ETV Bharat / state

కేసీఆర్ సర్కార్ వైఫల్యాలే ఆయుధంగా ప్రజల్లోకి విపక్షాలు

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 7, 2023, 9:28 AM IST

Election Campaign in Telangana 2023
Opposition Parties Election Campaign in Telangana 2023

Opposition Parties Election Campaign in Telangana 2023 : అధికార పార్టీని ధీటుగా ఎదుర్కొనేలా ప్రతిపక్షాలు ప్రణాళికలు రచిస్తున్నాయి. ప్రభుత్వంలోని లోపాలను ఎత్తిచూపుతూ.. ప్రజల్లోకి వెళుతున్నాయి. తమకు ఒక్క అవకాశం ఇవ్వాలని.. అధికారంలోకి వస్తే ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తామంటూ హామీలను ఇస్తున్నాయి.

బీఆర్‌ఎస్‌ లోపాలను ఎత్తిచూపడమే లక్ష్యంగా విపక్షాల ఎన్నికల ప్రచారం

Opposition Parties Election Campaign in Telangana 2023 : రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పక్షాన్ని ధీటుగా ఎదుర్కొనేలా విపక్షాలు ప్రచారం(Telangana Election Campaign)లో జోరును పెంచాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డికి మద్దతుగా ఆయన కుటుంబసభ్యులు ప్రచారాన్ని నిర్వహించారు. సికింద్రాబాద్ సనత్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థి కోట నీలిమ సమక్షంలో పెద్ద ఎత్తున యువకులు, మహిళలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలను కైవసం చేసుకుంటుందని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌ కుమార్ గౌడ్ అన్నారు. ఎన్నికల ముందు పార్టీలు ఇచ్చే డబ్బులు తీసుకుని.. కాంగ్రెస్‌కే ఓటు వేయండని పీసీసీ కార్యనిర్వాక అధ్యక్షుడు, ముషీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి అంజన్‌కుమార్ యాదవ్ సూచించారు.

Congress Campaign in Khammam : ఖమ్మంలోనూ అన్ని పార్టీల నాయకులు ఎన్నికల్లో ప్రచార జోరు పెంచారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు తమదైన శైలిలో ప్రజల్లోకెళ్తున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీ(Congress Party Rally in Mancherial) నిర్వహించగా.. మందమర్రి నుంచి ప్రారంభించిన ర్యాలీలో కాంగ్రెస్ నాయకుడు వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌ రెడ్డి ప్రజాధనాన్ని దోచుకోని, దాచుకుందని మెదక్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మైనంపల్లి రోహిత్ రావు విమర్శించారు.

Komatireddy Rajagopal Reddy Election Campaign : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి ఏ.చంద్రశేఖర్ ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీలో ఫైరవీల రాజ్యం కొనసాగుతుందని నిర్మల్ జిల్లా మథోల్ నియోజకవర్గ నాయకుడు కిరణ్ కుమార్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. నాగార్జున సాగర్ నియోజక వర్గంలో దాదాపు 100 కుటుంబాలకు చెందిన బీఆర్‌ఎస్‌ నాయకులు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి జై వీర్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో రోడ్ షోలో మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ గోపాల్‌ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి వేముల వీరేశం పాల్గొన్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే సీతక్క(MLA Seethakka) ఇంటిటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్‌తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ హుజూరాబాద్‌ ఎమ్మెల్యే అభ్యర్థి వొడితల ప్రణవ్‌ అన్నారు.

బీఆర్​ఎస్ వైఫల్యాలను వివరిస్తూ ఇంటింటికి కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల ప్రచారాలు

BJP MP Dharmapuri Arvind Campaign in Metpally : ఎన్నికల ప్రచారంలో భాగంగా సికింద్రాబాద్‌ సనత్ నగర్ నియోజకవర్గంలో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్(Goa CM Pramod Sawant) పర్యటించారు. బీజేపీ అభ్యర్థి మర్రి శశిధర్ రెడ్డికి మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించారు. అంబర్‌పేట్ నియోజకవర్గంలోని కాచిగూడ డివిజన్ లింగంపల్లిలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రి కృష్ణ యాదవ్ తన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటా తిరిగి పాదయాత్ర నిర్వహించారు.

కేసీఆర్‌ కోట్లాది రూపాయలతో కొత్త ప్రాజెక్టులు నాణ్యత లేకుండా నిర్మించి ప్రజాధనం వృథా చేస్తున్నారని నిజామాబాద్ ఎంపీ, కోరుట్ల బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌ ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో రోడ్ షో నిర్వహించారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ డోర్నకల్ ఎమ్మెల్యే అభ్యర్థి భూక్య సంగీత చెప్పారు. జగిత్యాల పట్టణంలోని బీజేపీ అభ్యర్థి డాక్టర్‌ బోగ శ్రావణి ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా డిచిపల్లి మండలం నడిపల్లి శివారులో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎస్టీ మోర్చా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు రాబోతుందని.. ప్రజల ఆశీర్వాదంతో బీజేపీ అధికారంలోకి రానున్నట్లు నల్గొండ అసెంబ్లీ అభ్యర్థి మాదగాని శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

కమలదళం ప్రచార జోరు త్వరలోనే రంగంలోకి అగ్రనేతలు

Telangana Election Polls 2023 : రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు రోజురోజుకి మరింత రసవత్తరంగా మారుతున్నాయి. తాజాగా మజ్లిస్ పార్టీ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఏఐఎంఐఎం పార్టీ అభ్యర్థిగా మహ్మద్‌ రషీద్‌ ఫరాజ్‌ను ఆ పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. బీజేపీ నాయకుడు ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ పవన్ కల్యాణ్‌ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. రానున్న ఎన్నికల్లో తాము సైతం పోటీ చేస్తున్నామంటూ ప్రజా శాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ ప్రకటించారు. రాష్ట్రంలో తమకు బలమున్న 20 స్థానాల్లో అభ్యర్థులను నిలపనున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. అలంపూర్ నియోజకవర్గ పరిస్థితి దయనీయంగా మారిందని, పాలకులు ప్రజల కష్టాలను తీర్చకుండా వాళ్ల కుమ్ములాటలతో గడుపుతున్నారని మహబూబ్‌నగర్‌ జిల్లా బీఎస్పీ అధ్యక్షుడు ఎంసీ కేశవరావు అన్నారు.

ప్రచారంలో జోరు పెంచిన కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీలపై స్పెషల్ ఫోకస్​

హైదరాబాద్‌పై ఈసారి పట్టు ఎవరిదో? సర్వశక్తులు ఒడ్డుతున్న ప్రధాన పార్టీలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.