ETV Bharat / entertainment

మరో హాలీవుడ్‌ సినిమాలో ఛాన్స్​ కొట్టేసిన టబు - Tabu Hollywood Film

author img

By ETV Bharat Telugu Team

Published : May 14, 2024, 10:52 AM IST

Updated : May 14, 2024, 10:58 AM IST

Tabu New Hollywood Film : ఒకప్పుడు టాలీవుడ్​లో స్టార్ హీరోయిన్​గా రాణించి ప్రస్తుతం బాలీవుడ్​లో రాణిస్తున్న టబు హాలీవుడ్​ మూవీలో ఛాన్స్ అందుకుంది. పూర్తి వివరాలు స్టోరీలో.

Source ETV Bharat
Tabu (Source ETV Bharat)

Tabu New Hollywood Film : అందం, అభినయంతో కొన్ని దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీలో రాణిస్తోన్న హీరోయిన్ టబు. రీసెంట్​గా క్రూ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న ఆమె తాజాగా మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఇంటర్నేషనల్ సిరీస్ అయిన హాలీవుడ్ ప్రాజెక్ట్​ 'Dune: Prophecy'లో నటించే అవకాశం దక్కించుకుంది. ఈ సిరీస్‌లో ఆమె సిస్టర్ ఫ్రాన్సెస్కా పాత్రలో కనిపించనున్నట్లు అమెరికన్ సినిమా మీడియా తెలిపింది.

"అట్రాక్టివ్‌గా, స్మార్ట్‌గా, స్ట్రాంగ్‌గా కనిపించే రోల్ పోషిస్తున్నారు టబు. ప్రతి ఒక్క ప్రేక్షకుడికి గుర్తుండిపోయేలా ఉంటుంది ఈ సిస్టర్​ ఫ్రాన్సెస్కా పాత్ర. ఒకప్పుడు చక్రవర్తి ప్రేయసిగా ఉన్న ఆమె తిరిగి ప్యాలెస్​కు రావడం వల్ల అక్కడి అధికారంలో సమతుల్యత దెబ్బ తింటుంది" అని టబూ పాత్రపై మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

వాస్తవానికి ఈ సిరీస్ 2019లో Dune: The Sisterhood పేరుతో అనౌన్స్ చేశారు. Sisterhood of Dune నవల ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ ప్రాజెక్టులో ఎమిలీ వాట్సన్, ఒలివియా విలియమ్స్, జోడీ మే, ట్రావిస్ ఫిమ్మెల్, సారా-సోఫీ బౌస్నినా, మార్క్ స్ట్రాంగ్, క్లౌ లీ, జోష్ హ్యూస్టన్, జాడే అనౌకాలతో పాటు కనించనున్నారు టబు. ప్రముఖ రచయిత ఫ్రాంక్ హెర్బర్ట్ క్రియేట్ చేసిన డ్యూన్ ప్రపంచంలోనే ఈ సిరీస్​ను కూడా నిర్మిస్తున్నారు.

కాగా, టబు హాలీవుడ్‌లో తొలిసారిగా మీరా నాయర్ డైరక్షన్‌లో 'The Name Sake'లో నటించారు. ఇర్ఫాన్ ఖాన్​తో కలిసి నటించిన ఈ సినిమా చాలా పాజిటివ్ టాక్ దక్కించుకుంది. ఆ తర్వాత 2012లో లైఫ్ ఆఫ్ పై సినిమాలో నటించగా, దానికి నాలుగు ఆస్కార్లు దక్కాయి. రీసెంట్‌గా విడుదలై హిట్ టాక్ సంపాదించుకున్న 'క్రూ' సినిమాలోనూ ప్రధాన పాత్రలో కనిపించారు టబు. అంధాదున్, దృశ్యం 2, భూల్ భూలయ్య 2 లాంటి హిట్ సినిమాలతోనూ టబు అలరించారు.
ఇకపోతే తెలుగులో టబు సాధించిన విజయాలు కోకొల్లలు. 1991లో వెంకటేశ్ నటించిన కూలీ నంబర్ 1 మూవీతో టాలీవుడ్​కు పరిచయమైన ఆమె ఆ తర్వాత సిసింద్రీ, నిన్నే పెళ్లాడతా, ఆవిడా మా ఆవిడే అంటూ నాగార్జునతో కలిసి రొమాంటిక్ డ్రామాల్లో నటించి అప్పటి యువత కళ్లల్లో నిలిచిపోయారు.

విడాకులు తీసుకున్న మరో స్టార్​ సెలబ్రిటీ కపుల్ - 11ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి - GV Prakash Divorce

త్రిష 'ఐడెంటిటీ' క్లోజ్ - Trisha Identity Movie

Last Updated :May 14, 2024, 10:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.