ETV Bharat / entertainment

బీసీసీఐ హెడ్​కోచ్ రేసులో టాలీవుడ్ స్టార్ - చివరికి ఏమైందంటే ? - Rahul Ravindran BCCI Head Coach

author img

By ETV Bharat Telugu Team

Published : May 15, 2024, 7:35 PM IST

Updated : May 15, 2024, 9:09 PM IST

Rahul Ravindran BCCI Head Coach : బీసీసీఐ హెడ్​ కోచ్​ కోసం స్టార్ హీరో రాహుల్ రవీంద్రన్ దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆయన అప్లికేషన్​ను బీసీసీఐ రిజెక్ట్ చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే ?

Rahul Ravindran BCCI Head Coach
Rahul Ravindran BCCI Head Coach (Source : ETV Bharat Archives)

Rahul Ravindran BCCI Head Coach : ప్రస్తుత బీసీసీఐ హెడ్​ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో బీసీసీఐ ఇప్పటికే ఆ స్థానం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ అప్లికేషన్లను కాస్త ఓపెన్​ గూగుల్ ఫార్మ్స్​లో అందుబాటులో ఉంచారు. దీంతో ఇదే అదునుగా చేసుకుని పలువురు నెటిజన్లు సరదాగా ఈ ఫార్మ్స్​ను ఫిల్ చేసి ఆ స్క్రీన్​షాట్​ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీంతో బీసీసీఐకి తలనొప్పి వచ్చినంత పని అయ్యింది. కొన్ని వందల అప్లికేషన్లు రావడం వల్ల ఆ సంస్థ ఒక్కసారిగా కన్​ఫ్యూజన్ అయిపోయింది.

అయితే నెటిజన్లు లాగే టాలీవుడ్​కు చెందిన ఓ స్టార్ హీరో కూడా బీసీసీఐ హెడ్ కోచ్ పదవీకి దరఖాస్తు చేసుకున్నారు. తాను అప్లై చేసిన విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే ఆ అప్లికేషన్​ను బీసీసీఐ యాక్సెప్ట్​ చేయలేదని వాపోయారు. ఇంతకీ ఏం జరిగిందంటే ?

టాలీవుడ్ స్టార్ హీరో కమ్ డైరెక్టర్ రాహల్ రవీంద్రన్ ఇటీవలే బీసీసీఐ హెడ్ కోచ్ పొజిషన్​ కోసం అప్లై చేశారు. అయితే ఆ ఫార్మ్​ మొత్తం నింపాక ఈ ఫార్మ్​ను మేము స్వీకరించలేము అంటూ మెసేజ్ వచ్చింది. ఇకే ఇదే విషయాన్ని స్క్రీన్​షాట్ తీశారు. దాన్ని ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.

ఫామ్​ నింపడం సరదాగా ఉంటుందని నేను అనుకున్నాను. "మీకు తెలుసా, నేను ఒకసారి టీమ్ ఇండియాకు హెడ్ కోచ్‌ కావాలని అనుకున్నాను" అని ఏదో ఒక రోజు నా పిల్లలకు చెప్పాలని అనుకున్నాను. కానీ" అంటూ క్యాప్షన్​ను జోడించారు.

ఇక ఈ పోస్ట్​ను చూసిన ఫ్యాన్స్ రాహుల్​పై సరదగా మీమ్స్ చేసి నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. 'ఎప్పటికైనా మిమల్ని ఆ పొజిషన్​లో చూస్తాం అన్న' అంటూ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.

ఇక రాహుల్ రవీంద్రన్ సినిమాల విషయానికి వస్తే, 'అందాల రాక్షసి' సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు రాహుల్. ఈ సినిమాలో ఆయన నటనకు మంచి మార్కులు కూడా పడ్డాయి. అయితే దాని తర్వాత ఆయనకు వరుస ఆఫర్లు వచ్చినప్పటికీ అన్ని సపోర్టింగ్​ రోల్సే కావడం గమనార్హం. దీంతో అటు సినిమాలు చేస్తూనే డైరెక్టర్​గానూ పలు మంచి చిత్రాలను ఇండస్ట్రీకి అందించారు. 'చిలసౌ' సినిమాకుగానూ ఆయన నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు. ప్రస్తుతం నేషనల్ క్రష్​ రష్మిక మందన్నతో 'ది గర్ల్​ఫ్రెండ్'​ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం అది షూటింగ్ దశలో ఉంది.

ఇండియన్​ సినిమాలో అత్యంత కాస్ట్లీగా 'రామాయణ్'​ - ఒక్క భాగానికే రూ.835కోట్లా? - Ramayan Movie

సినిమా రిలీజ్​ ముందు గెటప్​ శ్రీను ఊహించని డెసిషన్! - Jabardasth Getup Srinu

Last Updated : May 15, 2024, 9:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.