యాప్‌లను ఇప్పటివరకు 6,15,000 కంటే ఎక్కువ సార్లు డౌన్‌లోడ్ చేసుకున్నారని భావిస్తున్నారు. ఇవి ప్రమాదమని తెలిసిన వెంటనే వాటిని తొలగించారు. కానీ ఇప్పటికే వీటిని డౌన్​లోడ్ చేసుకుని, అలానే ఉంచిన వారు మాత్రం ప్రమాదంలో ఉన్నారు. మరి ఆ యాప్స్ ఏంటో తెలుసుకోండి..

  1. Beauty Camera Plus
  2. Beauty Photo Camera
  3. Beauty Slimming Photo Editor
  4. Fingertip Graffiti
  5. GIF Camera Editor
  6. HD 4K Wallpaper
  7. Impressionism Pro Camera
  8. Microclip Video Editor
  9. Night Mode Camera Pro
  10. Photo Camera Editor
  11. Photo Effect Editor

మీరు కూడా మీ డివైజ్​లో ఈ యాప్స్​ ఏవైనా ఉంటే.. వెంటనే వాటిని తొలగించండి. దీంతో పాటు మీ అనుమతి లేకుండా.. మీకు తెలియకుండా ఏవైనా సబ్​స్క్రిప్షన్ జరిగిందా? అందుకు మీ ఖాతా నుంచి చెల్లింపులు జరిగాయో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ ట్రోజన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా పలువురు వినియోగదారులు ప్రభావితమయ్యారు. థాయిలాండ్, పోలండ్, మలేషియా, ఇండోనేషియా, సింగపూర్ వంటి దేశాల్లో అధికశాతం మంది బాధితులు ఉన్నారు.

ఈ అంశంపై భద్రతా నిపుణుడు కాలినిన్ మాట్లాడుతూ.. "మా దగ్గరున్న డేటా ప్రకారం ఇది గతేడాది నుంచే ఉంది. ఈ 11 యాప్స్​ ప్లే స్టోర్​లో ఉన్నాయి. అంతేకాకుండా 6,20,000 డివైజ్​లలో వీటిని ఇన్​స్టాల్​ చేసుకున్నారు. అయితే.. ప్రస్తుతం వాటిని ప్లే స్టోర్ నుంచి తీసేశారు." అని చెప్పారు.

ఇవీ చదవండి : 5G వల్ల మీ ఫోన్​ ఛార్జింగ్ అయిపోతుందా?.. ఈ సింపుల్​ టిప్​తో అంతా సెట్​!

గూగుల్ డ్రైవ్‌ నిండిపోయిందా? ఈ 5 క్లౌడ్ బ్యాకప్ టూల్స్ ట్రై చేయండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.