ETV Bharat / state

Gudigunta pond land kabja : కబ్జా కోరల్లో గుడికుంట చెరువు శిఖం భూమి

author img

By

Published : May 24, 2023, 2:50 PM IST

Updated : May 25, 2023, 1:43 PM IST

Gudigunta pond land kabja in mulugu : ఆ చెరువు... 450 ఎకరాలకు సాగు నీరు అందిస్తోంది. పాతికేళ్ల క్రితం నీటిపారుదలశాఖ నిర్మించింది. ఆయకట్టుదారులు ఏటా రెండు పంటలు పండిస్తున్నారు. ఇటీవల ఈ జల భాండాగారంపై అక్రమార్కుల కన్ను పడింది. రికార్డులను తారుమారు చేసి.. అధికారుల అండతో చెరువు శిఖం భూమిలో దర్జాగా మట్టి నింపేస్తున్నారు. జాతీయరహదారి పక్కనే ఉండటం వల్ల...విలువైన భూమిని పరిరక్షించాలని రైతులు వేడుకుంటున్నారు.

Illegal Encroached the Pond in Jawahar nagar Mulugu District
పాత రికార్డులను తొలగించకపోవడంతో.. చెరువు కబ్జాకు పాల్పడుతున్న వ్యాపారి

పాత రికార్డులను తొలగించకపోవడంతో.. చెరువు కబ్జాకు పాల్పడుతున్న వ్యాపారి

Gudigunta pond land kabja in Mulugu District : ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలం జవహర్‌నగర్‌లో గుడికుంట శిఖం భూమి కబ్జాకు గురవుతోంది. హైదరాబాద్‌కు చెందిన స్థిరాస్తి వ్యాపారి... కోట్ల విలువైన స్థలాన్ని చెరపట్టేందుకు రంగంలోకి దిగాడు. తన అనుచరుల పేరిట తప్పుడు రికార్డులు సృష్టించి... శిఖం భూమిలో మట్టిని నింపేస్తున్నారు. ఇదేంటని అడిగితే బెదిరించడమే కాకుండా... అధికారుల అండతో బోర్లు సైతం వేసేందుకు ప్రయత్నిస్తున్నారని స్థానికులు అడ్డుకున్నారు. దాదాపు 450 ఎకరాల ఆయకట్టు ఉన్న చెరువును కాపాడాలని అన్నదాతలు కోరుతున్నారు.

"ఈ గ్రామానికి సంబంధించి 30 సంవత్సరాం క్రితం ఈ చెరువును తవ్వారు. కబ్జా దారులు మా భూములను, చెరువును కబ్జా చేస్తున్నారు. ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఈ చెరువు 450 ఎకరాలను నీరును అందిస్తుంది. రెవెన్యూ వాళ్ల నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు ఎవరో వచ్చి చెరువును కూడుపుతున్నారు. అప్పట్లో పరిహారం అందించాక రెవెన్యూ అధికారులు రికార్డులు తొలగించలేదు. అందువల్ల ఇప్పుడు వారు వచ్చి దౌర్జన్యానికి పాల్పడుతున్నారు." - రైతులు

163వ జాతీయ రహదారికి ఆనుకుని ఉండటం వల్ల స్థిరాస్తి వ్యాపారులు భూదందాకు తెరలేపారు. రికార్డుల్లో లొసుగులను ఆసరాగా చేసుకుని... ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నా నీటిపారుదల, రెవెన్యూ అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ఆయకట్టుదారులు ఆరోపిస్తున్నారు. చెరువు శిఖం భూముల్లో వెంచర్ చేసేందుకు మట్టి పోసి చదును చేస్తున్నా పట్టించుకునే నాథుడు లేడని వాపోతున్నారు.

"గత రెండు నెలలుగా ఈ చెరువు కబ్జాకు గురవుతోంది. చెరువు ఏర్పడినప్పుడు పరిహారం తీసుకున్నవాళ్లు ఆ రికార్డులను రెవెన్యూ వాళ్లు తొలగించకపోవడం వల్ల పాత రికార్డులను తీసుకుని హైదరాబాద్ నుంచి ఒక వ్యాపార వేత్త వచ్చి చెరువును కబ్జా చేస్తున్నారు. ఒక్కసారి చెరువు నిండితే పంటలకు నీటి కొరత అనేదే ఉండదు. మేం చాలా రోజులుగా అధికారులను వేడుకుంటున్నాం. ఇప్పటికైనా మాకు న్యాయం జరగాలి." - రైతులు

రంగంలోకి దిగిన నీటిపారుదల అధికారులు : ఆయకట్టుదారుల ఫిర్యాదుతో ఆలస్యంగా రంగంలోకి దిగిన నీటిపారుదల అధికారులు హద్దులు గుర్తించే పనిలో పడ్డారు. రెండున్నర ఎకరాల్లో మట్టి పోసి చదను చేస్తున్నట్లు తేల్చారు. భూ ఆక్రమణపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. మట్టిపోస్తే చెరవులోకి నీరు చేరవని...అందుకే వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రెవెన్యూ, నీటిపారుదల అధికారులు సమన్వయంతో పని చేసి ... తమకు బతుకునిస్తున్న గుడికుంటను కాపాడాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.

ఇవీ చదవండి:

Last Updated :May 25, 2023, 1:43 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.