ETV Bharat / entertainment

ఇండియన్​ సినిమాలో అత్యంత కాస్ట్లీగా 'రామాయణ్'​ - ఒక్క భాగానికే రూ.835కోట్లా? - Ramayan Movie

author img

By ETV Bharat Telugu Team

Published : May 14, 2024, 1:26 PM IST

Ranbir Kapoor Saipallavi Ramayan Movie Budget : రణ్​బీర్ కపూర్ సాయిపల్లవి నటిస్తున్న 'రామాయణ్' సినిమా మొదటి భాగానికి ఏకంగా రూ.835 కోట్ల బడ్జెట్ పెడుతున్నారని తెలిసింది. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.

Source ETV Bharat
Ranbir Kapoor Saipallavi (Source ETV Bharat)

Ranbir Kapoor Saipallavi Ramayan Movie Budget : ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా చిత్రాల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. చాలా మంది నిర్మాతలు, నటీనటులు, దర్శకులు ఇండియన్ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడానికి బాగా శ్రమిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే దాదాపు అన్నీ సినిమాలు భారీ బడ్జెట్​తో తెరకెక్కుతున్నాయి. అలానే వాటిలో కొన్ని సంచలన విజయాలను అందుకుంటున్నాయి. అయితే ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో రూ.100, రూ.200, రూ.500 కోట్ల వరకు బడ్జెట్ విన్నాం కానీ అంతకన్నా ఎక్కువగా వినలేదు. కానీ రణ్​బీర్, సాయిపల్లవి కలిసి నటిస్తున్న 'రామాయణ్' కోసం ఏకంగా రూ.1000 కోట్ల వరకు బడ్జెట్​ పెడుతున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. దీంతో పాటే ఈ చిత్రం దాదాపు మూడు భాగాలుగా రావొచ్చని కూడా అన్నారు.

అయితే ఇప్పుడు మరో షాకింగ్ విషయం బయటకు వచ్చింది. అదేంటంటే ఈ సినిమా బడ్జెట్ రూ.835 కోట్లు అని తెలిసింది. అది కూడా కేవలం తొలి భాగాన్ని తెరకెక్కించడం కోసమట. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. కేవలం ఒక్క భాగం కోసమే అన్ని వందల కోట్లు అంటే మరి సినిమా మొత్తం పూర్తయ్యేసరికి ఎంత అవుతుందనేది ఊహించడం కూడా కష్టంగా మారింది.

పైగా ఈ మూవీ షూటింగ్ కూడా ​600 రోజులనే పూర్తి చేస్తారట. మరి వైరల్ అవుతున్న ఈ బడ్జెట్​, షూటింగ్ టైమ్​ విషయాల్లో ఎంత వరకు నిజముందో తెలీదు కానీ అందరూ దీని గురించే తెగ చర్చించుకుంటున్నారు. ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇదే అత్యంత భారీ బడ్జెట్​ కాస్ట్లీ ఫిల్మ్ అవుతుంది.

మరోవైపు రీసెంట్​గా షూటింగ్ ప్రారంభించుకున్న ఈ సినిమా 2025లోనే విడుదల అవుతుందని మొదట అన్నారు. కానీ ఇప్పుడు 2027 అని అంటున్నారు. ఈ లెక్కన చూస్తే 600 రోజులకుపైగానే షూటింగ్ జరుపుకుంటోంది.

ఇక ఈ చిత్రంలో రాముడిగా రణ్​బీర్ కపూర్​, సీతగా సాయిపల్లవి నటిస్తున్నారు. హనుమంతుడిగా సన్నీ దేఓల్ కనిపించనున్నారు. నితీశ్ తివారి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు కేజీయఫ్ రాకింగ్ స్టార్​ యశ్ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

మరో హాలీవుడ్‌ సినిమాలో ఛాన్స్​ కొట్టేసిన టబు - Tabu Hollywood Film

త్రిష 'ఐడెంటిటీ' క్లోజ్ - Trisha Identity Movie

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.